E-Paper
Advertisement

Donald Trump: మూడో ప్రపంచ దేశాలపై ట్రంప్ సీరియస్.. వలసలు నిలిపివేస్తామని వార్నింగ్

Donald Trump: మూడో ప్రపంచ దేశాలపై ట్రంప్ సీరియస్.. వలసలు నిలిపివేస్తామని వార్నింగ్
Advertisement

Donald Trump: వాషింగ్టన్‌లో ఆఫ్ఘనిస్థాన్ పౌరుడు ఇద్దరు నేషనల్ గార్డ్ సైనికులను కాల్చి చంపాడని ఆరోపణల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. “మూడో ప్రపంచ దేశాలు” నుండి వలసలను నిలిపివేయాలని యోచిస్తున్నట్లు తెలిపారు. అమెరికా సాంకేతికంగా పురోగతి సాధించినప్పటికీ ప్రస్తుత వలస విధానం ఆ లాభాలను నాశనం చేసిందని తాను నమ్ముతున్నానని ట్రంప్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. అమెరికా వ్యవస్థ పూర్తిగా కోలుకోవడానికి అన్ని మూడో ప్రపంచ దేశాల నుండి వలసలను నిలిపివేయాలని ఆయన అన్నారు.

మిలియన్ల కొద్దీ అక్రమ వలసలు బైడెన్ ప్రభుత్వంలో జరిగాయని ట్రంప్ ఆరోపించారు. వలసదారులు అమెరికా నికర ఆస్తి కాదని, వాళ్లు యూఎస్ ను ప్రేమించలేరని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ప్రజా భద్రతా ప్రమాదం లేదా పాశ్చాత్య నాగరికతకు అనుకూలంగా లేని ఏ విదేశీ పౌరుడైనా బహిష్కరించాలని ట్రంప్ తెలిపారు.

మూడో ప్రపంచ దేశాలు అంటే?

Advertisement

మొదటి, రెండో, మూడో ప్రపంచం అనే ఆలోచన కోల్డ్ వార్ నుంచి పుట్టింది. ఆ సమయంలో ప్రపంచం.. యూఎస్ మద్దతుదారులైన పశ్చిమ కూటమి, కమ్యూనిస్ట్ తూర్పు కూటమిగా విడిపోయింది. ఈ కూటమికి మద్దతు తెలపిని కొన్ని తటస్థ దేశాలు మూడో ప్రపంచ దేశాలుగా మారాయి. తరచుగా వీటిని పేద లేదా అభివృద్ధి చెందని దేశాలను వర్ణించడానికి థర్డ్ వరల్డ్ కంట్రీస్ పదం ఉపయోగిస్తారు.

ప్రపంచ దేశాలు ఇలా

మొదటి ప్రపంచం అంటే అమెరికాతో జతకట్టిన ప్రజాస్వామ్య, పారిశ్రామిక దేశాలను సూచిస్తుంది. రెండవ ప్రపంచం కార్మికులు, రైతుల నేతృత్వంలోని కమ్యూనిస్ట్-సోషలిస్ట్ దేశాలను సూచిస్తుంది. మూడో ప్రపంచం ఏ కూటమికి చెందని మెజారిటీ దేశాలను సూచిస్తుంది. మొదటి ప్రపంచంలో ఉత్తర అమెరికా, పశ్చిమ యూరప్, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా ఉన్నాయి. స్పెయిన్, దక్షిణాఫ్రికా, నమీబియా, స్విట్జర్లాండ్, స్వీడన్, ఆస్ట్రియా, ఐర్లాండ్, ఫిన్లాండ్ ఫస్ట్ వరల్డ్ కంట్రీస్ జాబితాలో ఉండేవి.

Advertisement

రెండో ప్రపంచ దేశాల్లో సోవియట్ యూనియన్, పోలాండ్, తూర్పు జర్మనీ, చెకోస్లోవేకియా, బాల్కన్‌లతో సహా తూర్పు ఐరోపా, చైనా, మంగోలియా, ఉత్తర కొరియా, వియత్నాం, లావోస్, కంబోడియా వంటి ఆసియా కమ్యూనిస్ట్ దేశాలను ఉన్నాయి. మూడో ప్రపంచ దేశాల్లో ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికాలోని అభివృద్ధి చెందని వ్యవసాయ ఆధారిత దేశాలు ఉన్నాయి.

వలసదారులపై ట్రంప్ చర్యలు

రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత ట్రంప్ విపరీతంగా ప్రవరిస్తున్నారు. సుంకాల పెంపుతో ప్రపంచ దేశాల వాణిజ్యంపై దెబ్బకొట్టారు. ఆఫ్ఘనిస్తాన్, 18 ఇతర దేశాల నుంచి ప్రతి శాశ్వత నివాసి లేదా గ్రీన్ కార్డ్ హోల్డర్ ఇమ్మిగ్రేషన్ పరిస్థితిని సమీక్షిస్తామని ట్రంప్ ఇవాళ పేర్కొన్నారు. యూఎస్ పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ డైరెక్టర్ జోసెఫ్ ఎడ్లో ఎక్స్ వేదికగా స్పందిస్తూ ప్రెసిడెంట్ ట్రంప్ ఆదేశాల మేరకు ప్రతి విదేశీయుడి గ్రీన్ కార్డును క్షుణ్ణంగా పునఃపరిశీలన చేస్తామన్నారు.

Also Read: Lakshmi Mittal – Naia Island: బ్రిటన్ నుంచి దుబాయ్ ద్వీపానికి లక్ష్మీ మిట్టల్, ఆ ఐలాండ్ ప్రత్యేకత ఏంటో తెలుసా?

12 దేశాలపై నిషేధం

ఆఫ్ఘనిస్తాన్ సహా 12 దేశాల పౌరులపై అమెరికా ఆంక్షలు విధించింది. ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, చాడ్, కాంగో-బ్రాజావిల్లే, ఈక్వటోరియల్ గినియా, ఎరిట్రియా, హైతీ, ఇరాన్, లిబియా, సోమాలియా, సూడాన్, యెమెన్ దేశాలపై అమెరికా నిషేధం విధించింది. ట్రంప్ అదనంగా మరో ఏడు దేశాల ప్రయాణికులపై పాక్షిక నిషేధాన్ని విధించారు. బురుండి, క్యూబా, లావోస్, సియెర్రా లియోన్, టోగో, తుర్క్మెనిస్తాన్, వెనిజులా ఈ లిస్ట్ లో ఉన్నాయి.

Tags

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×