E-Paper
Advertisement

Bondi Beach Attack: ఆస్ట్రేలియా బోండీ బీచ్‌‌లో ‘ఉగ్ర’ఘాతుకం.. నిందితులు ఎవరో తెలుసా?

Bondi Beach Attack: ఆస్ట్రేలియా బోండీ బీచ్‌‌లో ‘ఉగ్ర’ఘాతుకం.. నిందితులు ఎవరో తెలుసా?
Advertisement

Bondi Beach Attack: ఆస్ట్రేలియాలోని బోడీ బీచ్‌లో ఘాతుకం వెనుక ఏం జరిగింది? ఇది ముమ్మాటికీ ఐఎస్ పనేనా? ఈ మారణహోమానికి పాల్పడింది తండ్రీ కొడుకులేనా? ఉగ్ర దాడి వెనుక అసలు కారణమేంటి? యూదులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు చేశారా? దర్యాప్తులో ఎలాంటి కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి? ఇవే అంశాలు చాలామందిని వెంటాడుతున్నాయి.

ఆస్ట్రేలియా బోండీ బీచ్‌‌లో ‘ఉగ్ర’ఘాతుకం

Advertisement

యూదులను టార్గెట్ చేసుకుని ఆస్ట్రేలియాలోని బోండీబీచ్‌ ఐఎస్ ఉగ్రవాదులు మారణహోమానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఆదివారం యూదుల హనూకా వేడుకలను టార్గెట్ చేశారు. ఈ పండుగను లక్ష్యంగా చేసుకుని ఇద్దరు వ్యక్తులు దాడికి పాల్పడినట్టు తేలింది. అయితే నిందితులిద్దరు తండ్రీ-కొడుకులుగా దర్యాప్తు బృందం గుర్తించింది.

సాజిద్‌ అక్రమ్‌ వయస్సు 50 ఏళ్లు కాగా, అతడి కొడుకు నవీద్‌ అక్రమ్‌ వయస్సు 24 ఏళ్లు. నిందితులిద్దరు పాకిస్థాన్‌ నుంచి వచ్చినట్లు న్యూసౌత్‌ వేల్స్‌ పోలీసులు తెలిపారు. కాల్పుల తర్వాత అలర్టయిన స్థానిక పోలీసులు ఎదురు దాడి చేశారు. ఈ ఘటనలో సాజిద్‌ స్పాట్‌లో మృతి చెందాడు. సాజిద్‌ వద్ద ఆరు ఆయుధాలను అధికారులు స్వాధీనం చేసుకొన్నారు.

Advertisement

నిందితులు తండ్రికొడుకులే

సాజిద్‌‌కు పదేళ్ల కిందట అంటే 2015 నుంచి తుపాకీ లైసెన్స్‌ ఉన్నట్లు న్యూసౌత్‌ వేల్స్‌ పోలీసుల మాట. ఓ హంటింగ్‌ క్లబ్‌లో సభ్యుడిగా ఉన్నాడని గుర్తించారు. నిందితుల్లో ఒకరు ఆస్ట్రేలియా సెక్యూరిటీ ఇంటెలిజెన్స్‌ ఆర్గనైజేషన్‌ ఏజెన్సీ నిఘా‌లో ఉన్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

వాడి నుంచి ఎలాంటి ముప్పు లేకపోవడంతో పోలీసులు సీరియస్‌గా తీసుకోలేదని సమాచారం. ఈ కాల్పులను ఉగ్రవాద సంఘటనగా  ప్రకటించింది ఆస్ట్రేలియా. దాడుల్లో ఓ కారు వద్ద రెండు ఇస్లామిక్ స్టేట్ జెండాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు అంతర్జాతీయ న్యూస్ ఛానెల్ కథనం. ఈ ఘటనలో మొత్తం 16 మంది టూరిస్టులు మృత్యువాత పడ్డారు.

తీవ్రంగా గాయపడిన నవీద్ అక్రమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని న్యూ సౌత్ వేల్స్ పోలీస్ కమిషనర్ మాల్ లాన్యన్‌ తెలిపారు. సెయింట్ జార్జి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నిందితుడి పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు చెబుతున్నారు. సాజిద్-నవీద్ ఇద్దరు పాకిస్థానీయులు. ఇస్లామిక్ స్టేట్-IS గ్రూపుకి విధేయతగా ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు.

ALSO READ:  కాల్పులతో ఉలిక్కిపడిన సిడ్నీ.. టూరిస్టులు పరుగో పరుగు

ఐఎస్ ఉగ్రవాద సంస్థతో నవీద్ అక్రమ్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయట. ఆ కారణంగా ఆస్ట్రేలియా దేశీయ నిఘా సంస్థ-ASIO ఆరు సంవత్సరాలపాటు అతడ్ని పరిశీలించింది. 2019 లో ఆస్ట్రేలియా లో తిరుగుబాటుకు కుట్ర పన్ని అరెస్టయి జైలు శిక్ష అనుభవించిన ఐఎస్ కార్యకర్త ఇసాక్ ఎల్ మటారీతో అతడు సంబంధం కలిగి ఉన్నట్లు సమాచారం.

బోండి బీచ్‌లో ఆదివారం మధ్యాహ్నం హనుక్కా వేడుక జరుపుకోవడానికి దాదాపు వెయ్యి మందికి పైగా ప్రజలు గుమిగూడారు. దీన్ని గమనించిన సాజిద్, పొడవైన బ్యారెల్ తొపాకులతో విచక్షణారహితంగా పర్యాటకులపై కాల్పులకు తెగబడిన విషయం తెల్సిందే.  ఒక్కసారి వెనక్కి వెళ్తే.. గతంలో జమ్మూకాశ్మీర్‌లోని పెహల్‌గామ్‌లో కూడా టూరిస్టులను టార్గెట్ చేశారు టెర్రరిస్టులు.

 

 

Related News

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

బీచ్‌లో గుండె గుభేల్.. నడినెత్తి మీద నుంచి దూసుకెళ్లిన యుద్ధ విమానాలు.. గాల్లోకి ఎగిరిన టెంట్లు!

Big Stories

Advertisement
×