E-Paper
Advertisement

Bondi Beach: కాల్పులుతో ఉలిక్కిపడ్డ సిడ్నీ.. బీచ్ నుంచి పరుగో పరుగు

Bondi Beach: కాల్పులుతో ఉలిక్కిపడ్డ సిడ్నీ.. బీచ్ నుంచి పరుగో పరుగు
Advertisement

ఆస్ట్రేలియా సిడ్నీలోని బాండి బీచ్‌లో యూదుల పండుగ సందర్భంగా జరిగిన భయంకరమైన కాల్పుల ఘటనలో, ఓ పౌరుడు చూపిన ధైర్య సాహసం అందరినీ ఆశ్చర్యపరిచింది. బీచ్‌ పరిసర ప్రాంతాల్లోకి దుండగులు వచ్చి.. ఒక్కసారిగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో మొత్తం 10 మంది మరణించారు.

కాల్పులు జరుగుతున్న సమయంలో, ఒక షూటర్ చెట్టు వెనుక దాగి ఉన్నాడు. ఇంతలో కార్ల వెనుక దాక్కున్న పౌరుడు అసాధారణ ధైర్యంతో, ఆ దుండగుడిపైకి దూకి, అతని మెడ పట్టుకుని కిందకు నెట్టాడు. అంతేకాక, దుండగుడి చేతిలోని రైఫిల్‌ను లాక్కొని, ఆ తుపాకీని షూటర్‌ వైపు గురిపెట్టాడు. పౌరుడి వీరోచిత చర్యతో ప్రాణనష్టం జరగకుండా ఆగిందని భావిస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

పోలీసులు వెంటనే స్పందించి, ఆ షూటర్‌ను కాల్చిచంపగా, మరొక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. పౌరుడు చేసిన సాహసాన్ని పలువులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Advertisement

 

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×