E-Paper
Advertisement

Bus Accident: నదిలోకి దూసుకెళ్లిన బస్సు.. 18 మంది మృతి, నేపాల్‌లో ఘోర విషాదం

Bus Accident: నదిలోకి దూసుకెళ్లిన బస్సు.. 18 మంది మృతి, నేపాల్‌లో ఘోర విషాదం
Advertisement

Bus Accident: నేపాల్‌లో ఘోర ప్రమాదం జరిగింది. బస్సు నదిలోకి దూసుకెళ్లిన ఘటనలో 18 మంది మృతి చెందారు. మరో 28 మంది తీవ్రంగా గాయపడ్డారు. పొఖారా నుంచి ఖాఠ్మండ్ వెళ్తుండగా సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. అసలు ఘటన ఎలా జరిగింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..

నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 18 మంది మృతి

Advertisement

నేపాల్‌లోని ధాడింగ్ జిల్లాలో త్రిశూలి నదిలో బస్సు దూసుకెళ్లింది. ఆదివారం రాత్రి పోఖారా నుండి ఖాట్మండు 45 మంది ప్రయాణికులతో బస్సు బయలు దేరింది. ధాడింగ్‌లోని బెనిఘాట్ రోరాంగ్ సమీపంలో తెల్లవారుజామున ఒంటి గంట బస్సు ఒక్కసారిగా త్రిశూలి నదిలోకి దూసుకెళ్లింది.

ఏం జరిగిందో ప్రయాణికులు తెలుసుకునే లోపు దాదాపు 18 మంది మృత్యువాతపడ్డారు. మరో 25 మంది వరకు గాయపడ్డారు. అందులో పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరణించిన వారిలో న్యూజిలాండ్‌కు చెందినవాడు పర్యాటకుడు ఉన్నాడు. గాయపడిన వారిలో జపాన్, డచ్ జాతీయులు ఉన్నారు.

Advertisement

నదిలోకి దూసుకెళ్లిన బస్సు.. మృతుల్లో విదేశీయులు

రోడ్డు ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది స్పాట్ కు చేరుకుననారు. నేపాలీ సైన్యం, సాయుధ పోలీసు దళం, పోలీసులు, స్థానిక నివాసితులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఘటన రాత్రి వేళ జరగడంతో సహాయక చర్యలు చేపట్టడం కాస్త కష్టంగా మారింది.

వెంటనే క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే మృతుల్లో విదేశీయులు ఉన్నట్లు తెలుస్తోంది. అతివేగం వల్లే ఈ ప్రమాదం జరగవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.ప్రమాదానికి జరిగిన కారణాలు ఇంకా తెలియాల్సి వుంది.

ALSO READ: పాకిస్తాన్ వైమానిక దాడులు.. 28 మంది మృతి, రగిలిపోతున్న తాలిబన్లు

నేపాల్‌లో ఇటీవలికాలంలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. రోడ్లపై తిరిగే వాహనాల సంఖ్య అమాంతంగా పెరిగింది. దశాబ్దం కిందట దాదాపు 5 వేల రోడ్డు ప్రమాదాలు జరిగినట్లు అక్కడి ట్రాఫిక్ పోలీస్ విభాగం తెలిపింది. 2024–25 ఏడాదిలో ఆ దేశంలో 7,669 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. అందులో 190 మరణాలు సంభవించాయని పేర్కొంది.

మొత్తం ప్రమాదాలలో 278 అత్యంత తీవ్రమైనవిగా పేర్కొంది. ప్రపంచ బ్యాంకు నిర్వహించిన ఓ అధ్యయనంలో 2007 నుండి రోడ్డు ప్రమాదాల వల్ల కలిగే నష్టం మూడు రెట్లు పెరిగిందని, ఇది ఆ దేశ స్థూల జాతీయ ఉత్పత్తిలో 1.5 శాతానికి సమానమని ప్రస్తావించిన విషయం తెల్సిందే.

 

 

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×