E-Paper
Advertisement

Alleti Maheshwar Reddy: ఎంపీటీపి, జెట్‌పీటీసీ ఎన్నికల్లో మా సత్తా ఎంటో చూపిస్తాం: ఏలేటి మహేశ్వర్ రెడ్డి

Alleti Maheshwar Reddy: ఎంపీటీపి, జెట్‌పీటీసీ ఎన్నికల్లో మా సత్తా ఎంటో చూపిస్తాం: ఏలేటి మహేశ్వర్ రెడ్డి
Advertisement

Alleti Maheshwar Reddy: మున్సిపల్ ఎన్నికల్లో గెలిచారని కాంగ్రెస్ నేతలు విర్రవీగుతున్నారని, వారికి దమ్ము, ధైర్యం ఉంటే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహిస్తే తెలుస్తుందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ రాక్షస పాలన సాగిస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీ నేతలందరినీ రెండ్రోజులుగా హౌస్ అరెస్టులు చేశారని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి పాలన చేతకావడంలేదని మండిపడ్డారు. కామారెడ్డి ఘటనపై ఇప్పటికీ విచారణ లేదని, దాడికి పాల్పడేవారిపై చర్యలు లేవని ఫైరయ్యారు.

రైతు భరోసా డబ్బులు

బీఆర్ఎస్ తరహాలోనే కాంగ్రెస్ పాలన సాగుతోందని విమర్శించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేక డైవర్షన్ రాజకీయాలను సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. త్వరలో జరిగే ఎన్నికల కోసం ఢిల్లీకి సీఎం కప్పం కట్టడానికి రైతు భరోసా డబ్బులు ఎగ్గొట్టాలని చూస్తున్నారని ఏలేటి విమర్శించారు. ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించేందుకు డబ్బులు ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించారు. ఈనెల 10 తేదీన రిజర్వ్ బ్యాంక్ నుంచి తెచ్చిన రూ.9 వేల కోట్లు ఏం చేశారని ఏలేటి నిలదీశారు.

Advertisement

Also Read: Naveen Krishna: పవిత్ర లోకేష్ గురించి నరేష్ కొడుకు చెప్పింది వింటే షాక్ అవుతారు!.. ఇంట్లో ఎలా ఉంటారంటే?

కమీషన్లను ఢిల్లీకి కప్పం..

కాంట్రాక్టర్లకు డబ్బులిచ్చి వచ్చే కమీషన్లను ఢిల్లీకి కప్పం కట్టడంలేదా?అని ఆరోపించారు. ఎఫ్​ఆర్ బీఎం పరిధి దాటి మరీ అప్పులు తెచ్చి కూడా రైతు భరోసా ఇవ్వడం లేదన్నారు. కుంభకోణాల కోసమే కాంగ్రెస్ పాలన సాగిస్తోందని ఏలేటి ఆరోపించారు. త్వరలో జరిగే కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకుని రైతు భరోసా, ఫీజు రీయింబర్స్ మెంట్, రైటర్డ్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ను అందజేయాలని ఏలేటి డిమాండ్ చేశారు.

Advertisement

Also Read: Kalvakuntla Kavitha: ప్లాన్ ప్రకారం కవిత అడుగులు.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సన్నాహాలు

Related News

తెలంగాణ మహిళపై జమ్మూకశ్మీర్‌లో కేసు నమోదు..!

ఎంవీఎస్ఆర్ కాలేజీ దాండియా ప్రమాదంపై.. ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక ప్రకటన!

ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే సదస్సులకు.. సర్కార్ కొత్త నిబంధనలు!

సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై.. నిజామాబాద్ పోలీసులు యాక్షన్..!

కేసీఆర్‌ కుటుంబ ఆస్తులు స్వాధీనం చేసుకోవాలి! – మాజీ మంత్రి రవీంద్ర నాయక్

సాలార్ జంగ్ మ్యూజియంకు సరికొత్త రూపు.. ఓయూ విద్యార్థులకు కీలక పిలుపు!

దేశంలో అలజడులు సృష్టించే కుట్రలు సాగనివ్వం: రాంచందర్ రావు

కేజీబీవీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. త్వరలో మళ్లీ ఆర్డర్లు?

Big Stories

Advertisement
×