BigTV English

monkey-china : వెలిగే వేళ్లు.. పచ్చటి కళ్ల వానరం

monkey-china : వెలిగే వేళ్లు.. పచ్చటి కళ్ల వానరం
monkey-china

monkey-china : మిణుగురు పురుగుల్లా ఆ చేతి వేళ్లు ప్రకాశిస్తాయి. ఇక కళ్లు ఫ్లోరెసెంట్ గ్రీన్ వర్ణంలో మెరిసిపోతుంటాయి. ఈ లక్షణాలున్న కోతిని మీరెన్నడూ చూసి ఉండకపోవచ్చు. కాల్పనిక జగత్తుకు పరిమితమైన అలాంటి హైబ్రిడ్ వింతజీవి(కైమీరా)కి చైనా శాస్త్రవేత్తలు ప్రాణం పోశారు. ప్రత్యేక కణాలను ఉపయోగించి తొలిసారిగా మగ కోతిపిల్లకు ప్రాణప్రతిష్ఠ చేశారు.


చూసేందుకు వింతగా ఉన్న ఈ పిల్ల వానరం తోక కూడా బారెడు పొడవు ఉండటం విశేషం. వానరజాతికి చెందిన రెండు వేర్వేరు పిండాలను కలిపి కొత్త లక్షణాలున్న కోతిని సృష్టించారు చైనా పరిశోధకులు. ఇలా పుట్టిన బేబీ మంకీ జన్యుపరంగా ఎంతో విభిన్నంగా ఉంది. ఆ పిల్ల కోతి మెదడు, గుండె, లివర్, జీర్ణకోశ వ్యవస్థ, టెస్టిస్‌లో డోనర్(రెండు పిండాలకు చెందిన) మూల కణాలే ఎక్కువగా వృద్ధి అయ్యాయి.

అంతరించిపోతున్న జంతువుల జనాభాను వృద్ధి చేయడానికి తమ పరిశోధన ఉపయోగపడుతుందని చైనా శాస్త్రవేత్తల బృందం చెబుతోంది. అన్నింటికన్నా జంతువుల్లో ఇన్విట్రో ఫెర్టిలైజేషన్(IVF) గురించి మరింత తెలుసుకోవడానికి దోహదపడుతుందని అంటున్నారు. అయితే ఈ పరిశోధనల్లో మరెంతో దూరం ప్రయాణించాల్సి ఉందని అధ్యయన సారథి, చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌కు చెందిన జెన్ లీ అభిప్రాయపడ్డారు.


పౌరాణిక గాథల్లో కైమీరాల గురించి విన్నాం. సింహం, గద్ద కలగలసిన వింత జీవులు కాల్పనిక సాహిత్యానికి పరిమితమని ఇప్పటివరకు అనుకున్నాం. కానీ చైనా శాస్త్రవేత్తల తాజా ప్రయోగంతో అలాంటి సంకర జీవికి కృత్రిమ పద్ధతుల్లో ప్రాణం పోశారు. లీ బృందం పరిశోధన ప్రధానంగా మూలకణాల ఆధారంగా జరిగింది.

ఏడు రోజుల వయసున్న పిండం నుంచి తీసిన స్టెమ్‌సెల్ లైన్‌ను శాస్త్రవేత్తలు వినియోగించారు.(కొన్ని మూలకణాలను ఇన్‌విట్రో పద్ధతిలో కల్చర్ చేయడాన్ని స్టెమ్‌సెల్ లైన్‌గా వ్యవహరిస్తారు) ఆ స్టెమ్‌సెల్ లైన్స్‌ను 5 రోజుల వయసున్న పిండంలోకి జొప్పించారు. తిరిగి దీనిని ఆడకోతిలోకి ప్రవేశపెట్టారు. ఫలితంగా ఆరు పిల్లలు జన్మించాయి. వీటిలో ఒక్కటి మాత్రం పది రోజులు బతికింది.

ఆ మగ కోతికి మెదడు, గుండె, లివర్ వంటి 26 వేర్వేరు అవయవాల కణజాలాల్లో డోనర్ మూలకణాలు 21% నుంచి 92% వరకు ఉన్నట్టు శాస్త్రవేత్తల విశ్లేషణలో తేలింది. అంతకు ముందు జరిగిన ప్రయత్నాల్లో బేబీ మంకీ పుట్టినా వెంటనే చనిపోవడం, డోనర్ మూలకణాలు 0.1% నుంచి 4.5% మాత్రమే ఉండటం వంటివి చోటు చేసుకున్నాయి.

డోనర్ స్టెమ్‌‌సెల్స్‌ను ఉపయోగించి గతంలో లాబొరేటరీల్లో జంతువులను పుట్టించినా.. వాటిని హైబ్రిడ్ జీవులని చెప్పలేమని శాస్త్రవేత్తలు చెప్పారు. డోనర్ మూలకణాల శాతం వాటిలో తక్కువగా ఉండటమే దీనికి కారణం. అయితే తాజా పరిశోధనలో టిష్యూల్లో డోనర్ సెల్స్ వాటా ఎక్కువగా ఉందని, బేబీ మంకీ శరీరమంతటా సంక్లిష్ట కణజాల నిర్మాణం కనిపించిందని రిసెర్చర్లు తెలిపారు. ఏది ఏమైనా దీర్ఘకాలం జీవించగలిగే కైమీరాల సృష్టికి మరికొంత కాలం పట్టొచ్చు.

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×