India-US P-8I Deal: భారత్-అమెరికా మధ్య టారిఫ్ వార్ ముదిరిందా? భారత్‌ని అన్నివిధాలుగా కట్టడి చేసేందుకు ట్రంప్ సర్కార్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోందా? మోదీ సర్కార్ కూడా ఎత్తుకు పైఎత్తులు వేస్తోందా? శుక్రవారం జరగనున్న కేబినెట్‌లో ట్రంప్ టారిఫ్‌పై దృష్టి పెట్టనుందా? నెక్ట్స్ ఏ విధంగా భారత్ అడుగులు వేయబోతోంది? అమెరికాలో ఇటీవల కుదుర్చుకున్న P-81 విమానాల డీల్‌ని సస్పెండ్ చేసిందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
బలవంతుడు ఏమి చేసినా చెల్లుతుందనేది ఒక్కప్పటి మాట. ప్రస్తుతం పరిస్థితులు మారాయి. దేశాల మధ్య సంబంధాలు ఎంత జాగ్రత్తగా డీల్ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. తేడా వస్తే కొన్ని పరిశ్రలు కుప్పకూలే ప్రమాదం లేకపోలేదు. టారిఫ్‌ల పేరుతో వివిధ దేశాలను హడలెత్తిస్తున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. బ్రెజిల్, భారత్‌లపై అధికంగా టారిఫ్‌లు విధించారు. పరిస్థితి గమనించిన మోదీ సర్కార్ ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేదిలేదని తెగేసి చెప్పేసింది. ఈ నేపథ్యంలో భారత్‌పై ఒత్తిడి పెంచేందుకు అమెరికా తన వంతు ప్రయత్నాలు మొదలుపెట్టింది.
అమెరికా తన రక్షణ రంగం ఎగుమతులను మరింత విస్తరించాలని ఆలోచన చేసింది. ఈ క్రమంలో భారత్‌కు P-81 విమానాలను అమ్మేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో భారత్-అమెరికా దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. దీనిపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఇరుదేశాల మధ్య కుదిరిన విమానాల డీల్‌కు భారత్ బ్రేక్ లు వేసినట్టు తెలుస్తోంది.
విమానాల కొనుగోలుపై భారత్ ఆసక్తి చూపలేదంటూ అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఇరుదేశాల మధ్య సుంకాల వివాదం నెలకొన్న నేపథ్యంలో ఆ ఒప్పందంపై భారత్ ముందుకు వెళ్లడానికి ఇష్టపడలేదంటూ రాసుకొచ్చింది. దాదాపు 3.6 బిలియన్ డాలర్ల విలువైన బోయింగ్ పీ-81 జెట్ల కొనుగోలు ఒప్పందాన్ని నిలిపివేసింది.
ALSO READ: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?
ఆరు విమానాలకు సంబంధించి 2.42 బిలియన్ డాలర్ల డీల్ నాలుగేళ్ల కిందట జరిగింది. ఆ విమానాలకు సంబంధింది ముడి సరుకులు భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి కావాలి. ట్రంప్ టారిఫ్ కారణంగా వాటి ధర భారీగా పెరిగింది. దీనిపై శుక్రవారం జరగనున్న మోదీ కేబినెట్ భేటీలో ఓ నిర్ణయం తీసుకోనుంది.
భారత్‌కు వీటిని కీలకమైన విమానాలుగా చెబుతున్నారు. ఆ తరహా విమానాలను ఇప్పటికే 12 నడుపుతోంది. వీటిని హిందూ మహా సముద్ర ప్రాంతంలో పర్యవేక్షణ, జలాంతర్గాములను ట్రాక్ చేయడం, ఉద్రిక్తత సమయంలో నిఘా నిర్వహించడానికి విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. వాస్తవ నియంత్రణ రేఖ-LAC వెంట చైనాతో ప్రతిష్టంభన సమయంలో అవి ప్రధాన పాత్ర పోషించాయి.
పెరుగుతున్న చైనా నేవీ కార్యకలాపాలు, పరిశోధన లేదా యాంటీ-పైరసీ మిషన్ల ఉపయోగించాలన్నది ఆలోచన. 2009లో 2.2 బిలియన్ల డాలర్ల విలువైన 8 P-8Iల కోసం భారత్ మొదటి ఒప్పందం చేసిందని గతంలో వార్తలు వచ్చాయి. 2021లో అమెరికా $2.42 బిలియన్లకు 6 విమానాలను ఇచ్చేందుకు ఆమోదించింది. ఈ ఏడాది వాటి విలువ 3.6 బిలియన్ల డాలర్లకు చేరింది.