China New Virus: కరోనా మళ్లీ వస్తోందా? ప్రభుత్వ చర్యలు చూస్తే చైనా ప్రజలకు అలాంటి అనుమానమే కలుగుతోంది. దోమల ద్వారా వ్యాపించే చికున్‌గున్యా అనే వైరస్ ఫోషాన్ నగరాన్ని వణికిస్తోంది. ఒక నెలలోనే 8 వేల కేసులు నమోదవడంతో, చైనా ప్రభుత్వం మళ్లీ కోవిడ్ కాలం తరహా కఠిన చర్యలు చేపట్టింది. గతంలో “జీరో కోవిడ్ పాలసీ”కి ఎలా కఠినమైన నిబంధనలు తీసుకువచ్చారో, ఇప్పుడు కూడా అలాంటి చర్యలు తీసుకుంటున్నారు. ఈ వైరస్ ప్రమాదం ఎంత ఉందో, చైనా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
చికున్‌గున్యా అంటే ఏమిటి? ఎలా వ్యాపిస్తుంది?
చికున్‌గున్యా ఒక వైరల్ వ్యాధి. ఇది మస్కీటోల ద్వారా వ్యాపిస్తుంది. ముఖ్యంగా Aedes aegypti అనే మస్కీటో ఈ వైరస్‌ను పైనుంచి ఒకరికి మరోకరికి ప్రేరేపిస్తుంది. బాధితుల్లో అధిక జ్వరంతో పాటు, శరీరంలో తీవ్రమైన నొప్పులు, బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి. చిన్నపిల్లలు, వృద్ధులు లేదా రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నవారికి ఇది తీవ్రమైన సమస్యగా మారవచ్చు.
గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్‌లో ప్రమాదకర స్థితి
ఈసారి ఎక్కువ కేసులు చైనా దక్షిణ ప్రదేశమైన గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని ఫోషాన్ నగరంలో నమోదయ్యాయి. కొన్ని వారాల్లోనే 8,000కి పైగా కేసులు వచ్చాయి. దీంతో చైనా ప్రభుత్వం అత్యంత కీలకంగా స్పందిస్తోంది. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు మస్కీటోలపై యుద్ధమే మొదలెట్టింది.
డ్రోన్లతో నిఘా, ‘ఏలిఫెంట్ మస్కీటోలు’ ప్రయోగం
ప్రభుత్వం మస్కీటో బ్రిడింగ్ ఏరియాలను గుర్తించేందుకు డ్రోన్లను వినియోగిస్తోంది. ఇంట్లో, పొలాల్లో నిల్వనీటిని గుర్తించి వెంటనే నివారణ చర్యలు చేపడుతోంది. అంతే కాదు, “ఏలిఫెంట్ మస్కీటోలు” అనే ప్రత్యేక లక్షణం కలిగిన దోమలను విడిచింది. వీటి పిల్లలు వైరస్ వ్యాపించే మస్కీటోల గుడ్లను తింటాయి. ఇది ప్రకృతిలోనే ఒక రకం బయోలాజికల్ నియంత్రణ విధానం.
వైద్య పరంగా కఠిన చర్యలు
వైరస్ సోకినవారిని క్వారంటైన్ జోన్లు లేదా హాస్పిటళ్లలో ఉంచుతున్నారు. బెడ్లు చుట్టూ మస్కీటో నెట్‌లు వేస్తున్నారు, తద్వారా మరింత వ్యాప్తిని అడ్డుకోవాలని చూస్తున్నారు. పూర్తిగా నెగటివ్‌గా తేలిన తరువాత మాత్రమే బాధితులను డిశ్చార్జ్ చేస్తున్నారు. మందులు కొనుగోలు చేయాలంటే రియల్ నేమ్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేశారు.
పెద్ద ఎత్తున సైనికులతో ఇన్సెక్టిసైడ్ స్ప్రే
ఫోషాన్ నగరంలో పార్కులు, వీధుల్లో సైనికులు మాస్కులు ధరించి ఇన్సెక్టిసైడ్ స్ప్రే చేస్తున్నారు. అంతేకాకుండా, మస్కీటో లార్వా తినే 5,000కిపైగా చేపలను సరస్సుల్లో విడిచారు.
అంతే కాకుండా ఇంట్లో ఎక్కడైనా నిల్వ నీరు ఉండకూడదని. కమ్యూనిటీ వర్కర్లు ఇంటింటి వెళ్లి తనిఖీలు చేస్తున్నారు. సహకరించని గృహాలకు ₹10,000 (యువాన్ లో) ఫైన్ విధిస్తున్నారు. అలాగే “సంరక్షణ చర్యలకు ఆటంకం కలిగించినందుకు” క్రిమినల్ కేసులు కూడా పెట్టొచ్చు అని అధికారులు హెచ్చరించారు.
తనిఖీలు పేరుతో అక్రమాలు – ప్రజల్లో అసహనం
కొంతమంది నివాసితుల మాటల ప్రకారం, అనుమతి లేకుండానే ప్రభుత్వ సిబ్బంది ఇంట్లోకి ప్రవేశించారని, వారి చెట్లను నష్టపరిచారని ఆరోపిస్తున్నారు. గుయిచెంగ్ జిల్లాలో ఐదు ఇళ్లకు విద్యుత్ కూడా కట్ చేశారు అనే సమాచారం ఒక నోటీసులో వెల్లడైంది. ఇంత కఠిన చర్యల నేపథ్యంలో, చైనాలో ప్రజలు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఇలా అడుగుతున్నారు — “ఒక బాధితుడు మరొకరిని వెళ్లి కరిస్తాడా? ఇకనెందుకు క్వారంటైన్?” (Will an infected person go and bite someone else? Then what’s the need for quarantine?) అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇంకా 12 నగరాల్లో విజృంభణ – హాంకాంగ్‌కూ వ్యాప్తి
ఫోషాన్‌తో పాటు, గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్‌లోని 12 ఇతర నగరాల్లో కూడా చికున్‌గున్యా కేసులు నమోదయ్యాయి. హాంకాంగ్‌లోనూ ఒక 12 ఏళ్ల బాలుడికి చికున్‌గున్యా డయగ్నోసిస్ అయినట్టు సమాచారం. అతడు జూలైలో ఫోషాన్ నుంచి తిరిగి వచ్చాడు.
చికున్‌గున్యాపై ‘జీరో టాలరెన్స్’ విధానమేనా?
చైనాలో గతంలో “జీరో కోవిడ్ పాలసీ” ఎంత ఖచ్చితంగా అమలు చేశారో అందరికీ గుర్తుంది. ఇప్పుడు అదే తరహాలో మస్కీటో వైరస్ అయినా ప్రజల ప్రైవసీని, వ్యక్తిగత స్వేచ్ఛను తక్కువ చేసి అత్యంత కఠినంగా నియంత్రణ విధిస్తున్నారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంలో ఇది ఎంతవరకు ఉపయోగపడుతుందో అన్నది చూడాలి కానీ, ప్రజల్లో మాత్రం భయం, గందరగోళం నెలకొంది.
ప్రపంచానికి కోవిడ్ చెప్పిన ఒక క్లిష్ట పాఠం – “జాగ్రత్తే మెరుగైన నివారణ.” చైనాలో చికున్‌గున్యా నియంత్రణ కోసం తీసుకుంటున్న చర్యలు ఒకవైపు మెచ్చుకోవాల్సినవే అయినా… మరొకవైపు వ్యక్తిగత హక్కులను కుదించేలా మారుతున్నాయి. ఇక రానున్న రోజుల్లో ఈ వ్యాధిని ఎంతవరకు నియంత్రించగలుగుతారో చూడాలి… కానీ ఈసారి ప్రపంచమంతా చైనా వైపు చూస్తుంది.