
Telangana Nominations : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసింది. నేడు నామినేషన్ పత్రాల దాఖలుకు చివరి రోజు కావడంతో భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు వివిధ పార్టీల అభ్యర్థులు. ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు కూడా బీఫాంలు సమర్పించారు. ఇక కొందరు అభ్యర్థులకు బీఫామ్‌లు దక్కకపోవడంతో ఏడ్చేశారు. ఇక ఇప్పటి వరకు దాఖలైన నామినేషన్లను ఈ నెల 13న పరిశీలించనుంది ఎన్నికల కమిషన్. ఇక ఉపసంహరణకు ఈనెల 15 వరకు ఛాన్స్ ఉంది.
నిజానికి చివర రెండు రోజులైన గురు, శుక్రవారాల్లో నామినేషన్ల పర్వం జోరుగా కొనసాగింది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం, బీఎస్పీ సహా వివిధ పార్టీలకు చెందిన క్యాండిడేట్స్ అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు పెద్ద ఎత్తున నామినేషన్ పత్రాలు సమర్పించారు. గురువారం గజ్వేల్, కామారెడ్డిలో సీఎం కేసీఆర్, సిరిసిల్లో మంత్రి కేటీఆర్, సిద్ధిపేటలో మంత్రి హరీశ్‌రావు, సూర్యపేటలో మంత్రి జగదీష్ రెడ్డి, మహబూబ్ నగర్ లో శ్రీనివాస్ గౌడ్, చెన్నూరులో బాల్క సుమన్ సహా.. పలువురు మంత్రులు, పలు పార్టీల నేతలు ర్యాలీగా వచ్చి నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ ఆఫీసర్లకు సమర్పించారు. ఇక శుక్రవారం చాలా మంది అభ్యర్థులు తమ నామినేషన్ దాఖలు చేశారు.
ముఖ్యంగా కామారెడ్డిలో రేవంత్ రెడ్డి భారీ ర్యాలీతో నామినేషన్ వేశారు. రేవంత్ వెంట భారీ సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చారు. మొత్తం మూడు సెట్ల నామినేషన్లను దాఖలు చేయగా.. వాటిలో ఒక సెట్ నామినేషన్ సిద్ధరామయ్య చేతుల మీదుగా వేశారు.
రేవంత్ రెడ్డి నామినేషన్ డిపాజిట్ కోసం కేసీఆర్ పూర్వీకుల గ్రామం కోనాపూర్ గ్రామస్థులు విరాళమిచ్చారు. కేసీఆర్ ఓటమే లక్ష్యంగా రేవంత్ రెడ్డికి ఊరంతా కలిసి నామినేషన్ కోసం విరాళమిచ్చారు. పదేళ్లుగా గుర్తురాని కొనాపూర్ కేసీఆర్‌కు ఇన్నాళ్లకు గుర్తొచ్చిందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
.
.
Congress Meeting Nizamabad Rural : కేసీఆర్ గుర్తుంచుకో.. రాబోయేది ఇందిరమ్మ రాజ్యమే : రేవంత్ రెడ్డి