BigTV English

House in Canada : ఇల్లు కొనాలంటే… రెండేళ్లు ఆగాల్సిందే..

House in Canada : ఇల్లు కొనాలంటే… రెండేళ్లు ఆగాల్సిందే..

House in Canada : వామ్మో.. ఇదేంటనుకుంటున్నారా? ఇది మన దేశంలో కాదు లెండి. కెనడాలో. అది కూడా కెనడియన్లకు కాదు. ఈ రూల్ అక్కడ విదేశీయులకు మాత్రమే వర్తిస్తుంది. కెనడాలో విదేశీయులెవరూ రెండేళ్ల పాటు ఇళ్లను కొనకుండా నిషేధం విధించారు… కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో. కరోనా కారణంగా 2020 నుంచి కెనడాలో ఇళ్ల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీనికి తోడు చాలా మంది పొలిటీషియన్లు ఇళ్లపై భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టారు. దాంతో కెనడాలో ఇళ్ల కొరత తీవ్రంగా ఉంది. ఆ కొరతను తగ్గించాలని కెనడియన్లు ఎప్పటి నుంచో ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు… కెనడా ప్రధాని ట్రూడో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ హామీ వల్లే ఆయన అధికారంలోకి వచ్చినట్లు అక్కడి నేతలు చెబుతుంటారు.


ఇళ్ల కొనుగోళ్లపై కెనడా ప్రధాని ట్రూడో తీసుకున్న నిర్ణయంపై… కెనడియన్ రియల్‌ఎస్టేట్‌ అసోసియేషన్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నిషేధం కెనడియన్లు, ముఖ్యంగా వింటర్‌ సీజన్‌లో ఇక్కడ ఉన్న ఇళ్లను అమ్మేసి విదేశాల్లో కొనుగోలు చేయాలనుకునే వారికి ఇబ్బందిగా మారుతుందని వ్యాఖ్యానించింది. అలాగే కెనడాలో ఇల్లు కొనాలనుకున్న విదేశీయులు… ఇక్కడ నిషేధం వల్ల మెక్సికో, యూఎస్‌ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని చెబుతోంది. అదే జరిగితే… భారీ నష్టం తప్పదని హెచ్చరించింది.

కెనడియన్‌ రియల్‌ ఎస్టేట్‌ అసోసియేషన్‌ లెక్కల ప్రకారం.. 2022 ఫిబ్రవరిలో కెనడాలో ఇళ్ల ధరలు సగటున 8 లక్షల డాలర్లు పెరిగాయి. ఆ తర్వాత 13 శాతం తగ్గాయి. అదే సమయంలో కెనడా సెంట్రల్‌ బ్యాంక్‌ వడ్డీరేట్లను పెంచింది. ఫలితంగా మార్టిగేజ్‌ ఇంట్రస్ట్‌ రేట్లు భారీగా పెరిగాయి. 2019 నుంచి ఇళ్ల ధరలు 38 శాతం పెరిగినట్లు చెప్పిన కెనడియన్ రియల్ ఎస్టేట్ అసోసియేషన్… అమ్మకానికి ఉన్న ఇళ్లు కరోనా ముందు స్థాయికి చేరాయని తెలిపింది.


Tags

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×