BigTV English

Nobel Prize Peace: ట్రంప్‌‌కు బిగ్ షాక్.. నోబెల్ శాంతి బహుమతి ఎవరికంటే..?

Nobel Prize Peace: ట్రంప్‌‌కు బిగ్ షాక్.. నోబెల్ శాంతి బహుమతి ఎవరికంటే..?

Nobel Prize Peace: అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ బహుమతి విజేతల పేర్లు నోబెల్ బృందం ప్రకటిస్తుంది. ఇప్పటికే వైద్య రంగంలో ముగ్గురు పేర్లు, భౌతిక శాస్త్రంలో మరో ముగ్గురు అమెరికన్ సైంటిస్టులకు, కెమిస్ట్రీలో ముగ్గురికి, సాహిత్యంలో ఒక్కరికి నోబెల్ బహుమతి ప్రకటించారు. తాజాగా 2025 ఏడాదికి గానూ శాంతి రంగంలో మరో వ్యక్తికి నోబెల్ బహుమతి వరించింది. వెనుజులా దేశానికి చెందిన మారియా కోరినా మాచాడోకి బహుమతి వరించినట్టు నార్వేజియన్ నోబెల్ కమిటీ బృందం ప్రకటించింది.


ఎందుకు ఇచ్చారంటే..?

వెనిజులా ప్రజల ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ, శాంతి కోసం ఆమె చేసిన కృషికి గానూ నార్వేజియన్ నోబెల్ కమిటీ ఈ అవార్డును ఎంపిక చేసింది. వెనెజులా దేశాన్ని ఆమె డిక్టేటర్ షిప్ నుంచి ప్రజాస్వామ్యం వైపు నడిపించేందుకు ఎంతోగానూ కృషి చేశారు. అందుకోసమే ఆమె చేసిన కృషిని గుర్తించి నార్వేజియన్ నోబెల్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ బహుమతి కోసం ఎంతో గానో ఆశలు పెట్టుకున్న అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కు నిరాశే మిగిలింది.


 

ఇక మిగిలింది.. ఎకానమీ ఒక్కటే..

విజేతల పేర్ల ప్రకటన ప్రక్రియ అక్టోబర్ 6 నుంచి అక్టోబర్ 13 వరకు కొనసాగనుంది. ఇప్పటికే వైద్య రంగం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, సాహిత్యం విభాగాల్లో నోబెల్ ప్రైజ్ విన్నర్ల పేరు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఎకానమీ విభాగంలో అత్యుత్తమ సేవలు అందించిన వారి పేర్లను ప్రకటించనున్నారు. ఈ నెల 13 లోపు ఎకానమీ విభాగంలో బహుమతి వరించిన వారి పేర్లను ప్రకటించనున్నారు.

నార్వే నుంచి శాంతి బహుమతి…

నోబెల్ విజేతల పేర్లను అక్టోబర్‌లో ప్రకటిస్తారు. ప్రదానోత్సవం ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి డిసెంబర్ 10న స్వీడన్‌లో జరుగుతుంది. శాంతి బహుమతిని మాత్రం నార్వేలోని ఓస్లోలో అందజేస్తారు. 1901లో ఐదు రంగాల్లో మాత్రమే నోబెల్ బహుమతిని ప్రకటించేవారు. 1969లో ఎకానమీలో కూడా నోబెల్ ప్రైజ్ ఇవ్వండి స్టార్ట్ చేశారు. రేపు లేదా ఎల్లుండి ఎకానమీ రంగంలో నోబెల్ బహుమతి గెలిచిన వారి పేర్లను ప్రకటించనున్నారు.

ప్రైజ్ మనీ ఎంతంటే..?

నోబెల్ ప్రైజ్ విన్నర్స్ కు 11 మిలియన్ స్వీడిష్ క్రోనార్లను అందజేస్తారు. దీని విలువ ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.10.5 కోట్లన్న మాట. ఒక రంగంలో ఒకరి కంటే ఎక్కువ మంది విజేతల పేర్లను ప్రకటిస్తే.. అంతే మొత్తాన్ని మూడు సమాన భాగాలుగా విభజిస్తారు. నోబెల్ విజేతలకు గోల్డ్ తో తయారు చేసిన 18 క్యారెట్ల పతకాన్ని అందజేస్తారు. పతకంపై ఆల్ఫ్రెడ్ నోబెల్ ముఖ చిత్రం ఉంటుంది. ప్రతి విభాగానికి ప్రత్యేక డిజైన్ తో తయారు చేసి పతకాన్ని అందజేస్తారు. అదనంగా విజేతలకు వారి పేరు, విజయాలతో వివరించిన డిప్లొమా సర్టిఫికేట్ ను కూడా అందజేస్తారు.

ALSO READ: నోబెల్ పైజ్ విన్నర్స్‌కు ప్రైజ్ మనీ ఎంత..? వారికి ఉండే సౌకర్యాలు ఏంటి..?

Related News

Worlds Largest Cargo Plane: శంషాబాద్‌లో ప్రపంచంలోనే.. అతిపెద్ద కార్గో విమానం

Donald Trump: 8 యుద్ధాలు ఆపిన నాకు నోబెల్ ఇవ్వరా? పాపం, ట్రంప్ మామ బాగా హర్ట్ అయ్యాడు కాబోలు

Donald Trump: నోబెల్ శాంతి బహుమతి రేసులో డొనాల్డ్ ట్రంప్ కల నెరవేరేనా?

Nobel Prize: నోబెల్ గెలిచిన వారికి ప్రైజ్ మనీ ఎంత..? వారికి లభించే గుర్తింపు ఏంటి..?

Tourist Tax: థాయ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం..! టూరిస్ట్ ట్యాక్స్ విధించేందుకు సిద్ధం..?

Nobel Prize Chemistry: కెమిస్ట్రీలో ముగ్గురికి నోబెల్ బహుమతి.. ఇదిగో వారి పేర్లు

Attack on president Convoy: అధ్యక్షుడి కాన్వాయ్‌పై దాడి.. తప్పించుకున్న ఆ దేశాధినేత

Big Stories

×