Worlds Largest Cargo Plane: హైదరాబాద్ నగరం మరోసారి అంతర్జాతీయ దృష్టికి తీసుకెళ్లింది. శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో.. ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానాలలో ఒకటైన.. అంటోనోవ్ AN-124 రుస్లాన్ విజయవంతంగా ల్యాండ్ అయింది. ఈ పెద్ద విమానం ల్యాండింగ్ దృశ్యాలు చూసినవారు ఆశ్చర్యానికి గురయ్యారు. అక్కడున్నసిబ్బంధి ఈ ఫోటోలను సోషల్ మీడియోలో షేర్ చేయడంతో.. కొద్దిసేపట్లోనే వైరల్ గా మారాయి.
అంటోనోవ్ AN-124 రష్యా-ఉక్రెయిన్ సహకారంతో ఈ విమానం అభివృద్ధి అయినట్లు తెలుస్తోంది. ఈ ఫ్లైట్‌ను ప్రపంచవ్యాప్తంగా ఉన్న సూపర్ హెవీ కార్గో రవాణా కోసం.. ప్రత్యేకంగా రూపకల్పన చేసినట్లు సమాచారం. దీని పొడవు దాదాపు 69 మీటర్లు, ఎత్తు 21 మీటర్లు, రెక్కల విస్తీర్ణం 6760 చదరపు అడుగులు.
AN-124 ఫ్లైట్ నాలుగు శక్తివంతమైన క్వాడ్ ఇంజిన్లతో నడుస్తుంది. ఒక్కో ఇంజిన్ 229 కిలోన్యూటన్‌ల థ్రస్ట్‌ను ఉత్పత్తి చేయగల సామర్థ్యంతో ఉంటుంది. మొత్తం విమాన బరువు ఖాళీగా ఉన్నప్పుడే 1,81,000 కిలోలు (181 టన్నులు) ఉంటుంది. పూర్తి లోడ్‌తో ప్రయాణం చేస్తే.. దీని టేకాఫ్ వెయిట్ 405 టన్నుల వరకు ఉంటుంది. ఇది సుమారు 150 టన్నుల కార్గోను ఒకేసారి తీసుకెళ్లగలదు. ఈ విమానానికి 24 చక్రాలు ఉన్నాయి.
AN-124 విమానం డిజైన్‌లో అత్యంత ప్రాధాన్యమైన అంశం ఏంటంటే.. అందులో భారీ ట్రక్కులు, యంత్రాలు నేరుగా విమానంలోకి ప్రవేశించి లోడింగ్, అన్‌లోడింగ్ చేసుకోవచ్చు. ఈ సౌకర్యం వల్ల భారీ యంత్రాల రవాణాలో.. ఇది ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగించే కార్గో విమానంగా నిలిచింది.
శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన ఈ ఫ్లైట్.. ప్రత్యేక సాంకేతిక పరికరాలు, పరిశ్రమలకు అవసరమైన భారీ యంత్ర భాగాలను రవాణా చేయడానికి వచ్చినట్లు సమాచారం.
Also Read: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
ఇంత భారీ విమానం ల్యాండింగ్‌కి ముందు విమానాశ్రయం.. అధికారులు కఠిన భద్రతా చర్యలు చేపట్టారు. రన్‌వే పొడవు, గాలిలో తేమ, ఉష్ణోగ్రత వంటి అంశాలను ఖచ్చితంగా అంచనా వేసి అనుమతులు ఇచ్చారు. ల్యాండింగ్ టైమ్‌లో ఏవైనా సాంకేతిక లోపాలు లేకుండా ఉండేందుకు.. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి ప్రత్యేక పర్యవేక్షణ జరిగింది.