Donald Trump: ఈ ఏడాదికి గానూ శాంతి రంగంలో వెనుజులా దేశానికి చెందిన మారియా కోరినా మాచాడోకి బహుమతి వరించిన విషయం తెలిసిందే. వెనిజులా ప్రజల ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ, శాంతి కోసం ఆమె చేసిన కృషికి గానూ నార్వేజియన్ నోబెల్ కమిటీ ఈ అవార్డును ఎంపిక చేసింది. వెనెజులా దేశాన్ని ఆమె డిక్టేటర్ షిప్ నుంచి ప్రజాస్వామ్యం వైపు నడిపించేందుకు ఎంతోగానూ కృషి చేశారు. అందుకోసమే ఆమె చేసిన కృషిని గుర్తించి నార్వేజియన్ నోబెల్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ బహుమతి కోసం ఎంతో గానో ఆశలు పెట్టుకున్న అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కు నిరాశే మిగిలింది.
⦿ ట్రంప్ కీలక వ్యాఖ్యలు..
అయితే.. నార్వేలోని నోబెల్ కమిటీ శాంతి బహుమతిని ప్రకటించడానికి కొన్ని గంటల ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరక్ ఒబామాకు 2009లో శాంతి రంగంలో నోబెల్ బహుమతి వచ్చింది. అయితే.. ఆయనకు నోబెల్ రావడంపై విమర్శలు వెల్లగక్కుతూ.. తాను ఇటీవల సాధించిన శాంతి ప్రయత్నాలను గట్టిగా సమర్థించుకున్నారు.
.@POTUS on the Nobel Peace Prize: "I've stopped eight wars, so that's never happened before — but they'll have to do what they do. Whatever they do is fine. I know this: I didn't do it for that, I did it because I saved a lot of lives." pic.twitter.com/TsfLdgmQXD
— Rapid Response 47 (@RapidResponse47) October 9, 2025
⦿ నోబెల్ శాంతి బహుమతిపై ట్రంప్ వ్యాఖ్యలు
తాను ఇటీవల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ఎనిమిది యుద్ధాలు ఆపినట్టు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇంతకు ముందు చరిత్రలో ఎవరూ కూడా ఇలా ఎనిమిది యుద్ధాలను ఆపింది లేదని చెప్పారు. శాంతి బహుమతి కోసం తాను ఈ యుద్ధాలను ఆపలేదని అన్నారు. యుద్ధాలను ఆపడం వల్ల ఎంతో మంది ప్రాణాలను రక్షించానని చెప్పుకొచ్చారు. వైట్ హౌస్ లో మీడియా సమక్షంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన ఆపిన ఎనిమిది యుద్దాలలో కొన్ని దేశాలు ట్రంప్ ప్రమేయం లేదని తేల్చి చెబుతున్నాయి. భారత్ – పాకిస్థాన్ వార్ విషయంలో ట్రంప్ ప్రమేయం లేదని భారత ప్రభుత్వం, బీజేపీ నేతలు చాలా సార్లు చెప్పిన విషయం తెలిసిందే.
⦿ ఒబామాపై ట్రంప్ అసూయ
అమెరికా మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామాకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వడంపై ట్రంప్ అసూయను వెల్లగక్కారు. ఏం చేయకుండానే ఒబామాకు నోబెల్ బహుమతి ఇచ్చారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన అధ్యక్షునిగా ఎలాంటి శాంతి ఒప్పందాలు కుదుర్చలేదని ట్రంప్ వ్యాఖ్యానించారు.
ALSO READ: నోబెల్ ప్రైజ్ మనీ ఎంత ఇస్తారు..? వారికి ఉండే గుర్తింపు ఏంటి..?
⦿ 2009 లో ఒబామాకు నోబెల్ శాంతి బహుమతి..
2009లో ఒబామాకు పదవిలోకి వచ్చిన కేవలం ఎనిమిది నెలలకే నోబెల్ శాంతి బహుమతి గెలుచుకున్నారు. ఒబామాకు ఈ బహుమతిని అంతర్జాతీయ దౌత్యం, ప్రజల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడం, చేయడానికి ఆయన చేసిన అసాధారణ ప్రయత్నాలకు గుర్తింపుగా బహుమతిని ఇచ్చారు. ఆయన అణు నిరాయుధీకరణ లక్ష్యాలు, ఇస్లామిక్ దేశాలతో సహా అంతర్జాతీయ సంబంధాలను పెంపొందించడంలో ఎంతో కృషి చేశారు. దేశాల మధ్య సంబంధాలను కొత్త వాతావరణాన్ని సృష్టించడానికి చేసిన కృషిని నోబెల్ కమిటీ ప్రత్యేకంగా ప్రస్తావించింది.
ALSO READ: Nobel Prize Peace: ట్రంప్‌కు బిగ్ షాక్.. నోబెల్ శాంతి బహుమతి ఎవరికంటే..?
నోబెల్ శాంతి బహుమతిని ఆల్ఫ్రెడ్ నోబెల్ వీలునామా ప్రకారం అందజేస్తారు. ఇది దేశాల మధ్య సౌభ్రాతృత్వం, దేశాల మధ్య శాంతి, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ, శాంతి కోసం కృషి చేసిన వారికి నోబెల్ శాంతి బహుమతి ప్రకటిస్తారు.