E-Paper
Advertisement

IND VS NZ 1st Odi: కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌కు శ‌వ‌పేటిక‌..వ‌డోద‌ర వ‌న్డేలో ఘోర అవ‌మానం ?

IND VS NZ 1st Odi: కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌కు శ‌వ‌పేటిక‌..వ‌డోద‌ర వ‌న్డేలో ఘోర అవ‌మానం ?
Advertisement

IND VS NZ 1st Odi:  ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ వన్డే సిరీస్  ( IND VS NZ 1st Odi) నిన్న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ వన్డే సిరీస్ నేపథ్యంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఓ శవపేటిక నుంచి విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ బయటకు వచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ గా మారాయి. ఇది చూసిన కొంత మంది నెటిజెన్స్… రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. ఇండియా దిగ్గజ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ వడోదరకు వస్తే , ఇలా శవపేటికలోకి పంపిస్తారా ? అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. ఇద్దరికీ కలిపి ఒకే శవపేటిక పెట్టడం ఏంటి? అని మరికొంతమంది పరువు తీస్తున్నారు. శవపేటిక ఇచ్చి రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ పరువు తీసారని మరి కొంత మంది కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఈ సంఘటన హాట్ టాపిక్ అయింది.

Also Read: Lizelle Lee: 100 కేజీల బ‌రువు, ద‌క్షిణాఫ్రికాకు రిటైర్మెంట్‌..కానీ WPL 2026లో క‌ళ్లు చెదిరే క్యాచ్‌..ఎవ‌రీ లిజెల్ లీ

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి శవపేటిక ?

Advertisement

ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య నిన్న ప్రారంభమైన మొదటి వన్డే నేపథ్యంలో రోహిత్ శర్మతో ( Rohit Sharma) పాటు విరాట్ కోహ్లీ ( Virat Kohli) అరుదైన గౌరవం దక్కింది. ఈ ఇద్దరు క్రికెటర్లను తమ స్టైల్ లో సన్మానించింది BCA స్టేడియం యాజమాన్యం. వీళ్ళ కోసం ప్రత్యేకంగా ఓ బాక్స్ తయారు చేయించి, వాళ్ల చిత్రాలను దానిపై వేశారు. ఇక మ్యాచ్ ప్రారంభం కాగానే ఆ బాక్స్ లో నుంచి విరాట్ కోహ్లీ తో పాటు రోహిత్ శర్మ ఇద్దరు ఎంట్రీ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అయితే ఈ అరుదైన గౌరవాన్ని కొంతమంది కించపరుస్తున్నారు. రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ లాంటి దిగ్గజ క్రికెటర్లకు శవపేటిక తయారుచేసి ఇచ్చారని ఫైర్ అవుతున్నారు.

అసలు ఆ శవపేటిక ఎందుకు ఏర్పాటు చేశారంటే ?

రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ కోసం తయారు చేసింది శవపేటిక కాదు. అదొక ప్రత్యేక గౌరవం. 15 సంవత్సరాల తర్వాత వడోదర స్టేడియంలో పురుషుల అంతర్జాతీయ మ్యాచ్ నిన్న జరిగింది. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ మొదటిది. అలాగే రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ ఆడిన నేపథ్యంలో 8 నిమిషాలలో 35 వేల టికెట్లు సేల్ జరిగాయి. ఇలా జరగడం రికార్డు. ఇదే తొలిసారి. అందుకే ప్రత్యేకంగా ఓ బాక్స్ క్రియేట్ చేసి… అందులో నుంచి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి స్వాగతం పలికింది BCA స్టేడియానికి సంబంధించిన బృందం. కానీ ఇది అర్థం చేసుకొని కొంత మంది ట్రోలింగ్ చేస్తున్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ ను శవపేటికలో ప‌డుకోబెట్టార‌ని ట్రోలింగ్ చేస్తున్నారు.

Advertisement

Also Read: BCCI-Bangladesh: బంగ్లాదేశ్ జ‌ట్టులో చీలిక‌, శ‌త్రువులో జ‌ట్టులో “ఇండియన్ ఏజెంట్”..త‌ల‌ప‌ట్టుకుంటోన్న BCB

 

 

Related News

ఈ ద‌ద్ద‌మ్మకు టీమిండియాపై ఆడ‌టం చేత‌కాదు…స‌ల్మాన్ సెంచ‌రీపై బాజిద్ ఖాన్ ఫైర్‌

శ‌భాష్ స‌ల్మాన్‌…నీ దెబ్బ‌కు న‌ఖ్వీ గాడి రెండు చెంప‌లు వాచిపోయింటాయ్ ?

అస‌లు నీకు బుర్ర ఉందా ? ష‌న‌కా బ్యాటింగ్ పై గ్యారీ కిర్‌స్టెన్ సీరియ‌స్‌

ఆ పాట‌లు పెట్టి ధోని న‌న్ను రెచ్చ‌గొట్టేవాడు…వీరూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బాబ‌ర్‌, షాహీన్‌, షాబాద్, హారిస్ రోజులు లెక్క‌బెట్టుకోవాల్సిందే…పాకిస్తాన్ నుంచి త‌రిమేసే టైమ్ వ‌చ్చింది!

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ కు అందిస్తా..లేక‌పోతే త‌ల న‌రుక్కుంటా ?

డ‌బుల్ సెంచ‌రీ చేయ‌కుండా ద్రవిడ్ అడ్డుకున్నాడు..స‌చిన్ సంచ‌ల‌నం !

కావ్య పాప‌ పెళ్లికి పాకిస్తాన్ క్రికెట‌ర్లు…SRHను బ్యాన్ చేయాలంటూ మ‌ళ్లీ పోస్టులు ?

Big Stories

Advertisement
×