E-Paper
Advertisement

Iran Gift To USA: ఇరాన్ ఇచ్చిన ఆ ఖరీదైన గిఫ్టులు గురించి చెప్పేసిన ట్రంప్.. ఏంటి మామ.. ఇది మరీ ఓవర్

Iran Gift To USA: ఇరాన్ ఇచ్చిన ఆ ఖరీదైన గిఫ్టులు గురించి చెప్పేసిన ట్రంప్.. ఏంటి మామ.. ఇది మరీ ఓవర్
Advertisement

Iran Gift To USA: ఇరాన్-అమెరికా చర్చలు కొనసాగుతున్నాయని యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ పదే పదే చెబుతున్నారు. ఈ వారం మొదట్లో తాను చెప్పినట్లు ఇరాన్ నుంచి వచ్చిన సీక్రెట్ గిఫ్ట్.. 10 భారీ చమురు నౌకలని చెప్పారు. చర్చల్లో భాగంగా పాకిస్తాన్ జెండా ఉన్న కొన్ని నౌకలతో సహా పలు దేశాల నౌకలను ఇరాన్ హర్మూజ్ జలసంధిని దాటనిచ్చిందని ట్రంప్ చెప్పారు. వైట్ హౌస్‌లో జరిగిన కేబినెట్ సమావేశంలో మాట్లాడుతూ ట్రంప్ ఇలా వ్యాఖ్యలు చేశారు. చర్చల్లో భాగంగా ఇరాన్ ఎనిమిది పెద్ద ఆయిల్ బోట్లను పంపుతామని చెప్పింది. పాకిస్తాన్ జెండాలతో ఉన్నాయన్నారు. కానీ చివరికి 10 బోట్లు పంపారని చెప్పారు. ఇరాన్ పంపిన అదనపు రెండు బోట్లు.. వారు అన్న మాటలకు క్షమాపణ చెప్పడానికే అని ట్రంప్ అన్నారు.

భారీ గిఫ్ట్

ఇటీవల ఓవల్ ఆఫీసులో విలేకరులతో మాట్లాడుతూ.. ‘చాలా పెద్ద గిఫ్ట్ రాబోతుంది. ఆ గిఫ్ట్ ఏమిటో నేను మీకు చెప్పను, కానీ అది చాలా ముఖ్యమైన బహుమతి’ అని ట్రంప్ అన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ఇరాన్ హర్మూజ్ జలసంధి దిగ్బంధించింది. భారత్, పాక్ సహా మరికొన్ని దేశాల నౌకలను ఈ మార్గం నుంచి అనుమతిస్తుంది. ఆరు గల్ఫ్ అరబ్ దేశాల కూటమి, గల్ఫ్ సహకార మండలికి చెందిన జాసెమ్ మొహమ్మద్ అల్-బుడైవి.. ఇరాన్ హర్మూజ్ జలసంధి గుండా నౌకలను వదిలేందుకు భారీగా రుసుము వసూలు చేస్తోందని అన్నారు. ఇరాన్ పై యుద్ధంతో ఇంధన ధరలు మరింత పెరుగుతాయని, స్టాక్ మార్కెట్ పడిపోతాయని ముందుగానే ఊహించామని ట్రంప్ అన్నారు. తాము అనుకున్నంత తీవ్రంగా ఏం జరగలేదన్నారు.

Advertisement

హర్మూజ్ జలసంధి మార్గంలో తమతో శత్రుత్వం లేని నౌకలను వెళ్లనిస్తామని ఇరాన్ తెలిపింది. దక్షిణాఫ్రికాలోని ఇరాన్ రాయబార కార్యాలయం ఎక్స్ లో ఒక పోస్ట్‌ పెట్టింది. ఇరాన్‌పై యుద్ధం చేస్తున్న యునైటెడ్ స్టేట్స్, ఇజ్రాయెల్, ఆ దేశాల మిత్ర పక్షాలకు చెందిన నౌకలు హర్మూజ్ జలసంధి వెళ్లనివ్వమని, శత్రుత్వం లేని ఇతర దేశాల నౌకలను అనుమతిస్తామని ప్రకటించింది.

Also Read: పిజ్జా ఆర్డర్లు పెరిగితే.. ఏదో దేశానికి మూడినట్లే.. ఏంటీ పెంటగాన్ పిజ్జా ఇండెక్స్?

రేపటితో ముగుస్తున్న గడువు

Advertisement

ఇరాన్ తన అణు, క్షిపణి కార్యక్రమాలపై తమ డిమాండ్లకు ఒప్పుకోకపోతే.. హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవకపోతే తప్పకుండా భయంకరమైన పరిణామాలు ఎదుర్కొంటుందని ట్రంప్ హెచ్చరించారు. ఐదు రోజుల యుద్ధ విరామం శనివారంతో ముగుస్తుంది. దీంతో ట్రంప్ ఏం చేయబోతున్నారని ఆసక్తి నెలకొంది. ఇప్పటి పెంటగాన్ లో సమావేశాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. దీంతో పాటు వైట్ హౌస్ ఎక్ వేదికగా ఆసక్తికర ఎమౌజీని పోస్టు చేసింది.

Related News

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

నేపాల్ ఖాకీలకు విచిత్ర సవాల్.. వరదల్లో కొట్టుకెళ్లిన మనుషులతో పాటు.. బ్యాంక్ లాకర్ల కోసం వేట!

బాంబులు, డ్రోన్ల మోత మధ్య జరిగిన పెళ్లి.. యుద్ధ సమయంలో పెరుగుతున్న వివాహాల సంఖ్య

నేపాల్ వరద.. డ్యామ్‌లే కొట్టుకుపోయాయ్, ఈ ఇల్లు తప్పా! అదెలా?

ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ.. హోర్ముజ్ జలసంధి భద్రతపై చర్చ? యుద్ధం తర్వాత నేరుగా..

హర్మూజ్‌ జలసంధిలో యుద్ధమేఘాలు.. రాకెట్ల సాయంతో సముద్రంలోకి సీమైన్స్‌, పేల్చిన అమెరికా

Big Stories

Advertisement
×