E-Paper
Advertisement

Malaika Arora: మగాడు అక్కర్లేదంటున్న’బోల్డ్’బ్యూటీ

Malaika Arora: మగాడు అక్కర్లేదంటున్న’బోల్డ్’బ్యూటీ
Advertisement

Malaika Arora: మలైకా అరోరా….ఒకప్పుడు తనవైన ఐటం సాంగ్స్ తో బాలీవుడ్ కి ముచ్చెమటలు పట్టించిన ఈ అమ్మడు వయసు మీద పడుతున్నా తగ్గేదేలే అంటూ మరింత రచ్చ చేయడం విశేషం. అవును ..50 ఏళ్ల ఈ బోల్డ్ బ్యూటీ తన పర్సనల్ లైఫ్, డేటింగ్ రూమర్లపై ఇచ్చిన రియాక్షన్ చూసి ముక్కున వేలేసుకుంటున్నారు నెటిజన్లు

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మలైకా అరోరా తన సింగిల్ స్టేటస్‌పై సెన్సేషన్ కామెంట్స్ తో సెగలు పుట్టించింది.”నా వ్యక్తిత్వాన్ని పరిపూర్ణం చేయడానికి నాకు ఏ పురుషుడి అవసరం లేదు” అంటూ కుండ బద్దలు కొట్టేసింది.బోనీ సన్ అర్జున్ కపూర్‌తో కొన్నేళ్ల పాటు డేటింగ్ చేసిన ఈ ముద్దుగుమ్మ ఆ మధ్య బ్రేకప్ చెప్పిన సంగతి తెల్సిందే. అయితే తాజాగా “నేను సెల్ఫ్ మేడ్ ఉమెన్.. నా జీవితం నా ఇష్టం” అంటూ వైరల్ కామెంట్స్ చేస్తూ నెట్టింట్లో మంటలు పుట్టిస్తుంది. ఇక ఒకవేళ ఫ్యూచర్ లో ఎవరితోనైనా ఉండాల్సి వచ్చినా.. అది కేవలం తన ‘సొంత రూల్స్’ ప్రకారమే ఉంటుందట. అంటే.. మగాళ్లు తన కండిషన్లకు ఒప్పుకుంటేనే పక్కన చోటు ఉంటుందని ఇండైరెక్ట్‌గా హింట్ ఇచ్చేసిందన్న మాట.

Advertisement

also read :VV Vinayak: ఒకప్పుడు మాస్ డైరెక్టర్… ఇప్పుడు ఛాన్స్ కోసం వెయిట్?

ఇక జనరల్ గా ఎవరైనా తన తల్లిపై డేటింగ్ రూమర్స్ వస్తే కొడుకులు ఫీల్ అవుతారు. కానీ మలైకా తనపై వస్తున్న డేటింగ్ వార్తలను చూసి తను, తన కుమారుడు అర్హాన్ ఖాన్ కూర్చుని జోకులు వేసుకుంటారని చెప్పుకొచ్చింది. ఎంత మంచి ట్రెడిషన్ ఫ్యామిలీనో.ఇక కొడుకే కాదండోయ్ ..ఇంట్లో వాళ్లందరూ ఆ రూమర్లను చూసి నవ్వుకుంటారని చెప్పి పెద్ద షాకే ఇస్తుంది.సోషల్  మీడియాలో, బయట తన పర్సనల్ లైఫ్ గురించి  ఏం మాట్లాడుకున్నా తనకు అస్సలు  పట్టదని పైగా ఆ రూమర్లను తాను ఎంజాయ్ చేస్తున్నానని మలైకా చెప్పడం చూస్తుంటే సొసైటీ ఇంకా అప్ డేట్ అవ్వాలేమో అనిపిస్తుంది.

Advertisement

ఇక ఈ బాంబే బ్యూటీ పర్సనల్ లైఫ్ కి వస్తే 1998లో సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్‌ను పెళ్లి చేసుకున్న సంగతి తెల్సిందే. మొత్తానికి 20 ఏళ్ల కాపురం తర్వాత 2017లో విడాకులు తీసుకున్న ఈ హటీ ఆ తర్వాత తనకంటే 12 ఏళ్ల చిన్నవాడైన అర్జున్ కపూర్‌తో ప్రేమాయణం సాగించి ‘టాక్ ఆఫ్ ది బాలీవుడ్ అయిపొయింది.ఇక ఇపుడు ప్రముఖ మోడల్ మరియు వ్యాపారవేత్త వరుణ్ వర్మ (Varun Verma) తో డేటింగ్ ఉందని,వీరిద్దరూ కలిసి ముంబైలోని ప్రముఖ రెస్టారెంట్లు, పార్టీలలో చెట్టాపట్టాల్ వేసుకుని తిరుగుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్. కాని ఈ బందం పై మలైకా ఎక్కడ ఓపెన్ కాకపోవడం గమనార్హం .మొత్తానికి ప్రస్తుతం ఒంటరిగా ఉన్నానంటున్న ఈ భామ.. “ప్రేమ విషయంలో తొందరపడను.. కానీ భాగస్వామి కావాలని వెతకను” అంటూ ఇలా సరికొత్త ఫిలాసఫీలు చెబుతుందన్న మాట .అయితే”అర్జున్ కపూర్ ఉన్నప్పుడు లేని సెల్ఫ్ రెస్పెక్ట్.. ఇప్పుడు గుర్తొచ్చిందా?” అని కొందరు చెడుగుడు ఆడుతుంటే కొడుకుతో కలిసి రూమర్లను కొడుకుతో కలిసి ఎంజాయ్ చేయడం ఏంటో అంటూ మరొకొందరు ఎకి పారేస్తున్నారు.
ఏది ఏమైనా గబ్బర్ సింగ్‌లో ‘కెవ్వు కేక’ అంటూ స్టెప్పులేసిన ఈ ఐటమ్ స్పెషలిస్ట్ రియల్ లైఫ్‌లో మాత్రం పెద్ద ‘కన్ఫ్యూజన్’ లో ఉన్నట్టే కనిపిస్తుంది !

also read:Ram Charan Birthday Special:హ్యాపీ బర్త్ డే రామ్ చరణ్

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×