E-Paper
Advertisement

Bosphorus Strait: బోస్ఫరస్ జలసంధి వద్ద టెన్షన్.. ఆయిల్ నౌకపై డ్రోన్ దాడి, ఇంతకీ ఎక్కడ?

Bosphorus Strait: బోస్ఫరస్ జలసంధి వద్ద టెన్షన్.. ఆయిల్ నౌకపై డ్రోన్ దాడి, ఇంతకీ ఎక్కడ?
Advertisement

Bosphorus Strait: ఇరాన్ -అమెరికా యుద్ధం నేపథ్యంలో బలంగా వినిపించింది హోర్మూజ్ జలసంధి. ఏసియా దేశాలకు చమురు వాణిజ్యానికి ప్రధాన మార్గం. తాజాగా బోస్ఫరస్ జలసంధి వద్ద టెన్షన్ మొదలైంది. ఆయిల్ నౌకపై డ్రోన్లు దాడి చేయడం కలకలం రేపింది. ఇంతకీ జలసంధి ఎక్కడ? ఎవరు దాడికి పాల్పడ్డారు? ఇవే ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి.

నల్ల సముద్రంలోని బోస్ఫరస్ జలసంధి వద్ద టెన్షన్

Advertisement

నల్ల సముద్రంలోని బోస్ఫరస్ జలసంధిలో ఉద్రిక్తతలు మొదలయ్యాయి. సుమారు 10 లక్షల బ్యారెళ్ల ముడి చమురు తీసుకెళ్తున్న టర్కీ చమురు నౌకపై డ్రోన్ దాడి జరిగింది. డ్రోన్ ఢీకొన్న వెంటనే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అలర్టయిన సిబ్బంది మంటలను ఆర్పి వేశాయి. ఈ ఘటనతో చమురు లీకేజీ జరగలేదని అధికారులు చెప్పారు.

ఈ ట్యాంకర్ రష్యాలోని నోవోరోస్సిస్క్ ఓడ రేవు నుండి సుమారు పది లక్షల బ్యారెళ్ల ముడి చమురును రవాణా చేస్తోంది. ఈ దాడి సముద్ర భద్రతపై అనుమానాలు మొదలయ్యాయి. ప్రపంచంలో అత్యంత వ్యూహాత్మక ఇంధన కారిడార్లలో ఇది కూడా ఒకటి. నౌకపై దాడి జరగడంతో భద్రతపై ఆందోళనలు తీవ్రమయ్యాయి. యూరప్-ఆసియా మధ్యలో ఉంది  బోస్ఫరస్ జలసంధి.

Advertisement

ఆయిల్ నౌకపై డ్రోన్ దాడి, జలసంధి మూసివేత

ప్రాథమిక నివేదికల ప్రకారం.. డ్రోన్ల దాడి కారణంగా ట్యాంకర్‌పై బ్రిడ్జి డ్యామేజ్ అయ్యింది. ఆ తర్వాత ఇంజన్ రూమ్‌లోకి నీరు ప్రవేశించింది. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. నల్ల సముద్రంలో షిప్ రవాణాపై ఉద్రిక్తతలు అధికంగా ఉన్న ఈ సమయంలో ఈ ఘటన జరగడం ఇరుగుపొరుగు దేశాలకు కలవరం మొదలైంది.

ప్రపంచ ఇంధన మార్కెట్లకు సముద్ర వాణిజ్య సంస్థలకు ఈ దాడిని ఆందోళనకరంగా మార్చింది. ఈ ఘటనకు ఎవరూ బాధ్యత వహించలేదు. ఇటీవల నెలల్లో నల్ల సముద్రంలో ఆయిల్ ట్యాంకర్లపై అనేక దాడులు జరిగాయి. రష్యా ముడి చమురును రవాణా చేసే నౌకలను లక్ష్యంగా చేసుకుంటున్నాయని చెబుతున్నారు.

ALSO READ: అమ్మో మళ్లీ కరోనా.. వణికిపోతున్న జనం, 130 కేసులు.. లాక్ డౌన్ తప్పదా?

ఆంక్షలు విధించిన రవాణాలపై ఉక్రేనియన్ దళాల ప్రమేయం ఉండవచ్చని కొందరు భావిస్తున్నారు. ఈ దాడి ప్రాంతీయ ఉద్రిక్తతలలో భాగం కావచ్చని మరికొందరు అంటున్నారు. ఈ డ్రోన్ ఆపరేషన్ భౌగోళిక రాజకీయ ఎత్తుగడా? అనుకోకుండా జరిగిందా? అనే దానిపై దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం బాస్పోరస్ జలసంధిలో నౌకల రాకపోకలను తాత్కాలికంగా నిలిపి వేశారు అధికారులు. ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు.

Related News

చర్చిలో తీవ్ర విషాదం.. ప్రార్థన చేస్తుండగా పాస్టర్‌పై పడ్డ భారీ శిలువ.. వీడియో వైరల్!

నోరు విప్పిన జేడీ వాన్స్.. భారత్ విషయంలో నోరు జారాను, అది సరైనది కాదని క్లారిటీ

మంటల్లో ఫ్రాన్స్‌.. రోడ్లపైకి లక్షల్లో నిరసనకారులు, భవనాలు దగ్దం, షాపులు లూఠీ

షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. ఆకట్టుకున్న ప్రత్యేక ప్రదర్శనలు!

ట్రంప్ మామ గిమ్మిక్కులు.. గెలుపు కోసం చమక్కులు, ఈ తీట పనులు అందుకేనా?

19 ఏళ్లు చనిపోయినట్లు నమ్మించిన కేటుగాడు.. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎంట్రీతో అడ్డం తిరిగిన కథ!

భారత్‌కు బిగ్ రిలీఫ్.. 100% టారిఫ్‌ల చట్టాన్ని నిలిపివేసిన డొనాల్డ్ ట్రంప్!

రష్యా సైన్యంలో ఉక్రెయిన్‌ ఏజెంట్.. 300 మంది సైనికుల్ని లేపేసి.. దేశం దాటేసిన యువ అధికారి!

Big Stories

Advertisement
×