BigTV English

Edoardo Santini | మోడలింగ్ కెరీర్ వదిలి సన్యాసిగా మారిన ఇటలీ అందగాడు

Edoardo Santini | ఇటలీ దేశానికి చెందిన ఎడొఆర్డో సాన్టిని ఒక ప్రఖ్యాత మోడల్. అంతేకాదు ఇటలీ దేశంలోకల్లా అతనే అందమైన యువకుడని పేరు. అతని వయసు కేవలం 21 ఏళ్లు. ఎడొఆర్డో సాన్టిని ఒక మంచి డాన్సర్, నటుడు. అతనికి నటుడిగా మంచి కెరీర్ ఉంటుందని అందరూ అనుకుంటున్న సమయంలో సాన్టిని ఒక అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. చిన్న వయసులోనే ఆధ్యాత్మికంవైపు అడుగులేస్తున్నాడు.

ఇటలీ కేథలిక్ చర్చి ఇటీవల కొంతమందిని ప్రీస్ట్(చర్చి ఫాదర్) పదువుల కోసం ఎంపిక చేసింది. వారిలో ఎడొఆర్డో సాన్టిని ఒకడు. ఈ విషయాన్ని ఇన్స్‌టాగ్రామ్ ద్వారా సాన్టిని తెలిపాడు. ఇన్స్‌టాగ్రామ్‌లో సాన్టిని పెట్టిన వీడియోలో అతను మోడలింగ్ చేస్తున్న కొన్ని దృశ్యాలున్నాయి. వీడియో చివరిలో అతను చర్చిలో ఏసు ప్రభువు ముందు మోకాళ్లపై ప్రార్థన చేస్తున్న దృశ్యాలున్నాయి.

ఆ వీడియో పోస్ట్ చేస్తూ.. సాన్టిని తన అభిమానుల కోసం ఓ మెసేజ్ పెట్టాడు. అందులో తన నిర్ణయాన్ని తెలుపుతూ.. “ఇక నుంచి నేను నా మోడలింగ్, డాన్స్, నటన పరమైన వృత్తిని వదిలి దైవ సేవలో జీవితం గడపాలనుకుంటున్నాను. వీలైతే నా ప్రతిభను దైవకార్యాల కోసం వినియోగిస్తాను,” అని రాశాడు.

అందమైన ముఖం, దృఢమైన శరీరం, ఎంతో మంచి కెరీర్ వదిలి అతి చిన్న వయసులోనే సన్యాసిగా ఎడొఆర్డో సాన్టిని మారిపోవడంపై అతని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. సాన్టినికి ఇన్స్‌టాగ్రామ్‌లో 8000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. వారంతా అతని నిర్ణయం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కొందరు అతడు సన్మార్గం ఎంచుకున్నాడని అంటున్నారు.

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×