E-Paper
Advertisement

Aishwarya Rai : బచ్చన్ కుటుంబంలో కలకలం.. ఐష్ ను అన్ ఫాలో చేసిన బచ్చన్.. 

Aishwarya Rai : బచ్చన్ కుటుంబంలో కలకలం.. ఐష్ ను అన్ ఫాలో చేసిన బచ్చన్.. 
Advertisement
Aishwarya Rai

Aishwarya Rai : సెలబ్రిటీస్ అంటే వాళ్లకు సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉంటారు నెటిజన్స్. ఇక ఆ సెలబ్రిటీస్ కపుల్స్ అయితే.. కూర్చున్న దగ్గర నుంచి నిల్చున్నంతవరకు.. ఏ పార్టీకి వెళ్లారు? ఎక్కడ కలిశారు? ఎలా ఉన్నారు? ఇలాంటి విషయాలను ఆరా తీసి మరి ఏదో ఒక కాంట్రవర్సీ లేవనెత్తుతూనే ఉంటారు. ఇక ఆ సెలబ్రిటీ కపుల్స్ మధ్యలో చిన్న గొడవలు ఉన్నాయి అంటే చాలు.. వాటిని భూతద్దంలో పెట్టి మరి ఎస్టాబ్లిష్ చేస్తారు. బాలీవుడ్లో బడా ఫ్యామిలీ బిగ్ బీ ఫ్యామిలీ.. ఐశ్వర్య, అభిషేక్ బచ్చన్ ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఏదో ఒక వివాదం బచ్చన్ ఫ్యామిలీలో నడుస్తూనే ఉంది.

చాలా ఈవెంట్స్ ,ఫంక్షన్స్ సందర్భంలో ఐశ్వర్యారాయ్ బచ్చన్ కు ఆమె ఆడపడుచు శ్వేతానందా కు పెద్దగా సరిపడదు అన్న విషయం అందరికీ అర్థమైంది. గత కొన్ని రోజులుగా ఐశ్వర్య కు అభిషేక్ కి మధ్య కూడా గొడవలు జరుగుతున్నాయి అన్న టాక్ వినిపిస్తోంది. పైగా ఆమెకు ఆమె అత్తింటి వారితో పెద్దగా పడడం లేదు అన్న వార్తలు కూడా జోరుగా వినిపిస్తున్నాయి. దీనికి తోడు ఐశ్వర్య ఎక్కువగా తన కూతురు ఆరాధ్యతో కలిసి పుట్టింట్లోనే ఉంటుంది.

Advertisement

రీసెంట్ గా జరిగిన ఐశ్వర్యరాయ్ పుట్టినరోజుకు బచ్చన్ ఫ్యామిలీ నుంచి కేవలం అభిషేక్ బచ్చన్ ఒక్కడే పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అమితాబ్,జయ బచ్చన్ ఇద్దరూ ఐశ్వర్య పుట్టినరోజు అసలు పట్టించుకోనే లేదు. మరోపక్క అమితాబ్ పుట్టినరోజుకి ఐశ్వర్య అతనికి పుట్టినరోజు విషెస్ చెబుతూ.. కేవలం అమితాబ్ తన కూతురు ఆరాధ్యతో ఉన్న ఫోటోని మాత్రమే షేర్ చేసింది.

ఆమె కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఉన్న ఫోటోని షేర్ చేయకపోవడం కూడా పలు రకాల అనుమానాలకు దారితీస్తోంది. పైగా ఈ మధ్యనే అమితాబ్ 3 వేల కోట్ల రూపాయల విలువ చేసే ఇంటిని కూతురికి..కొడుక్కి సమానంగా పంచారు. దీంతో కుటుంబంలో కొన్ని వివాదాలు తలెత్తాయని టాక్.

Advertisement

ప్రతి సంవత్సరం మనీష్ మల్హోత్రా ఏర్పాటు చేసే దీపావళి పార్టీకి అభిషేక్ బచ్చన్ ,ఐశ్వరరాయ్ తో కలిసి వెళ్తాడు. అయితే ఈసారి దీపావళి పార్టీకి ఐశ్వర్య తన కూతురితో కలిసి వెళ్ళింది. దీనికి తోడు సడన్గా అమితాబచ్చన్ తన ఇంస్టాగ్రామ్ లో ఐశ్ ను అన్ ఫాలో చేశాడు. ఇది ఎందుకు జరిగిందో తెలియదు కానీ దీనికి సంబంధించిన పోస్టులు మాత్రం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇంట్లో గొడవల కారణంగానే అమితాబ్ ఐశ్వర్యారాయ్ ను అన్ ఫాలో చేశాడని.. త్వరలో అభిషేక ఐశ్వర్య విడాకులు తీసుకోబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇక ఈ వార్తలపై బచ్చన్ ఫ్యామిలీ ఎలా స్పందిస్తారో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×