E-Paper
Advertisement

Elon Musk Relation with Tesla Employee: ఉద్యోగినులతో ఎలాన్ మస్క్‌కు లైంగిక సంబంధమంటా..?

Elon Musk Relation with Tesla Employee: ఉద్యోగినులతో ఎలాన్ మస్క్‌కు లైంగిక సంబంధమంటా..?
Advertisement

Elon Musk Relation with Tesla Employee: ప్రముఖ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అనుకున్నది చేసి నిరూపిస్తాడనే పేరు ఆయనకు ఉంది. ఎందుకంటే పలు రంగాల్లో తానేంటో.. తన ప్రతిభ ఏంటో అనేది ఛాలెంజ్ చేసి మరీ నిరూపించాడు. అందుకే మస్క్ కు ప్రపంచ వ్యాప్తంగా పేరుంది. ఎలాన్ మస్క్ పై తాజాగా మరోసారి ఓ సంచలన కథనం ప్రచురితమయ్యింది. తన సంస్థ అయినటువంటి స్పేస్ ఎక్స్ లో పనిచేసే పలువురు మహిళా ఉద్యోగినులతో ఆయన లైంగిక సంబంధం పెట్టుకున్నట్లు ఆ కథనం పేర్కొన్నది. ఇంటర్న్ కోసం వచ్చిన ఓ యువతి కూడా అందులో ఉన్నట్లు తెలిపింది. ఎలాన్ మస్క్ తన కంపెనీలో మహిళలకు అసౌకర్య వాతావరణాన్ని కల్పించాలంటూ ‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’ తన తాజా కథనంలో పేర్కొన్నది.

ఎలాన్ మస్క్ కంపెనీలో గతంలో పనిచేసి వెళ్లిపోయిన మహిళల నుంచి వాల్ స్ట్రీట్ జర్నల్.. వివరాలను సేకరించినట్లు సమాచారం. మస్క్ కు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందని, అప్పుడప్పుడు బోర్డు సభ్యులతో కలిసి మస్క్ వాటిని తీసుకునేవారని అందులో పేర్కొన్నది. ఈ క్రమంలో ఎలాన్ మస్క్ మహిళా ఉద్యోగులతో లైంగిక సంబంధం పెట్టుకున్నట్లు తెలిపింది. తన పిల్లలకు తల్లి కావాలంటూ ఓ ఉద్యోగినిని మస్క్ అడిగినట్లు వెల్లడించింది. శృంగారంలో పాల్గొంటే గుర్రాన్ని బహుమతిగా ఇస్తానంటూ 2016లో ఎలాన్ మస్క్ చెప్పినట్లు మరో మహిళ వివరించిందని ఆ కథనం పేర్కొన్నది. అయితే, ఎలాన్ మస్క్ కంపెనీలో అదేమీ లేదని, ఆయన మహిళల కంటే పురుషులకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేవారని, ఒక్క వేతనం విషయంలోనే వ్యత్యాసం ఉండేదంటూ మరో మాజీ ఉద్యోగిని ఆరోపించారని తెలిపింది.

Advertisement

ఎలాన్ మస్క్ పై వచ్చిన ఈ కథనం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ కథనంపై స్పందించిన స్పేస్ ఎక్స్ ప్రెసిడెంట్ అండ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గ్విన్.. ఆ ఆరోపణలను కొట్టిపారేశారు. అదంతా అబద్ధం.. ఎలాన్ మస్క్ పై తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసేందుకే ఈ కథనాన్ని ప్రచురించారని అన్నారు. తనకు పరిచయమున్న వారిలోకెల్లా మస్క్ ఎంతో మంచి వారని, ఆయన గురించి వస్తున్న కథనాలను చూసి ఆశ్చర్యపోతున్నానంటూ పేర్కొన్నారు.

Also Read: హమాస్, ఇజ్రాయెల్ మధ్య గత 8 నెలలుగా బీకర పోరు.. కాల్పుల విరమణ ప్రణాళికకు ఆమోదం

Advertisement

ఇదిలా ఉంటే.. గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్ భార్య నికోల్ షానన్ తో మస్క్ వివాహేతర సంబంధం పెట్టుకున్నారని, దీని కారణంగానే సెర్గీ దంపతులు విడిపోయారంటూ ఇటీవల న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మరోసారి ఎలాన్ మస్క్ గురించి మరో కథనం ప్రచురితమవ్వడంతో పెద్ద ఎత్తున చర్చనీయాంశమయ్యింది.

Tags

Related News

అమెరికాలో ఘోర ప్రమాదం.. హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు మృతి!

కార్నివాల్ క్రూయిజ్ షిప్‌లో.. ఓ మహిళ ఒకటే గోకుడు, వీడియో వైరల్

హౌతీలు ప్రకటన.. బాబ్‌ ఎల్‌-మాండెబ్‌ జలసంధి మూసివేత, ప్రపంచ దేశాల్లో గుబులు

పశ్చిమాసియాలో యుద్ధ భేరి.. ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా.. హర్మూజ్ జలసంధిలో తీవ్ర ఉద్రిక్తత!

ఆకస్మిక వరదల్లో కొట్టుకుపోయిన అఫ్గానిస్తాన్‌.. 20 మంది మృతి, 100 మంది గల్లంతు

అయ్యబాబోయ్.. ‘సైకిల్ అంబులెన్స్’ అంట.. నెట్టింట మళ్లీ జోకర్ అయిన పాక్!

పెరులో వరుస భూకంపాలు.. ఆరుగురు మృతి, వందలాది మంది నిరాశ్రయులు

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

Big Stories

Advertisement
×