E-Paper
Advertisement

Varalaxmi Sarathkumar Wedding: వరలక్ష్మి శరత్‌ కుమార్ పెళ్లి డేట్ ఫిక్స్.. ఎప్పుడు, ఎక్కడంటే..?

Varalaxmi Sarathkumar Wedding: వరలక్ష్మి శరత్‌ కుమార్ పెళ్లి డేట్ ఫిక్స్.. ఎప్పుడు, ఎక్కడంటే..?
Advertisement

Varalaxmi Sarathkumar Wedding Date Fixed: టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలో భారీ పాపులారిటీని సంపాదించుకుంది నటి వరలక్ష్మి శరత్ కుమార్. స్టార్ నటుడు శరత్ కుమార్ కూతురిగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. తండ్రికి తగ్గ కూతురిగా తన నటనతో యావత్ సినీ ప్రియుల్ని ఆకట్టుకుంది. ఎక్కువగా నెగెటివ్ పాత్రలు చేస్తూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్‌ను క్రియేట్ చేసుకుంది.

బడా బడా హీరోల సినిమానూ ఛాన్స్ కొట్టేసి అదరగొట్టింది. ఆమె యాక్టింగ్‌కు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. సినిమా ఏదైనా పాత్ర ఏదైనా జీవించేయడం వరలక్ష్మి శరత్ కుమార్‌కు వెన్నతో పెట్టిన విద్య. అయితే ఒక్క నెగెటివ్ షేడ్స్‌లోనే కాకుండా హీరో అక్క, చెల్లి క్యారెక్టర్‌లలో కూడా నటించి అదరగొట్టేసింది. ఈ ఏడాది జనవరిలో విడుదలైన హనుమాన్ మూవీలోనూ హీరోకి అక్క పాత్రలో నటించి అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది.

Advertisement

అలాగే లేడీ ఓరియేంటెడ్ సినిమాలు చేస్తూ కూడా ప్రేక్షకులను అలరిస్తుంది. అయితే వరలక్ష్మిని చూసి కొందరు ఆమె సింగిల్ అని భ్రమ పడ్డారు. ఆమెకు బాయ్ ఫ్రెండ్ లేడని అనుకున్నారు. కానీ ఈ ముద్దుగుమ్మ ఇటీవల ఒక్కసారిగా తన బాయ్ ఫ్రెండ్‌ను అందరికీ పరచయం చేసింది. ఇటీవల తన ప్రియుడు నిక్లాయ్ సచ్‌దేవ్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకుంది.

Also Read: ప్రియుడితో నటి వరలక్ష్మి శరత్ కుమార్.. పెళ్లికి ముందే ఏంటా పని..? వీడియో వైరల్

Advertisement

అందుకు సంబంధించిన ఫొటోలను వరలక్ష్మీ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యాయి. దీంతో ఆమె సింగిల్ అని అనుకునే వారికి ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ముంబైకి చెందిన నిక్లాయ్ ఓ గ్యాలరిస్ట్. ఇక్కడ ఇంకో విషయం ఏంటేంటే.. వీరిద్దరూ కలసి దాదాపు 14 ఏళ్లుగా ప్రేమాయణం చేస్తున్నట్లు సమాచారం. కానీ ఆమె ఎప్పుడు నిక్లాయ్‌తో కనిపించకపోవడంతో ఎవరికీ డౌట్ రాలేదు.

ఇక ఈ ఏడాదిలో ఎంగెజ్‌మెంట్ చేసుకున్న ఈ జంట వివాహం ఎప్పుడు చేసుకోబోతున్నారు అని అంతా సోషల్ మీడియా ద్వారా కామెంట్లు పెడుతున్నారు. ఈ క్రమంలో వరలక్ష్మి – నిక్లాయ్ మ్యారేజ్‌కు సంబంధించి ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ లవ్ కపుల్ వివాహం వచ్చే నెల అంటే జూలై 2న థాయ్‌లాండ్‌లో గ్రాండ్‌గా జరగనున్నట్లు తెలుస్తోంది.

Also Read: Devara: దేవర ఈసారి ముందే వస్తున్నాడు.. ఇక పూనకాలే

ఇప్పటికే వరలక్ష్మి కొంత మంది సినీ స్టార్లను తన మ్యారేజ్ కోసం ఆహ్వానించినట్లు తెలుస్తోంది. రీసెంట్‌గా నటి నయనతారకు కూడా పెళ్లికార్డు ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటికే కోలీవుడ్‌లో చాలా మంది నటీ నటులికి పెళ్లికార్డులు అందించిన వరలక్ష్మి త్వరలో టాలీవుడ్‌కి చెందిన మరికొందరిని ఆహ్వానించబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ యంగ్ బ్యూటీ ప్రేమించి పెళ్లి చేసుకుంటుండటంతో చాలా మంది కంగ్రాట్స్ చెబుతున్నారు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×