BigTV English

Rains: ‘డొక్సురి’ బీభత్సం.. ప్రపంచానికి విపత్తేనా?

Rains: ‘డొక్సురి’ బీభత్సం.. ప్రపంచానికి విపత్తేనా?
china-rains

Rains: చైనాలో రోడ్లు నదుల్లా.. కార్లు పడవల్లా మారాయి. దంచికొడుతున్న వర్షాలకు కార్లు కొట్టుకుపోయాయి.. సబ్ బేలు నీట మునిగాయి. రాజధాని బీజింగ్‌తో పాటు ఉత్తర చైనా ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. లేటెస్ట్‌గా రెడ్ అలర్ట్ జారీ చేయడంతో ఆ ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటు గడుపుతున్నారు.


ప్రస్తుతం చైనాలోని అనేక ప్రావీన్సులపై డొక్సురి తుపాను తన ప్రతాపం చూపుతోంది. రికార్డు స్థాయిలో నమోదవుతున్న వర్షపాతంతో చైనీయులు వణికిపోతున్నారు. భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయం అయ్యాయి. బస్సులు, రైళ్ల రాకపోకలకు అంతరాయం తీవ్ర ఏర్పడింది. అనేక వాహనాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. పలు అపార్ట్‌మెంట్‌లు, భవనాలలో భారీగా వరద నీరు చేరింది. ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు కూడా తరలించే పరిస్థితి లేదు. స్థానిక నదుల్లో ప్రవాహ ఉధృతి చరిత్రలో ఎప్పుడూ లేనంతగా ఉందని అధికారులు తెలిపారు. నదుల్లో నీటి మట్టం విపరీతంగా పెరగడంతో స్థానికులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

దక్షిణ చైనాలో పది లక్షల కంటే ఎక్కువమంది ప్రజలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు తెలుస్తోంది. దక్షిణ ఫుజియాన్ ప్రావిన్స్‌లో 4 లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.


పసిఫిక్ మహాసముద్రంలో డొక్సురి తుపాను వల్లనే ఈ ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడుతున్నాయి. దీని ప్రభావంతో గంటకు 230 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచాయి. తొలుత ఫిలిప్పీన్స్‌పై డొక్సురి తుపాను పంజా విసిరింది.ఈ తుఫాను ప్రభావంతో ఫిలిప్పీన్స్‌ లో వరదలు 12 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆ తర్వాత ఈ తుపాను చైనా వైపు కదిలి ఇప్పుడు చైనీయులను ఇబ్బంది పెడుతోంది. ఈ మధ్య కాలంలో ఏ తుపాను కూడా చైనాలో ఈ స్థాయిలో బీభత్సం సృష్టించలేదని నిపుణులు చెబుతున్నారు.

అయితే చైనాలో ఈ సంవత్సరం వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ వేసవిలో రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదుకాగా.. వర్షాకాలంఓ రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదవుతుంది. అయితే దీనంతటికి కారణం వాతావరణంలో జరుగుతున్న మార్పులే కారణమని నిపుణులు చెబుతున్నారు.

Related News

Donald Trump: ట్రంప్ మామకు దిమ్మతిరిగే న్యూస్.. బాయ్‌కట్ అమెరికా ప్రొడెక్ట్స్ ట్రెండింగ్

Turkey Earthquake: టర్కీని కుదిపేసిన భూకంపం.. ఎటు చూసినా శిథిలాల దిబ్బలు

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Big Stories

×