BigTV English

Donald Trump: టాలీవుడ్‌కు ట్రంప్ షాక్.. ఇక అమెరికాలో తెలుగు సినిమాలు రిలీజ్ కష్టమేనా?

Donald Trump: టాలీవుడ్‌కు ట్రంప్ షాక్.. ఇక అమెరికాలో తెలుగు సినిమాలు రిలీజ్ కష్టమేనా?

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశీయ సినిమా పరిశ్రమను కాపాడే లక్ష్యంతో విదేశాలలో నిర్మించిన అన్ని సినిమాలపై 100 శాతం సుంకాన్ని విధించాలని ప్రతిపాదించారు. దీంతో ఇండియన్ సినిమాలు, అందులోనూ తెలుగు సినిమా పరిశ్రమపై దీనివల్ల తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.


విదేశీ సినిమాలపై శాతం 100 పన్ను

అమెరికాలో విడుదల కాబోయే విదేశీ సినిమాలపై.. ట్రంప్ ప్రభుత్వం 100 శాతం సుంకాలు (tax) విధించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం వల్ల అమెరికాలోకి వచ్చే ప్రతి విదేశీ సినిమా రెండింతల ఖర్చుతో థియేటర్లకు చేరుతుంది. అయితే అమెరికాలో నిర్మించే సినిమాలకు మాత్రం పన్ను మినహాయింపు ఇస్తామని ప్రకటించారు. దీని వెనుక ఉద్దేశ్యం అమెరికా స్థానిక సినిమా పరిశ్రమకు బలం చేకూర్చడమే అని అధికారులు చెబుతున్నారు.


ఇండియన్ సినిమాలకు దెబ్బ

ప్రపంచవ్యాప్తంగా భారీగా మార్కెట్ కలిగిన ఇండియన్ సినిమాలు.. ఈ నిర్ణయం వల్ల పెద్ద ఎత్తున దెబ్బ తిననున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ సినిమాలు అమెరికాలో మంచి మార్కెట్ కలిగి ఉన్నాయి. ముఖ్యంగా తెలుగు సినిమాలకు అమెరికాలోని డాలర్ వసూళ్లు ఒక ప్రధాన ఆదాయ వనరు. ప్రతి పెద్ద బడ్జెట్ సినిమా అమెరికా ప్రీమియర్స్ లోనే కోట్ల రూపాయలు సంపాదిస్తోంది. అయితే ట్రంప్ కొత్త పన్ను విధానం వలన నిర్మాతలు, పంపిణీదారులు, ఎగ్జిబిటర్లు పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్నారు.

తెలుగు సినిమాలపై అధిక ప్రభావం

తెలుగు సినిమాలకు అమెరికాలో ఒక ప్రత్యేకమైన మార్కెట్ ఉంది. పెద్ద స్టార్ సినిమాలు విడుదల రోజునే మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించడం సాధారణమే. తెలుగు రాష్ట్రాల నుండి లక్షల సంఖ్యలో ప్రజలు అమెరికాలో నివసిస్తున్నారు. వారు థియేటర్లలో తెలుగు సినిమాలు చూడటం ఒక పెద్ద అలవాటు. ఇప్పుడు 100 శాతం సుంకం విధించబడడంతో టికెట్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. దీంతో ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడడానికి వెనుకంజ వేస్తారన్న భయం నిర్మాతల్లో ఉంది.

నిర్మాతల ఆందోళనలు

ఈ పరిస్థితుల్లో తెలుగు నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు. దీని వలన సినిమాల వ్యాపారం లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయని వారు అంటున్నారు.

పిరేట్సీ పెరుగుదల ప్రమాదం

ఇంకో పెద్ద సమస్య ఏమిటంటే.. అమెరికాలో టికెట్ ధరలు అధికంగా పెరిగితే.. ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లకుండా పిరేట్సీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. దీని వలన ఇండియన్ సినిమాలకు మరింత ఆర్థిక నష్టం కలుగుతుంది.

Also Read: అమెరికాలో లైంగిక నేరస్థుడిని హత్య చేసిన భారతీయుడు.. వెబ్ సైట్ లో వెతికి, మారువేషంలో గాలించి మరీ

డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఈ కొత్త నిర్ణయం ఇండియన్ సినిమా పరిశ్రమకు, ముఖ్యంగా తెలుగు సినిమాలకు పెద్ద షాక్ అని చెప్పాలి. ఇప్పటికే కరోనా కాలంలో థియేటర్ల బిజినెస్ దెబ్బతిన్న సందర్భంలో, ఇలాంటి పన్నులు నిర్మాతలకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. ఇక ఈ సమస్యపై ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ఏ విధమైన చర్యలు తీసుకుంటుందో, అమెరికాతో ఎలాంటి చర్చలు జరుపుతుందో చూడాలి.

 

Related News

Pakistan: మీ పాలన మాకొద్దు.. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లో తీవ్ర ఉద్రికత్త

America: అమెరికాలోని మిషిగాన్‌లో కాల్పుల కలకలం.. నలుగురు మృతి, మరో 9 మందికి గాయాలు..

California Murder: అమెరికాలో లైంగిక నేరస్థుడిని హత్య చేసిన భారతీయుడు.. వెబ్ సైట్ లో వెతికి, మారువేషంలో గాలించి మరీ

Netflix: H1-B వీసా ఫీజు పెంపుని సమర్థించిన నెట్ ఫ్లిక్స్ అధినేత..

Larry Ellison: నా ఆస్తుల్లో 95 శాతం పంచేస్తా.. ప్రపంచంలోనే సెకండ్ రిచెస్ట్ పర్సన్ ల్యారీ ఎల్లిసన్ కీలక ప్రకటన

Donald Trump: ఏడు నెలల్లో ఏడు యుద్ధాలు ఆపాను.. అందులో భారత్- పాక్ ఒకటి.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Hanuman Statue: హనుమంతుడి విగ్రహంపై ట్రంప్ పార్టీ నేత అనుచిత వ్యాఖ్యలు.. అమెరికా క్రైస్తవ దేశమా?

Big Stories

×