Lawrence Bishnoi Gang: కెనడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది ఆదేశం. ఈ విషయాన్ని కెనడా ప్రజా భద్రతా మంత్రి గ్యారీ ఆనంద సంగరీ ప్రకటించారు. ఈ నిర్ణయంతో ఆ గ్రూప్ ఆస్తులను జప్తు చేసే అవకాశం కెనడాకు దక్కింది.
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ షాక్
ఇండియా మూలాలు కలిగిన అంతర్జాతీయ క్రిమినల్ ముఠా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్. ఈ మధ్యకాలంలో ఇండియాలో చాలా మంది సెలబ్రిటీలకు ఆ గ్యాంగ్ నుంచి బెదిరింపులు తీవ్రమయ్యాయి. ఈ గ్యాంగ్ ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది భారత్.
ఇదిలాఉండగా బిష్ణోయ్ గ్యాంగ్‌కు కెనడా కేరాఫ్‌గా మారింది. అక్కడ భారతీయ సంతతి జనాభా ఎక్కువగా ఉంటున్నారు. ఈ క్రమంలో తమ పట్టు పెంచుకునేందుకు ఆ గ్యాంగ్ హత్యలు, కాల్పులు, బెదిరింపులు, బలవంతపు వసూళ్లు వంటి చర్యలకు పాల్పడుతోంది. సినీ రాజకీయ నేతలను టార్గెట్‌గా చేసుకుంటోంది. ఈ క్రమంలో చాలామందిలో అభద్రతా భావం నెలకొంది.
పరిస్థితి గమనించిన కెనడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లారెన్స్ బిష్ణోయ్ ముఠాను ఉగ్రవాద సంస్థగా ప్రకటన చేసింది. ఈ విషయాన్ని ఆదేశం స్వయంగా వెల్లడించింది. నేరాలను అదుపు చేసే క్రమంలో భాగంగా లారెన్స్ బిష్ణోయ్ ముఠాను ప్రకటించామని ఆదేశ మంత్రి ఆనందసంగరీ తెలిపారు. ప్రజల భద్రత ప్రభుత్వ ప్రాథమిక భాద్యతగా చెప్పుకొచ్చారు.
ALSO READ: టాలీవుడ్ కు ట్రంప్ షాక్.. మేటరేంటి?
భారత్-కెనడా సంబంధాలు బలోపేతం?
భారత్‌తోపాటు విదేశాల్లో హత్యలు, దోపిడీలు, ఆయుధాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా వంటి కార్యకలాపాలకు పాల్పడుతోంది బిష్ణోయ్ గ్యాంగ్. ఆ దేశంలో బిష్ణోయ్ గ్యాంగ్ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు. వారి నేరాలపై విచారణ జరపడానికి కెనడా చట్టాలకు మరిన్ని అధికారాలు లభిస్తాయి.
ఆ గ్యాంగ్‌ను దేశంలోకి ప్రవేశించకుండా ఇమిగ్రేషన్ అధికారులు నిరోధించవచ్చు. కెనడా తీసుకున్న చర్యల వల్ల భారత్-కెనడాల మధ్య మెరుగుపడతాయని అంటున్నారు అంతర్జాతీయ నిపుణులు. కెనడా అధికారిక గణాంకాల ప్రకారం 88 ఉగ్రవాద సంస్థలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇటీవల కెనడాలో కమెడియన్ కపిల్ శర్మ రెస్టారెంట్‌పై కాల్పులు జరిపింది ఈ ముఠాయే. అందుకు బాధ్యత వహించింది కూడా. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పులు ఈ గ్యాంగ్ పనే. పంజాబ్ సింగర్ సిద్దూ మూసేవాలా హత్యలో ఈ గ్యాంగ్ హస్తం ఉందని వార్తలు వచ్చాయి. జూన్‌లో కెనడాలో కార్యకలాపాలను నడిపిన గోల్డీ బ్రార్ నుండి విడిపోయింది లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్.
డిసెంబర్ 2023లో రాజ్‌పుత్ నాయకుడు సుఖ్‌దేవ్ గోగామేడి హత్య జరిగింది. అక్టోబర్ 2024లో మహారాష్ట్ర రాజకీయ నాయకుడు బాబా సిద్ధిఖీ హత్య చేశారు. 1999 కృష్ణజింక కేసును లక్ష్యంగా చేసుకుని బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇంటి వెలుపల కాల్పులు వంటి ఘటనలు ఈ గ్యాంగ్ ప్రమేయముందని భారత్ భావిస్తోంది.