BigTV English

Indian Origin Man Shot Dead: అమెరికాలో దారుణం.. పట్టపగలే భారతీయుడ్ని కాల్చి చంపిన వ్యక్తి

Indian Origin Man Shot Dead: అమెరికాలో దారుణం.. పట్టపగలే భారతీయుడ్ని కాల్చి చంపిన వ్యక్తి

Indian Origin Man Shot Dead in USA(Current news in World): అమెరికాలో దారుణం జరిగింది. అక్కడి వెళ్లిన భారతీయులు ఏదో విధంగా మృత్యువాత పడుతున్నారు. జలపాతాలను చూడటానికి కొందరు, మరొకొందరు యాక్సిడెంట్లు, ఇంకొందరు అక్కడి వ్యక్తుల చేతుల్లో హత్య గురైన సందర్భాలు లేకపోలేదు. తాజాగా ఓ ఇండియన్‌ని నడిరోడ్డుపై కాల్చి చంపాడు గుర్తు తెలియని వ్యక్తి.


ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకి చెందిన 29 ఏళ్ల గావిన్ దసౌర్ అమెరికాలోని ఇండియానా స్టేట్‌లో ఉంటున్నాడు.
కొన్నేళ్ల కిందట అమెరికాలో సెటిలయ్యాడు. రీసెంట్‌గా మెక్సికోకు చెందిన వివైనాతో గావిన్‌కు మ్యారేజ్ అయ్యింది. మ్యారేజ్ అయి రెండువారాలు కావడంతో నూతన జంట కారులో బయటకువెళ్లింది.

అయితే అనుకోకుండా ఆ కారుని మరొక వాహనం ఢీ కొట్టింది. వెంటనే గావిన్ తన వద్దనున్న గన్‌తో వెనుక ఉన్న వాహనం వద్దకు వచ్చాడు. ఇద్దరి మధ్య చిన్న వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో పట్టరాని కోపంతో గావిన్‌ను గన్‌తో కాల్చి చంపాడు. దాదాపు మూడు రౌండ్లపాటు కాల్పులు జరపడంతో గావిన్ అక్కడి కక్కడే రోడ్డు మీద మృతి చెందాడు.


ALSO READ:  అమెరికా అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్న జో బైడెన్.. కమలా హ్యారిస్ పోటీ చేయాలని సూచన!

ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు నిందితుడి కారును ఛేంజ్ చేసి పట్టుకున్నారు. క్షణికావేశంలో ఆవేశానికి లోనై ప్రాణం తీశాడు. నిందితుడు జైలు ఊచలు లెక్కబెడుతున్నాడు. ఇదే విషయాన్ని కూల్‌గా మాట్లాడుకుంటే పరిస్థితి మరోలా ఉండేదని ఆ సన్నివేశాన్ని చూసినవాళ్లు చెబుతున్నమాట.

https://twitter.com/ManyFaces_Death/status/1814057754572829162

 

Related News

Kim Jong Un: కన్నీళ్లు పెట్టుకున్న కిమ్.. నమ్మండి ఇది నిజం

Donald Trump: మళ్లీ షాకిస్తున్న ట్రంప్.. ఇక అమెరికా గ్రీన్ కార్డు పొందడం కష్టమే..

Terroist Masood Azhar: మసూద్ టార్గెట్ రూ.120 కోట్లు.. గ్లోబల్ టెర్రరిస్ట్‌కి విరాళాలు ఇస్తుంది ఎవరంటే..?

New York Bus Accident: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

Earthquake: సౌత్ అమెరికాను కుదిపేసిన భారీ భూకంపం.. 7.5గా నమోదు

Karachi city: జలదిగ్బంధంలో కరాచీ సిటీ.. వెంటాడుతున్న వర్షాలు, నిలిచిన విద్యుత్, ఆపై అంధకారం

Big Stories

×