BigTV English

Joe Biden : అమెరికా అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్న జో బైడెన్.. కమలా హ్యారిస్ పోటీ చేయాలని సూచన!

Joe Biden : అమెరికా అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్న జో బైడెన్.. కమలా హ్యారిస్ పోటీ చేయాలని సూచన!

Joe Biden news today(International news in telugu): అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రస్తుత దేశ అధ్యక్షుడు డెమొక్రాట్స్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ శనివారం ప్రకటించారు. పార్టీ మేలు కోసం, దేశ హితం కోసం తాను ఎన్నికల్లో పోటీ చేయడం లేదని బైడెన్ ట్విట్టర్ ఎక్స్ లో పోస్టు చేశారు. 81 ఏళ్ల వయసు గల బైడెన్ కు సొంత పార్టీ నుంచే గత కొన్ని రోజులుగా తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. బైడెన్ సన్నిహితులలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, హాలీవుడ్ నటుడు జార్జ్ క్లూనీ సైతం బైడెన్ ఎన్నికల్లో పోటీ చేయడం సరికాదని.. ఇటీవలే విమర్శలు చేశారు.


అమెరికాలో ప్రెసిడెంట్ ఎన్నికలు నవంబర్ 5న జరుగనున్నాయి. అయితే ఎన్నికలకు నాలుగు నెలల ముందు బైడెన్ ఎన్నికల నుంచి తప్పుకునేందుకు గల కారణాలను గమనిస్తే.. గత నెల రోజులుగా ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో ఆయన మాటలు తడబడడం.. మతిమరుపు లక్షణాలు కనిపించడంతో బైడెన్ కు చెందిన డెమోక్రాట్స్ పార్టీ నాయకులే ఆయన ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలని బహిరంగంగా చెప్పారు.

జూన్ లో జరిగిన డిబేట్ కార్యక్రమంలో బైడెన్ తన ప్రత్యర్థి ట్రంప్ ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక మౌనంగా నిలబడిపోయారు. అప్పటి నుంచి ఆయనకు ఆరోగ్య సమస్యలున్నట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. నాలుగు రోజుల క్రితం బైడెన్ కు కొవిడ్-19 పాజిటివ్ అని తేలడంతో ఆయన ఐసోలేషన్ లో ఉన్నారు.


Also Read: రష్యా సరిహద్దులో హైటెన్షన్.. యూఎస్ విమానాలు ప్రత్యక్షం

ఎవరు ఎన్ని చెప్పినా.. ‘దేవుడే దిగి వచ్చినా’ తాను ఎన్నికల పోటీ నుంచి తప్పుకోనని ఇంతకాలం గంభీరంగా చెప్పిన బైడెన్ ఇప్పుడు ఒక్కసారిగా తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు ట్వీట్ చేశారు. ”ఇకపై తన దృష్టి మొత్తం తన పదవికాలంలో అధ్యక్షుడ బాధ్యతలను నిర్వర్తించడంపై కేంద్రీకరిస్తానని.. అమెరికన్లు సైనికులు లాంటి వారని.. ఈ సైన్యానికి ఒక సేనాపతి పనిచేస్తానని బైడెన్ తన ట్వీట్ లో రాశారు.

అమెరికా దేశానికి ప్రెసిడెంట్ గా పని చేసినందుకు గర్వపడుతున్నానని బైడెన్ వ్యాఖ్యానించారు. జనవరి 2025 వరకు అధ్యక్షపదవిలో కొనసాగే బైడెన్.. ఈ వారంలో ప్రజలనుద్దేశించి ప్రసంగం చేయనున్నట్లు తెలిపారు.

అయితే బైడెన్ తన స్థానంలో డెమొక్రాట్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ పేరుని ప్రస్తావించారు. కమలా హ్యారిస్‌కు తన పూర్తిమద్దతు తెలియ జేస్తూ.. డెమొక్రాట్స్ పార్టీ నాయకులందరూ కలిసి ట్రంప్ ని ఎన్నికల్లో ఓడించాలని బైడెన్ పిలుపునిచ్చారు.

Also Read : తండ్రి తుపాకీతో ఆడుకుంటూ చనిపోయిన మూడేళ్ల బాలుడు..

కమలా హ్యారిస్ ని ఒకవేళ డెమొక్రాట్స్ పార్టీ అధికారికంగా అధ్యక్ష అభ్యర్థిగా ప్రకటిస్తే.. అమెరికా ఎన్నికల్లో పోటీ చేసిన భారత మూలాలు గల నల్లజాతి మహిళగా ఆమె చరిత్ర సృష్టిస్తారు.

బైడెన్ ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్న విషయం తెలియగానే ఆయన ప్రత్యర్థి.. రిపబ్లికన్ క్యాండిడేట్ డొనాల్డ్ ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. ఒకవేళ కమలా హ్యారిస్‌ తనకు పోటీగా నిలబడితే.. ఆమెను ఎన్నికల్లో ఓడించడం పెద్ద కష్టం కాదని.. అమె కంటే బైడెన్ బెటర్ అని ట్రంప్ అన్నారు.

Tags

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×