New York Bus Accident: అమెరికా న్యూయార్క్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రఖ్యాత నయాగరా వాటర్‌ఫాల్స్ అందాలను చూసేందుకు వెళ్లి తిరిగి న్యూయార్క్‌కు వస్తున్న ఓ టూరిస్టు బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటన పెంబ్రోక్ సమీపంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందడంతో పాటు పలువురు గాయపడినట్లు స్థానిక మీడియా వర్గాలు తెలిపాయి.
డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో అదుపుతప్పి బోల్తా !
బస్సును వేరే ఇతర వాహనం ఢీకొట్టలేదని, డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో అదుపుతప్పి బోల్తా పడిందని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఎంతమంది చనిపోయారనేదానిపై సమాచారం లేదు. ప్రమాద సమయంలో బస్సులో 51 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు బోల్తా పడిన విషయం తెలియడంతో వెంటనే స్థానిక యంత్రాంగం అప్రమత్తమైంది. మూడు హెలికాప్టర్‌లు, పలు అంబులెన్స్‌లలో క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించాయి.
Also Read: రచ్చ రేపుతున్న కావలి పాలిటిక్స్..
పర్యాటకుల్లో అత్యధికులు భారత్, చైనాకు చెందిన వారు !
ఈ ఘటనతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పర్యాటకుల్లో అత్యధికులు భారత్, చైనాకు చెందిన వారు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదొక విషాద ఘటన అని న్యూయార్క్ గవర్నన్ క్యాథీ హోచుల్ పేర్కొన్నారు. తమ యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టిందని తెలిపారు.
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం..
నయాగరా జలపాతం అందాలను చూసేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా బోల్తా పడిన టూరిస్ట్ బస్సు
న్యూయార్క్ లోని పెంబ్రోక్ సమీపంలో ఘటన
ప్రమాదంలో ఐదుగురు మృతి, పలువురికి గాయాలు
ప్రమాద సమయంలో బస్సులో 54 మంది టూరిస్టులు pic.twitter.com/khyEGLb7Aq
— BIG TV Breaking News (@bigtvtelugu) August 23, 2025