OTT Movie : ఓటీటీలోకి సరికొత్త స్టోరీలు స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. కొన్ని స్టోరీలను చూసినప్పుడు సినిమాలను ఇలా కూడా తీయొచ్చా అనిపిస్తుంటుంది. రీసెంట్ గా థియేటర్లలోకి వచ్చిన ఒక హాలీవుడ్ బాడీ హారర్ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. త్వరలోనే డిజిటల్ స్ట్రీమింగ్ కి రానుంది. ఇందులో ఒక జంట ఊహించని శాపానికి గురవుతుంది. వీళ్ళ శరీరాలు ఒక్కటిగా అతుక్కుపోతుంటాయి. ఈ సీన్స్ చూడటానికి కూడా కష్టంగానే ఉంటుంది. ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే దీనిని చుడండి. ఈ స్టోరీ ఏమిటి ? పేరు ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …
స్టోరీలోకి వెళ్తే
టిమ్, మిల్లీ అనే జంట పది సంవత్సరాలుగా కలసి ఉంటారు. అయితే ఇప్పుడు వీళ్ళ సంబంధం, మునుపటిలా మంచిగా ఉండదు. ఈ జంట నగర జీవితం నుండి బయటపడి, ఒక గ్రామీణ ప్రాంతానికి కొత్త జీవితం కోసం వెళతారు. టిమ్ ఒక సంగీతకారుడు, తన కెరీర్‌లో అంతగా ఏమీ సాధించలేక పోతాడు. మిల్లీ ఒక టీచర్ గా ఉద్యోగం మొదలు పెడుతుంది. వీళ్ళు కొత్త ఇంటి సమీపంలో ఒక రోజు హైకింగ్‌కు వెళ్లినప్పుడు, ఒక భూగర్భ గుహలో చిక్కుకుంటారు. అక్కడ టిమ్ ఒక వింతైన నీటి కొలను నుండి నీళ్ళు తాగుతాడు. ఇది ఒక భయంకరమైన పరిణామాలకు దారి తీస్తుంది. ఇది వారి శరీరాలను, సంబంధాన్ని విపరీతంగా మార్చడం ప్రారంభిస్తుంది. టిమ్ ప్రవర్తన అసాధారణంగా మారుతుంది.
అతను మిల్లీతో ఎక్కువగా రొమాన్స్ చేయాలనుకుంటాడు. ఇది ఒక భయంకరమైన పరిస్థితికి దారి తీస్తుంది. ఈ సమయంలో వీళ్ళ వేరు వేరు శరీరాలు, ఒకే శరీరంగా అతుక్కుపోతాయి. ఈ మార్పు భయాందోళనలకు గురిచేస్తుంది. వీళ్ళ శరీరాలు ఇప్పుడు పూర్తిగా కలిసిపోయి, ఒక కొత్త రూపంలోకి మారతాయి. మిల్లీ తల్లిదండ్రులు వారి ఇంటికి వచ్చినప్పుడు, ఈ కొత్త రూపం చూసి షాక్ అవుతారు. ఆతరువాత స్టోరీ మరిన్ని మలుపులు తీసుకుంటుంది. వీళ్ళెందుకు అలా మారిపోయారు ? దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటి ? మళ్ళీ మామూలు స్థితికి వస్తారా ? ఈ స్టోరీ ఎలా ముగుస్తుంది ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సూపర్నాచురల్ బాడీ హారర్ సినిమాని మిస్ కాకుండా చుడండి.
ప్రైమ్ వీడియోలో
‘Together’ మైఖేల్ షాంక్స్ దర్శకత్వం వహించిన ఒక సూపర్నాచురల్ బాడీ హారర్ చిత్రం, ఇది అతని మొదటి ఫీచర్ ఫిల్మ్. ఈ చిత్రంలో నిజ జీవితంలో భార్యాభర్తలైన డేవ్ ఫ్రాంకో, ఆలిసన్ బ్రీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2025 సన్‌డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్ అయింది. 2025 జూలై 30న యునైటెడ్ స్టేట్స్‌లో విడుదలైంది. త్వరలోనే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. అవ్వబోతోంది. IMDBలో ఈ సినిమాకి 6.9/10 రేటింగ్ కూడా ఉంది.
Read Also : రాత్రికి మాత్రమే వచ్చిపోయే చందమామ… పెళ్లి వద్దు అదే ముద్దు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్