OTT Movie : సస్పెన్స్ తో నడిచే సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలలో మైండ్ ను బెండ్ చేసే ట్విస్టులు ఉంటాయి. అందుకే ఈ సినిమాలను చూడటం మొదలు పెడితే ఇక ఎండింగ్ వరకు చూపు తిప్పుకోలేరు. అలాంటి ఒక తమిళ థ్రిల్లర్ రీసెంట్ గా డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చింది. స్టోరీ కొంచెం పాతగానే ఉన్నా, డైరెక్ట్ చేసిన విధానం ఆకట్టుకుంటోంది. ఇది ఒక అడవిలోని ఒంటరి బంగ్లాలో జరిగే ఒక భయంకరమైన సంఘటన చుట్టూ తిరిగే కథ. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే …
స్టోరీలోకి వెళ్తే
జీవన్, షాలు అనే జంట, మణి, రాజి అనే మరో జంట ప్రేమలో మునుగుతుంటారు. వీళ్లందరికీ నగర జీవితం బోర్ కొట్టి, ఒక అడవిలోని ఒంటరి బంగ్లాకు విహారయాత్రకు వెళతారు. ఈ జన సంచారం లేని ప్రదేశంలో ఆనందంగా గడపాలని ప్లాన్ చేస్తారు. కానీ రాత్రి సమయంలో, షాలు తన బాయ్‌ఫ్రెండ్ జీవన్‌తో ఒంటరిగా ఉన్నప్పుడు అకస్మాత్తుగా మరణిస్తుంది. ఆమె ఎలా చనిపోయిందో ఎవరికీ అర్థం కాదు. ఈ సంఘటన వల్ల మిగిలిన వాళ్ళు భయపడతారు. ఇక ఈ ప్రాంతంలో సహాయం అడగడానికి కూడా ఎవరూ ఉండరు. షాలు మృతదేహంతో ఉన్న వీళ్ళు ఇప్పుడు ఒక నిర్ణయానికి వస్తారు. ఈ సంఘటనను దాచడానికి ప్రయత్నిస్తారు. కానీ ఈ ప్రయత్నం వారంని మరింత గందరగోళ పరిస్థితుల్లోకి తీసుకెళ్తాయి.
ఈ సమయంలో బంగ్లా చుట్టూ వింతైన సంఘటనలు జరగడం ప్రారంభమవుతాయి. అడవిలో ఒక దుష్ట శక్తి వీళ్ళ భయాలను మరింత పెంచుతుంది. ఈ ముగ్గురు తీసుకునే నిర్ణయాలతో, స్టోరీ ఒక భయంకరమైన క్లైమాక్స్ కు దారి తీస్తుంది. చివరికి వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఏమిటి ? ఆ దుష్ట శక్తికి, బంగ్లాకి ఉన్న సంబంధం ఏమిటి ? వీళ్లంతా అక్కడి నుంచి ప్రాణాలతో బయటపడతారా ? ఆ శవాన్ని ఏం చేస్తారు ? అనే విషయాలను ఈ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాని చూసి తెలుసుకోవాల్సిందే.
ఏ ఓటీటీలో ఉందంటే
‘Yaadhum Ariyaan’ ఎం. గోపి దర్శకత్వం వహించిన తమిళ మిస్టరీ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా. ఇది 2025 జూలై 18న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలో వి. దినేష్, అప్పు కుట్టి, తంబి రామయ్య, బ్రానా అబ్దుల్‌సలాం, ఆనంద్ పాండి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఆగస్టు 8, 2025 నుండి Aha Tamilలో స్ట్రీమింగ్ అవుతోంది.