BigTV English

OTT Movie : అయ్య బాబోయ్… అమ్మాయిలు ఆ విద్య నేర్చుకోవాలంటే ఇతనితో ఏకాంతంగా… ఈ హర్రర్ మూవీలో ఆ సీన్లే హైలెట్

OTT Movie : అయ్య బాబోయ్… అమ్మాయిలు ఆ విద్య నేర్చుకోవాలంటే ఇతనితో ఏకాంతంగా… ఈ హర్రర్ మూవీలో ఆ సీన్లే హైలెట్

OTT Movie : అతీంద్రియ శక్తులు ఉన్న ఒక తాంత్రికుడి జీవితాన్ని రియలిస్టిక్ గా చూపిస్తోంది ఒక బెంగాలీ వెబ్ సిరీస్. ప్రతి ఎపిసోడ్ లో ఒక కొత్త స్టోరీతో ఆసక్తికరంగా ఈ సిరీస్ నడుస్తుంది. 1930ల కాలంలో జరిగే ఈ స్టోరీ, బెంగాలీ కల్చర్ తో ఆకట్టుకుంటుంది. ఈ సిరీస్ బెంగాలీ వెబ్ సిరీస్ అవార్డ్స్‌లో ఉత్తమ నటుడు, ఉత్తమ సంగీతం కోసం నామినేషన్లను పొందింది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …


రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్

‘తారానాథ్ తాంత్రిక్’ (Taranath Tantrik) ఒక బెంగాలీ హారర్ వెబ్ సిరీస్. క్వాషిక్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందింది. ఈ సిరీస్ బిభూతిభూషణ్ బంద్యోపాధ్యాయ్ సృష్టించిన ప్రసిద్ధ బెంగాలీ సాహిత్య పాత్ర “తారానాథ్ తాంత్రిక్” ఆధారంగా రూపొందింది. ఆ తర్వాత తారదాస్ బంద్యోపాధ్యాయ్ ఈ పాత్ర గురించి మరిన్ని కథలు రాశారు. ఈ సిరీస్ 10 ఎపిసోడ్‌లతో, 1930ల కోల్‌కతా నేపథ్యంలో జరుగుతుంది. ఇది హోయ్‌చోయ్, జియో హాట్ స్టార్ ప్లాట్‌ ఫామ్‌లలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ లో జయంత్ కృపలానీ, కౌశిక్ రాయ్, సత్రాజిత్ సర్కార్, శ్వేతా చౌదరి ప్రధాన పాత్రల్లో నటించారు. IMDbలో దీనికి 5.2/10 రేటింగ్ ఉంది.


స్టోరీలోకి వెళ్తే

1930ల కోల్‌కతాలో కిషోరి అనే వ్యక్తి, అతని స్నేహితుడు తాంత్రిక విద్యల గురించి తెలుసుకోవాలనుకుంటారు. వీళ్ళిద్దరూ కలసి తారానాథ్ తాంత్రిక్ ఇంటికి చేరుకుంటారు. తారానాథ్ ఒక మాజీ తాంత్రికుడు. ఇప్పుడు జ్యోతిష్యుడిగా జీవిస్తూ, తన కుమార్తె చారితో కలిసి మోట్ లేన్‌లోని ఒక పాత ఇంట్లో నివసిస్తుంటాడు. తన తాంత్రిక విద్యను దుర్వినియోగం చేయడం వల్ల అతను తన అతీంద్రియ శక్తులను కోల్పోయాడు. కానీ అతని గతంలో బెంగాల్ అంతటా పర్యటించినప్పుడు, అనేక అతీంద్రియ సంఘటనలను ఎదుర్కొన్నాడు. ఈ యువకులు అతని ఇంటికి వచ్చినప్పుడు, తారానాథ్ వారితో టీ, సిగరెట్లతో కూర్చొని, గతంలో జరిగిన భయంకరమైన శక్తులతో జరిగిన సన్నివేశాలను తన స్టైల్ లో వివరిస్తాడు.

ప్రతి ఎపిసోడ్‌లో, అతను ఒక కొత్త కథ చెబుతాడు. తన మొదటి గురువు మాటు పాగ్లీతో జరిగిన సంఘటన, ఒక యువతిని కపాలిక్ నుండి రక్షించే ప్రయత్నం, కాళభైరవ శక్తిని సంపాదించడంలో జరిగిన సంఘటనలు. ఇలాంటివి చెప్తూ ఆశ్చర్య పరుస్తాడు. అప్పట్లో ఇతని దగ్గర తంత్రాలు నేర్చుకునే అమ్మాయిలను, ఈ సామీజీ ఒక చూపు చూసేవాడు. ఈ కథలు తారానాథ్ యవ్వనంలో జరిగిన భయంకరమైన అనుభవాలను చూపిస్తాయి. ఈ సిరీస్ అతని కథల ద్వారా, బెంగాలీ సంస్కృతిలోని మాంత్రిక విద్య, దెయ్యాలు, అతీంద్రియ శక్తుల గురించి కళ్ళకు కట్టినట్లు చూపిస్తాయి. తారానాథ్ ఎందుకు తంత్రాలను వదిలి పెట్టాడు ? ఒక సాధారణ బ్రహ్మణుడిగా ఎందుకు ఉన్నాడు ? అనే విషయాలను ఈ సిరీస్ ని చూసి తెలుసుకోవాల్సిందే.   బెంగాలీ హారర్ అభిమానులకు ఈ సిరీస్ ఒక మరచిపోలేని థ్రిల్ ను అందిస్తుంది.

Read Also : పోలీస్ స్టేషన్ లో ట్యూషన్… అమ్మాయితో అలాంటి పని… ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ క్రైమ్ థ్రిల్లర్

Related News

OTT Movie : అపార్ట్మెంట్లో వరుస హత్యలు… ఈ సీరియల్ కిల్లర్ టార్గెట్ అమ్మాయిలే… కిర్రాక్ సైకో కిల్లర్ మూవీ

OTT Movie : పాడుబడిన బంగ్లాలో ఫస్ట్ నైట్… నెక్స్ట్ ట్విస్టుకు బుర్రపాడు… మతిపోగోట్టే మర్డర్ మిస్టరీ

OTT Movie : మనుషుల్ని అతుక్కుపోయేలా చేసే శాపం… రోమాలు నిక్కబొడుకునే సీన్లు… తినేటప్పుడు అస్సలు చూడొద్దు

OTT Movie : దేవుడి కోసం వెళ్లి దెయ్యానికి బలి… ముసలాడితో అమ్మాయిలు అడ్డంగా బుక్… మోస్ట్ కాంట్రవర్షియల్ హర్రర్ మూవీ

OTT Movie : అందమైన అమ్మాయే ఈ దెయ్యం టార్గెట్… బెడ్ పై కూడా వదలకుండా… బతికుండగానే నరకం అంటే ఇదే

Big Stories

×