Karachi city: రుతుపవనాలు పాకిస్థాన్‌ను వెంటాడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించింది. పాక్ ఫైనాన్సియల్ రాజధాని కరాచీ సిటీ గురించి చెప్పనక్కర్లేదు. కరాచీ నగరం జల దిగ్బంధంలో చిక్కుకుంది.
భారీ వర్షాల కారణంగా ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటివరకు 15 మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. మరో 10 మంది గాయపడినట్లు స్థానిక మీడియా తెలిపింది. వర్షాల ధాటికి సిటీలో విద్యుత్ వ్యవస్థ కుప్పకూలింది. లక్షలాది మంది ప్రజలు రెండు రోజులుగా అంధకారంలో ఉన్నారు.
కరాచీ సిటీతోపాటు నార్త్ నాజిమాబాద్, గులిస్థాన్-ఎ-జౌహర్, డిఫెన్స్ వ్యూ, సుర్జాని, కోరంగి ప్రాంతాల్లో రెండురోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ పునరుద్దరణ లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గులిస్థాన్-ఎ-జౌహర్ ప్రాంతంలో రోజున్నరగా విద్యుత్ లేకపోవడంతో స్థానికులు రోడ్లపైకి వచ్చారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. పాకిస్థాన్ హైదరాబాద్ ప్రాంతంలో ఇదే పరిస్థితి కంటిన్యూ అవుతోంది. లతీఫాబాద్, ఖాసిమాబాద్ ఏరియాల్లో 90 శాతం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని జియో వార్త సంస్థ తెలిపింది. వరద నీరు ఇళ్లలోకి చేరడంతో సుర్జాని ప్రాంతంలో వేలాది కుటుంబాలు ఇళ్ల పైకప్పులపై తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ALSO READ: రష్యాపై ఒత్తిడి కోసమే భారత్‌పై సుంకాల మోత, నిజం అంగీకరించిన అమెరికా
పాకిస్థాన్ పరిస్థితి చూసిన సింధ్ గవర్నర్ కమ్రాన్ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ సంక్షోభం అతిపెద్ద సవాలుగా మారిందన్నారు. విచిత్రం ఏంటంటే గవర్నర్ హౌస్ ఫిర్యాదుల విభాగానికి ఒక్క రోజులో 11 వేలకు పైగా ఫిర్యాదులు అందాయి. అందులో ఎక్కువభాగం కరెంట్ కోతలకు సంబంధించినవే. మరోవైపు వర్షాల కారణంగా కరాచీ సిటీలో ప్రధాన రహదారులు నీట మునిగాయి.
రాబోయే రోజుల్లో రుతుపవనాలు విధ్వంసం సృష్టించే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. గురువారం కరాచీలో మరిన్ని వర్షాలు కురుస్తాయని పాకిస్తాన్ వాతావరణ శాఖ-PMD అంచనా వేసింది.వివిధ ప్రాంతాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, శుక్రవారం కూడా ఇదే విధంగా ఉంటుందని తెలిపింది.
బుధవారం వర్షపాతం గణాంకాల ప్రకారం ఓరంగి పట్టణంలో అత్యధికంగా 113 మి.మీ వర్షపాతం నమోదైంది. కుండపోత వర్షాల కారణంగా కరాచీలో క్లిఫ్టన్ అండర్‌పాస్ మినహా మిగిలిన అండర్‌పాస్‌లు మూసివేశారు అధికారులు. కోరంగి నది, కోరంగిలోని EBM కాజ్‌వే మూసివేశారు.
Karachi paralyzed by torrential rains: homes flooded, emergency declared#Pakistan #Lahore #flooding #Flood #FloodRelief #Punjab #Rawalpindi #Buner #bunerflood #News #KhyberPakhtunkhwa #Rain #karachirain #KarachiRains #KarachiFloods pic.twitter.com/WbVdDAnjm3
— Abhay (@AstuteGaba) August 21, 2025