BigTV English

International:బంగ్లాదేశ్ నుంచి అంతమంది భారతీయులు వచ్చేశారా?

International:బంగ్లాదేశ్ నుంచి అంతమంది భారతీయులు వచ్చేశారా?

Indians reached home from Bangladesh(World news today): రిజర్వేషన్లపై రగిలిపోతున్న బంగ్లా యువకులు ఏ మాత్రం తగ్గడం లేదు. తమ ఆందోళనలు మరింత ఉధృతం చేశారు. బంగ్లా స్వాతంత్ర్య సమర యోధుల కుటుంబాలకు ఉద్యోగాల విషయంలో న్యాయం చేయాలని వారికి రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం వారికి అవకాశాలు కల్పిస్తూ వస్తోంది. దీనికి వ్యతిరేకంగా చాలా కాలంగా బంగ్లాదేశ్ యువత ఉద్యమిస్తున్నారు. అదే సమయంలో విదేశాలనుంచి వస్తున్నవారితో తమ ఉద్యోగావకాశాలు దెబ్బతింటున్నాయని బంగ్లా యువత భావిస్తోంది. నిరుద్యోగ సమస్య ఆ దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. దీనితో ఎక్కడికక్కడ ఆందోళనలు చేస్తున్నారు బంగ్లా యువత.


అట్టుడుగుతున్న బంగ్లాదేశ్

అంతకంతకూ పెరుగుతున్న ఆందోళనలతో అట్డుడిగిపోతున్న బంగ్లాదేశ్ లో జరిగిన హింసాకాండలో ఇప్పటికే వందకు పైగా చనిపోయారు. దీనితో బంగ్లాదేశ్ లో వైద్య విద్య కోసం వచ్చిన విద్యార్థులు, ఉపాధి కోసం వచ్చి స్థిరపడిన భారతీయులు ఆందోళనకు గురయ్యారు. భారత విదేశాంగ శాఖ మంత్రిత్వ శాఖ బంగ్లాదేశ్ సంబంధిత శాఖ మంత్రులు, అధికారులతో మాట్లాడి భారతీయులను సురక్షితంగా పంపిచాలని అభ్యర్థించింది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే నాలుగువేల ఐదు వందలకు పైగా భారతీయులు ఇండియాకు తిరిగొచ్చారని విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలియజేసింది. భారత పౌరులతో సహా నేపాల్, భూటాన్, శ్రీలంక తదితర దేశాల పౌరులు కూడా ఇండియాకు సురక్షితంగా చేరుకున్నారు. ప్రస్తుతం వీరంతా భారతదేశం నుంచి వారి దేశాలకు ఇండియన్ కాన్సులేట్ సహకారంతో చేరుకుంటున్నారు. బంగ్లాదేశ్ ప్రభుత్వం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తమ దేశాలనుంచి సురక్షితంగా వారి దేశాలకు వెళ్లే వారి కోసం ప్రత్యేక రక్షణ విభాగం సహకారంతో దగ్గరుండి మరీ పంపుతున్నారు.


బంగ్లాను వీడేందుకే మొగ్గు

ఎక్కడికక్కడ ఆందోళనకారులను పోలీసు బలగాలతో అణిచివేస్తున్నారు. ప్రస్తుతానికి అక్కడ శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని ప్రకటిస్తున్నా..పరిస్థితులు మాత్రం సీరియస్ గానే ఉన్నాయి. అందుకే బంగ్లాదేశ్ ఎంతగా భరోసా ఇస్తున్నప్పటికీ 70 శాతం మంది తమ దేశాలకే వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.బంగ్లాదేశ్ లో భారత పౌరులు షుమారు పదిహేను వేల మంది దాకా ఉంటారు. వారిలో ఎనిమిదివేల ఐదువందల దాకా ఉన్నత చదువుల కోసం వచ్చినవారు ఎనిమిదివేల ఐదువందల మంది దాకా ఉంటారని అంచనా.

Related News

Kim Jong Un: కన్నీళ్లు పెట్టుకున్న కిమ్.. నమ్మండి ఇది నిజం

Donald Trump: మళ్లీ షాకిస్తున్న ట్రంప్.. ఇక అమెరికా గ్రీన్ కార్డు పొందడం కష్టమే..

Terroist Masood Azhar: మసూద్ టార్గెట్ రూ.120 కోట్లు.. గ్లోబల్ టెర్రరిస్ట్‌కి విరాళాలు ఇస్తుంది ఎవరంటే..?

New York Bus Accident: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

Earthquake: సౌత్ అమెరికాను కుదిపేసిన భారీ భూకంపం.. 7.5గా నమోదు

Karachi city: జలదిగ్బంధంలో కరాచీ సిటీ.. వెంటాడుతున్న వర్షాలు, నిలిచిన విద్యుత్, ఆపై అంధకారం

Big Stories

×