Jio Prepaid Recharge: ప్రతీ నెలా ఫోన్ రీఛార్జ్ చేసుకోవడం చాలా మందికి విసుగు పుట్టించే విషయమే అయినా.. చేసుకోక తప్పదు మరి. ఫోన్‌లో సోషల్ మీడియా స్క్రోల్ చేయాలన్నా, ఫోన్ కాల్స్ మాట్లాడాలన్నా, టీవీలో నచ్చిన ఓటీటీని ఎంజాయ్ చేయాలన్నా రీఛార్జ్ చేసుకుని తీరాల్సిందే. అయితే ఇక నుంచి మూడు నెలల వరకు దాని గురించి ఆలోచించకుండా ఉండవచ్చు. జియో తీసుకొచ్చిన ఈ రీఛార్జ్ ప్లాన్‌లో కాలింగ్, డేటాతో పాటు ప్రముఖ ఓటీటీ యాప్స్, క్లౌడ్ స్టోరేజ్ వంటి అదనపు బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఇంతకీ ఈ ప్లాన్‌లో ఏమేం వస్తాయి? దీని ధర ఎంత? మూడు నెలలకు ఇది నిజంగా ఎంతవరకు ఉపయోగపడుతుంది? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ ప్లాన్ ధర రూ.1,029 కాగా.. దీని వాలిడిటీ 84 రోజులు. దీనిలో రోజూ వాడటానికి 2GB హైస్పీడ్ డేటా లభిస్తుంది. అంటే మొత్తం మీద దాదాపు 168GB డేటా మన సొంతం అవుతుంది. వీటితో పాటు ఏ నెట్‌వర్క్‌కైనా అన్‍లిమిటెడ్ కాల్స్, రోజూ వంద SMS ఫ్రీగా వస్తాయి. మీ ఏరియాలో 5G నెట్‌వర్క్ ఉంటే మాత్రం అన్‌లిమిటెడ్ 5G డేటాను ఫుల్‌గా ఎంజాయ్ చేయొచ్చు.
Also Read: యూపీఐ పేమెంట్స్ రూ.2,000 దాటితే ఛార్జీలా? కేంద్రం నుంచి వచ్చిన ఆఫీషియల్ అప్డేట్ ఇదే!
కేవలం ఇంటర్నెట్ కాకుండా ఎంటర్‌టైన్‌మెంట్ లవర్స్‌కు ఈ ప్లాన్‌లో మంచి ఆఫర్లున్నాయి. ఈ రీఛార్జ్ చేసుకుంటే అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్‌స్క్రిప్షన్ ఫ్రీగా వస్తుంది. దీంతో ప్రైమ్ మూవీస్, వెబ్ సిరీస్‌లను హ్యాపీగా చూసేయొచ్చు. అలాగే జియో టీవీ, జియో హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ కూడా అందుబాటులో ఉంటాయి.
ఈ ప్లాన్ ద్వారా జియో ఏఐ క్లౌడ్ స్టోరేజ్ లో 50GB స్పేస్ లభిస్తుంది. దీనివల్ల మన ఫొటోలు, డాక్యుమెంట్లు చాలా సేఫ్‌గా దాచుకోవచ్చు. అంతేకాదు.. దీనితో పాటు గూగుల్ జెమిని ప్రో 18 నెలల ఆఫర్ కూడా ఉంది. దీని ద్వారా ఏఐ టూల్స్ వాడుకోవడానికి ఏకంగా 5,000GB క్లౌడ్ స్టోరేజ్ దొరుకుతుంది.
ప్రతీ నెలా రీఛార్జ్ చేసుకునే తలనొప్పి వద్దనుకుంటే.. అటు మంచి ఇంటర్నెట్ స్పీడ్, ఇటు ఓటీటీ సినిమాలు కావాలనుకునే వారికి ఈ ప్లాన్ పర్‌ఫెక్ట్. మూడు నెలల పాటు ఎలాంటి రీఛార్జ్ టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఉండొచ్చు.
Also Read: బడ్జెట్‌లో HP కొత్త ల్యాప్‌టాప్.. ఇంటెల్ పాంథర్ లేక్ ప్రాసెసర్‌తో అదిరే స్పెసిఫికేషన్స్!