Ganesha Flexi Controversy: తమిళనాడులోని తిరునెల్వేలిలో ఓ బిర్యానీ షాపు వెలుపల ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ తీవ్ర దుమారానికి దారితీసింది. వినాయకుడు బిర్యానీ తింటున్నట్లు లేదా తయారు చేస్తున్నట్లుగా ఉన్న చిత్రాన్ని బ్యానర్‌పై ముద్రించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గణేశ్ చతుర్థి నేపథ్యంలో కస్టమర్లను ఆకర్షించేందుకు హోటల్ యజమాని చేసిన ఈ పనిపై హిందువుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. సెల్వరాజ్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు షాపు యజమాని జయంత్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పబ్లిసిటీ స్టంట్ లో భాగంగా స్థానిక కస్టమర్లను ఆకర్షించేందుకు జయంత్ ఈ వివాదస్పద ఆలోచనకు తెరతీశారు. బిర్యానీ సేల్స్ పెంచుకునేందుకు ఏకంగా గణనాథుడు బిర్యానీ తింటున్నట్లుగా ఫ్లెక్సీని తయారు చేయించి.. షాపు ఎదురు పెట్టించారు. అయితే దీనిపై స్థానికంగా అభ్యంతరాలు రావడంతో.. జయంత్ పై పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. ప్రస్తుతం అతడ్ని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.
STOP USING HINDU DEITIES AS MARKETING PROPS😈😈
In Tirunelveli, a biryani shop depicted Bhagwan Ganesha cooking Arabic style biryani in an advertisement, triggering outrage and police action.
Sanatan Dharma is sacred not a playground for cheap publicity pic.twitter.com/hAXG7vQByL
— Sheetal Chopra 🇮🇳 (@SheetalPronamo) September 15, 2026
మరోవైపు తమిళనాడు అంతటా వినాయక చతుర్థి వేడుకలు ఎంతో వైభవంగా సాగుతున్నాయి. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా విశేష పూజలు, అలంకరణలు, భారీ మండపాలు, భక్తుల కోలాహలంతో ఆలయాలు సందడిగా మారాయి. ప్రసిద్ధ కపాలిశ్వరర్ ఆలయంలో సోమవారం తెల్లవారుజామునే గణపతి హోమంతో వేడుకలు ప్రారంభమయ్యాయి. నర్తన వినాయకుడి విగ్రహానికి శాస్త్రోక్తంగా అభిషేకాలు నిర్వహించి, బంగారు కవచంతో అలంకరించారు.
అటు మధురైలోని శ్రీ మీనాక్షి సుందరేశ్వరర్ ఆలయంలోని 7 అడుగుల ‘ముక్కురుణి వినాయకుడి’కి ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి నైవేద్యంగా భారీ పరిమాణంలో ప్రసిద్ధ ‘ముక్కురుణి కొజుకట్టై’ (కుడుములు) తయారీ చేసి సమర్పించారు. తిరుచిరాపల్లిలోని ప్రసిద్ధ మలైకోటై (రాక్‌ఫోర్ట్) ఉచ్చి పిళ్లయార్ ఆలయానికి వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. అక్కడ 14 రోజుల పెరువిళా ఉత్సవాలు 25 కిలోల భారీ కొజుకట్టై నైవేద్యంతో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.
Also Read: Airtel బిగ్ సర్‌ప్రైజ్.. ఆ ప్లాన్‌పై ఏకంగా 150GB ఎక్స్‌ట్రా డేటా ఫ్రీ.. ఆఫర్ మిస్ అవ్వకండి!
ఇదిలా ఉంటే పండుగ ముగింపు ఘట్టమైన నిమజ్జన ఊరేగింపుల కోసం అధికారులు, నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. హిందూ మున్నాని సంస్థ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.5 లక్షల విగ్రహాలను ప్రతిష్ఠించగా ఇందులో ఒక్క చెన్నైలోనే 5,501 విగ్రహాలు ఉన్నాయి. సెప్టెంబర్ 19, 20 తేదీల్లో నిమజ్జన ఊరేగింపులు జరగనుండగా.. శాంతిభద్రతల పరిరక్షణ కోసం గ్రేటర్ చెన్నై పోలీసులు 16,500 మంది సిబ్బందిని, 500 మంది హోం గార్డులను రంగంలోకి దించారు. నిమజ్జనం కోసం 17 ప్రత్యేక మార్గాలను కేటాయించారు. పర్యావరణ నిబంధనల దృష్ట్యా పట్టినపాక్కం, నీలాంకరై తీరాలలో సాంప్రదాయ నిమజ్జనాలపై ఆంక్షలు అమలులో ఉన్నాయి.
Also Read: యూపీఐ పేమెంట్స్ రూ.2,000 దాటితే ఛార్జీలా? కేంద్రం నుంచి వచ్చిన ఆఫీషియల్ అప్డేట్ ఇదే!