Russia Oil: రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడమే లక్ష్యంగా.. అమెరికా పార్లమెంటులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రష్యా నుంచి ముడిచమురు, సహజ వాయువుని కొనుగోలు చేస్తున్న దేశాలే టార్గెట్‌గా.. ప్రత్యేక బిల్లు రూపుదిద్దుకుంది. ఈ డ్రాఫ్ట్ లేజిస్లేషన్‌కు.. 86-11 తేడాతో యూఎస్ సెనేట్‌లో ఇప్పటికే ఆమోదం పొందింది. దీనిని హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ముందుకు తీసుకురావడంలో.. పొలిటికల్ హీట్ నెలకొంది. డెమొక్రాట్ నేతలు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ, రిపబ్లికన్ నాయకత్వం అత్యవసర చర్యగా పరిగణిస్తోంది. ఈ సోమవారమే హౌస్ రూల్స్ కమిటీలో ఓటింగ్‌కు సిద్ధమైంది.
ఐదు ప్రధాన దేశాలపై భారీ టారిఫ్‌లు..?
ఈ బిల్లు కనుక చట్టరూపం దాల్చితే, ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌కు అసాధారణ అధికారాలు లభిస్తాయి. రష్యా నుంచి అత్యధికంగా క్రూడాయిల్, నేచురల్ గ్యాస్ దిగుమతి చేసుకునే ఐదు ప్రధాన దేశాలపై వంద శాతం వరకు భారీ టారిఫ్‌లు విధించే అవకాశం ఉంటుంది. ఈ లిస్టులో.. భారత్, చైనా లాంటి దేశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. బిల్లు కనుక నెగ్గితే.. ద్వైపాక్షిక వాణిజ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ బిల్లును సమర్థిస్తున్న వారు.. యుద్ధం కోసం రష్యాకు వస్తున్న నిధులను నిరోధిస్తుందని వాదిస్తుంటే, డెమోక్రాట్లు, వ్యాపార వర్గాలు మాత్రం.. దేశంలో ధరల పెరుగుదలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. మొత్తానికి, రష్యా చమురు కొనుగోళ్లపై అమెరికా తెచ్చిన ఈ టారిఫ్ బిల్లు.. అంతర్జాతీయ వాణిజ్య రంగంలో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. సోమవారం జరగనున్న హౌస్ రూల్స్ కమిటీ ఓటింగ్ తర్వాత.. ఈ బిల్లు భవితవ్యం తేలనుంది. భారత్ లాంటి దేశాలపై ఇది ఎలాంటి ఆర్థికపరమైన సవాళ్లను విసురుతుందనేది ఉత్కంఠగా మారింది.
Also Read: ఖమ్మం జిల్లాలో ఎల్‌నినో ఎఫెక్ట్.. పంట మార్చినా రైతన్నకు తప్పని కన్నీళ్లు!