Hamza bin Laden: అమెరికాలో సెప్టెంబర్ 11 దాడులకు 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అల్ ఖైదా విడుదల చేసిన ఓ వీడియో ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ వీడియోలో అల్-ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ కుమారుడు హమ్జా బిన్ లాడెన్ కనిపించడం తీవ్ర కలకలం రేపుతోంది. నిజానికి 2019లోనే ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ సరిహద్దుల్లో అమెరికా జరిపిన కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్‌లో హమ్జా చనిపోయినట్లు కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన వీడియో బయటకు రావడంతో ఒక్కసారిగా నిఘా వర్గాల దృష్టి ఈ వీడియోపై పడింది.
50 నిమిషాల నిడివి గల వీడియోను అల్ ఖైదా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీనికి ‘ఏ క్వార్టర్ సెంచరీ ఆఫ్ ది 11 సెప్టెంబర్ రైడ్స్’ అనే క్యాప్షన్ ఇచ్చింది. కాగా గతంలో హమ్జాకు సంబంధించిన ఆడియో సందేశాలు మాత్రమే విడుదల కాగా.. పూర్తిస్థాయి వీడియోలో అతడు కనిపించడం ఇదే తొలిసారి. ఈ వీడియోలో హమ్జా తెల్లటి తలపాగా ధరించి, పగళ్లు వచ్చిన మట్టిగోడకు ఆనుకొని కూర్చున్నాడు. ఆయన పక్కనే ఒక రైఫిల్ కూడా ఉంది. ఇక ఈ వీడియోలోనే అల్-ఖైదా మాజీ చీఫ్ అయ్మన్ అల్-జవాహిరి పాత చిత్రాలను కూడా ప్రపంచానికి చూపించారు.
Al-Qaeda Releases New Video Featuring Hamza Bin Laden On 9/11 Anniversary
Al-Qaeda’s media arm, As-Sahab, has released a 52-minute propaganda video marking the 25th anniversary of the September 11 attacks, featuring previously unseen footage of Hamza bin Laden, the son of…1️⃣ pic.twitter.com/7uL3VYjKEx
— Aamaj News English (@aamajnews_EN) September 11, 2026
అయ్మన్ అల్-జవాహిరి మరణించినప్పటికీ.. అల్-ఖైదా ఇప్పటివరకు అధికారికంగా ఆయన మరణాన్ని ధృవీకరించలేదు. ఈ కొత్త వీడియో ద్వారా ప్రస్తుత అల్-ఖైదా అధిపతి సైఫ్ అల్-అదల్.. అయ్మన్ భావజాలాన్ని వ్యాప్తి చేయడంతో పాటు, యువతను ఆకర్షించేందుకు ‘బిన్ లాడెన్’ పేరును వాడుకోవాలని సంస్థ భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. మరోవైపు తాజా వీడియోలో తమ భవిష్యత్ దాడులకు సంబంధించి ఎలాంటి ప్రకటనను అల్ ఖైదా చేయలేదు. గతంలో చేసిన దాడులనే హైలెట్ చేస్తూ వచ్చింది. 2014 సెప్టెంబర్‌లో కరాచీ నావికాదళ డోక్యార్డ్‌పై జరిపిన దాడి దృశ్యాలను ఈ వీడియో ప్రారంభంలో పంచుకుంది.
Also Read: ఇప్పటి ఆర్భాటాలు లేవు కానీ.. 80ల్లో వినాయకచవితి మజానే వేరు.. ఆ రోజులు మళ్లీ రావు!
2001 సెప్టెంబర్ 11న 19 మంది అల్-ఖైదా ఉగ్రవాదులు 4 విమానాలను హైజాక్ చేసి అమెరికాపై భయానక దాడులు జరిపారు. రెండు విమానాలతో న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ ట్విన్ టవర్స్‌ను ఢీకొట్టగా.. మూడో విమానం పెంటగాన్‌ను తాకింది. నాల్గవ విమానం పెన్సిల్వేనియాలో కూలిపోయింది. ఈ దాడుల్లో 2,977 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోగా.. యావత్ ప్రపంచమే నిర్ఘాంతపోయింది. ఈ దాడులు జరిగి 25 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో అప్పటి మృతులకు అమెరాకా సమాజం నివాళులు అర్పిస్తోంది. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పెంటగాన్ వద్ద జరిగిన కార్యక్రమంలో పాల్గొని బాధితులకు అంజలి ఘటించారు. అదే సమయంలో ఈ ప్రచార వీడియో బయటకు రావడం చర్చకు తావిచ్చింది.
Also Read: జిన్ పింగ్ రాకకు ముందు.. చైనా రాయబారి ఆసక్తికర పోస్ట్.. ఏమన్నారంటే?