BigTV English

India-US : ఇండియన్ యువతి బట్టలు విప్పించి.. అమెరికాలో దారుణం

India-US : ఇండియన్ యువతి బట్టలు విప్పించి.. అమెరికాలో దారుణం

India-US : అమెరికాలో అరాచకం. జాత్యహంకారం మరోసారి బుసలు కొట్టింది. తెల్ల తోలు ఉన్న వాళ్లే గొప్ప అనే ఫీలింగ్ పెరిగిపోతోంది. ఇప్పటికే ట్రంప్ ప్రపంచ దేశాలను చిన్నచూపు చూస్తున్నారు. టారిఫ్‌లతో దారుణంగా దెబ్బ కొట్టారు. యూఎస్‌లో ఇండియా, చైనా వాళ్లను అదోరకంగా ట్రీట్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికాకు వెళ్లిన ఓ భారత యువ మహిళా వ్యాపారవేత్తను దారుణంగా ట్రీట్ చేశారు FBI అధికారులు. అలస్కా ఎయిర్‌పోర్ట్‌లో ఆమెను అనుమానంతో అడ్డుకుని 8 గంటల పాటు నిర్బంధించారు.


పవర్ బ్యాంక్ చూసి బాంబ్ అనుకొని..

మార్చి 30న ఇండియా నుంచి యూఎస్‌కు టూరిస్ట్‌ వీసాపై వెళ్లింది శ్రుతి చతుర్వేది. అలస్కాలో పర్యాటక ప్రాంతాలు చూసింది. ఇక, స్వదేశానికి తిరిగి వచ్చే క్రమంలో అనుకోని చేదు అనుభవం ఎదురైంది. అలస్కా ఎయిర్‌పోర్టులో రెగ్యులర్ లగేజ్ చెకప్‌ చేస్తున్నారు అక్కడి సెక్యూరిటీ స్టాఫ్. ఇండియాకు చెందిన శ్రుతి చతుర్వేది హ్యాండ్‌బ్యాగ్‌లోర పవర్ బ్యాంక్‌ను చూశారు. వారికి దానిపై అనుమానం వచ్చి శ్రుతిని ప్రశ్నించారు. అది జస్ట్ పవర్ బ్యాంచ్ అని ఆన్సర్ చెప్పింది. వాళ్లు నమ్మలేదు. బాంబ్ అని డౌట్ పడ్డారు. కావాలంటే చెక్ చేసుకోవచ్చని శ్రుతి చెబుతున్నా.. సెక్యూరిటీ సిబ్బంది వినిపించుకోలేదు. FBI టీమ్‌ను రప్పించారు. వారు మరింత ఓవరాక్షన్ చేశారు.


ఫోన్ లాగేసుకుని.. వాష్‌రూమ్‌కు వెళ్లనీయకుండా..

శ్రుతి చతుర్వేదిని ఓ రూమ్‌లో లాక్ చేశారు. పురుష సిబ్బంది ఆమె బాడీని తడిమి తడిమి తనిఖీ చేశారు. వెచ్చదనం కోసం వేసుకున్న ఓవర్ కోట్‌ను విప్పించారు. కనీసం వాష్‌రూమ్‌కు కూడా వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వకుండా.. గంటల తరబడి ఆ గదిలోనే నిర్బంధించారు. కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి విషయం చెబుదామంటే.. అప్పటికే ఆమె ఫోన్, వాలెట్ లాగేసుకున్నారు. తాను ఇండియన్ అనే కారణంతోనే వాళ్లంత రూడ్‌గా ప్రవర్తించారని వాపోతోంది శ్రుతి.

ఎక్స్‌లో శ్రుతి ఆవేదన

పవర్ బ్యాంక్‌పై అనుమానంతో తనను 8 గంటల పాటు ఎయిర్‌పోర్టులోని చెకింగ్ రూమ్‌లో బంధించారంటూ ఎక్స్‌లో పోస్ట్ చేసింది శ్రుతి చతుర్వేది. తాను వెళ్లాల్సిన విమానం కూడా మిస్ అయ్యానని.. అయినా అక్కడి సిబ్బంది అంత తేలిగ్గా తనను వదలలేదని తెలిపింది. ఇదే విషయాన్ని కేంద్ర విదేశాంగ శాఖకు, మంత్రి జైశంకర్‌కు ట్యాగ్ చేశారు శ్రుతి.

Also Read : చెప్పు దెబ్బలు తిన్న పెళ్లి కొడుకు.. ఎందుకంటే..?

అంతా ట్రంప్ వల్లేనా..?

మొబైల్ ఛార్జింగ్ కోసం వాడే పవర్ బ్యాంక్. ఈ రోజుల్లో చాలామంది దగ్గర ఉండే ఎలక్ట్రానిక్ గాడ్జెట్. అది తెలీని వాళ్లు ఎవరుంటారు? అమెరికన్ అధికారులుకు ఇంత చిన్న విషయం తెలీదనుకోవాలా? కేవలం కలర్ చూసి.. ఇండియన్ అని తెలిసి.. ఇలా చేశారా? ట్రంప్ మాటలు, చర్యలతో అమెరికాలో రేసిజం పెరిగిపోతోందా? ఇతర దేశస్థులను తక్కువగా చూడటం, వారిని సాకులతో వేధించి తమ ఆధిపత్యం ప్రదర్శించాలని అనుకుంటున్నారా? అనే చర్చ మొదలైంది. గతంలో షారుక్ ఖాన్ లాంటి వాళ్లను సైతం ముస్లిం పేరు చూసి ఎయిర్‌పోర్టులో వేధించిన ఉదంతాలు చూశాం. చాలా కాలంగా అలాంటి ఘటనలు జరగడం లేదు. మళ్లీ ఇప్పుడు శ్రుతి విషయంలో అలా జరిగిందంటే.. అది ట్రంప్ రెచ్చగొట్టే ధోరణి వల్లే అనే వాదన వినిపిస్తోంది. ఇప్పటికే సుంకాలతో ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురి చేస్తున్నాడు అమెరికా అధ్యక్షుడు. ఇప్పుడిక ఇలాంటి రేసిజం కూడా విజృంభిస్తే..? అమెరికాలో పరిస్థితి అదుపు తప్పినట్టే అంటున్నారు.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×