పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో తీపి జ్ఞాపకం. ఉన్నంతలో ఘనంగా జరుపుకోవాలని ప్రతి ఒక్కరు భావిస్తారు. బంధుమిత్రుల సమక్షంలో, పెద్దల ఆశీర్వచనాల నడుమ ఆనందగా పెళ్లి తంతు కొనసాగుతుంది. కానీ, కొన్ని పెళ్లిళ్లు రకరకాల కారణాలతో రసాభాసగా మారుతుంటాయి. పెళ్లిలో మటన్ పెట్టలేదని కొందరు, పెళ్లి కొడుకు వాళ్లకు సరిగా మర్యాద ఇవ్వడం లేదని మరికొందరు గొడవలకు తిగుతుంటారు. కొంత మంది కొట్లాడుకొని పోలీస్ స్టేషన్ లోకి వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే యూపీలో జరిగింది. ఏకంగా వధువు బంధువులు వరుడి వీపు పగలగొట్టారు. రూమ్ లో బంధించి మరీ కర్రలతో కొట్టారు. ఈ ఘటన ఆ రాష్ట్రంలో సంచలనం కలిగించింది.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చక్రతాకు చెందిన మహ్మద్ షబీర్ కు, ఉత్తర ప్రదేశ్ కు చెందిన యువతికి ఈ నెల 5న పెళ్లి అయ్యింది. వివాహం తర్వాత అమ్మాయి అప్పగింతల కార్యక్రమం కాసేపట్లో మొదలుకానుంది. ఇక వరుడి ఇంటికి బయల్దేరే సమయంలో అబ్బాయిని ఆట పట్టించాలని వధువు బంధువులు ప్రయత్నించారు. పెళ్లి కొడుకు చెప్పులను దాచిపెట్టారు. వాటిని తిరిగి ఇవ్వాలంటే రూ. 50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కానీ, పెళ్లి కొడుకు అందుకు ఒప్పుకోలేదు. రూ. 5 వేలు అయితే ఇస్తానని చెప్పాడు. ఎంతకీ అబ్బాయి తగ్గడం లేదు. వధువు బంధువులు కూడా రూ. 50 వేలు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. అయినా, షబీర్ రూ. 5 వేలు తీసి ఇవ్వబోయాడు. పెళ్లి కూతురు చెల్లి, బిచ్చగాడిలా ఇంత తక్కువ ఇస్తున్నావేంటి? అన్నది.
వధువు బంధువుల ఆగ్రహం
వధువు చెల్లి బిచ్చగాడు అనే మాట అనడంతో షబీర్ కుటుంబ సభ్యులతో పాటు బంధువులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. ఇంత చిన్న విషయానికే అంత మాట అనడం ఏంటని మండిపడ్డారు. అమ్మాయి చెల్లిని నోటికొచ్చినట్లు తిట్టారు. పైగా అమ్మాయి తల్లిదండ్రులు ఇచ్చిన బంగారంలో క్వాలిటీ లేదని విమర్శించారు. నెమ్మదిగా గొడవ ముదిరింది. ఇరువైపులా బంధువులు తిట్టుకోవడం మొదలు పెట్టారు. వధువు బంధువులు కోపంతో పెళ్లి కొడుకును ఓ గదిలోకి తీసుకెళ్లి బంధించారు. లోపలి నుంచి తాళం వేసి కర్రలు తీసుకుని దాడి చేశారు. వరుడి తరఫు బంధువులు తలుపులు బద్దలు కొట్టి అబ్బాయిని బయటకు తీసుకొచ్చారు.
साली की जूता चुराई का शिकार दुल्हा!#बिजनौर में आज देहरादून से दूल्हा साबिर दुल्हन को ब्याहने आया था. साली ने जूता चुराई का नेग ₹50 हजार मांगा. दूल्हे ने मोलतोल के बाद सिर्फ ₹5 हजार रुपए दिए
तभी किसी ने दूल्हे को "भिखारी" कह दिया. दूल्हे मियां नाराज हो गए. दुल्हन को साथ ले… pic.twitter.com/pNM83eXhGl
— Narendra Pratap (@hindipatrakar) April 6, 2025
Read Also: నిండుగా నీళ్లున్న కొబ్బరి బోండాం కావాలా? సింఫుల్ గా ఇలా సెలక్ట్ చేసుకోండి!
పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన ఇరు కుటుంబాలు
ఆ తర్వాత పెళ్లి కొడుకు బంధువులు వరుడిని తీసుకొని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. అబ్బాయి బంధువులపై కేసు పెట్టారు. అమ్మాయి తరఫు బంధువులు అబ్బాయి వాళ్ల మీద ఫిర్యాదు చేశారు. ఇక పోలీసులు ఇరు కుటుంబాల పెద్దలను కూర్చోబెట్టి మాట్లాడారు. అనవసరంగా గొడవలు వద్దని వారించారు. పెళ్లి అయిన వేళ అందరూ సంతోషంగా ఉండాలని నచ్చజెప్పారు. రాజీ కుదిర్చి అక్కడి నుంచి ఇంటికి పంపించారు.
Read Also: ‘బేబీస్ ఇన్ వైట్ హౌస్’.. నెట్టింట వైరల్ అవుతున్న ట్రంప్, మస్క్ యాంటీ సాంగ్!