BigTV English

Twitching Eyes: కళ్లు ఎందుకు అదురుతాయో తెలుసా..?

Twitching Eyes: కళ్లు ఎందుకు అదురుతాయో తెలుసా..?

Twitching Eyes: చాలా మందికి పదే పదే కళ్లు అదురుతాయి. ఎడమ కన్ను అదిరితే మంచి జరుగుతుందని.. కుడి కన్ను అదిరితే ఏదో చెడు జరిగిపోతుందని నమ్మే వాళ్లు ఇప్పటికీ ఉన్నారు. ఏదో జరిగిపోతుందనే నమ్మకాన్ని పక్కన పెడితే.. అసలు కళ్లు ఎందుకు అదురుతున్నాయి అనే దాని గురించి ఎప్పుడైనా ఆలోచించారా..? అసలు దేని వల్ల ఇలా జరుగుతోంది అనేది తెలుసుకోవడానికి ట్రై చేశారా..? దీని వల్ల నిజంగానే మంచి, చెడు వంటివి జరుగుతాయా అనేది తెలుసుకుందాం..


కళ్లు అదిరితే చెడు జరుగుతుందా..?
చెడు లేదా మంచి జరగడానికి కళ్లు అదరడమే కారణం అనేదాంట్లో నిజం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. శరీరంలో ఉండే కండరాల్లో జరిగే కొన్ని క్రియల వల్ల కళ్లు అదిరినట్లుగా అనిపిస్తుందని అంటున్నారు. చాలా మందికి ఇలా జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. దీని వల్ల ఏదో జరిగిపోతుందని భయపడాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఒకవేళ ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంటే మాత్రం డాక్టర్‌‌ను సంప్రదించడం ఉత్తమం.

కళ్ల చుట్టూ ఉంటే కండరాలు సడెన్‌గా కదిలినప్పుడు, లేదా కొట్టుకున్నప్పుడు ఇలా జరుగుతుందట. ఇలా కళ్లు కొట్టుకోవడం చాలా సహజమని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఇలాజరగడానికి కూడా చాలా రకాల కారణాలు ఉంటాయని అంటున్నారు. కొందరిలో అయితే జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల కళ్లు అదురుతాయట.


ALSO READ: ఒక్కోక్కరికీ ఒక్కో కలర్ కళ్లు ఎందుకు ఉంటాయి..?

నిద్రలేమి:
కళ్లు అదురుతున్నాయి అంటే దాని వెనక చాలా కరణాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొందరిలో నిద్రలేమి వల్ల కూడా ఇలా జరుగుతుందని అంటున్నారు. సరిగా నిద్రపోనప్పుడు కంటి చుట్టూ ఉండే కండరాలపై చెడు ప్రభావం పడుతుందట. దీని వల్ల కండరాలు అప్రయత్నంగానే కదులుతాయని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా కళ్లు అదిరినట్టుగా అనిపిస్తుందట.

స్క్రీన్ టైం:
కొన్ని సార్లు స్క్రీన్ టైం ఎక్కువగా ఉండడం వల్ల కూడా ఇలా జరిగే ఛాన్స్ ఉందట. ఫోన్, లాప్‌టాప్, కంప్యూటర్ ముందు అధిక సమయం గడిపే వారు చాలా మంది ఉంటారు. దీని వల్ల కళ్లపై ఎఫెక్ట్ పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరికొందరిలో డీహైడ్రేషన్ వల్ల కూడా ఇలా జరిగే ఛాన్స్ ఉందని డాక్టర్లు చెబుతున్నారు. అందుకే శరీరానికి కావాల్సినన్ని నీళ్లు తప్పకుండా తాగాలని సూచిస్తున్నారు.

కెఫీన్:
రోజు మొత్తంలో చాలా సార్లు కాఫీ, టీలు తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. వీటి ద్వారా ఎక్కువ మొత్తంలో కెఫీన్ శరీరంలోకి వెళ్తుంది. దీంతో కండరాలపై కూడా ప్రభావం పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే కెఫీన్ వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించడమే మంచిదని అంటున్నారు.

ఒత్తిడి:
ఎక్కువగా ఒత్తిడికి గురికావడం వల్ల కూడా కంటి చుట్టూ ఉండే కండరాలపై చెడు ప్రభావం పడుతుందట. దీంతో కండరాలు పదే పదే కదలడం జరుగుతంది. దీని నుంచి తప్పించుకోవడానికి ఎక్కువగా ఒత్తిడి చెందకూడదని డాక్టర్లు సూచిస్తున్నారు. వీలైనంత వరకు పని చేస్తున్నప్పుడు చిన్ని చిన్న బ్రేక్స్ అయినా తీసుకోవాలని సూచిస్తున్నారు. దీని వల్ల పని ఒత్తిడి నుంచి తప్పించుకోవడం మరింత ఈజీ అవుతుందట.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×