Iran Minab School: అమెరికాతో శాంతి చర్చల కోసం ఇరాన్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఘాలిబాఫ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం పాకిస్థాన్‌కు చేరుకుంది. ఈ బృందం ప్రయాణించిన విమానంలో.. రక్తంతో తడిసిన స్కూల్ బ్యాగులు, బూట్లు, మినాబ్ బాధితుల చిత్రాలను ఒక్కో సీటులో పెట్టారు. ఇస్లామాబాద్‌కు వెళ్తున్న విమానంలోని ముందు వరుసలో మినాబ్ స్కూల్ బాధితులకు ఈ విధంగా నివాళులు అర్పించారు. మినాబ్ 168 పేరు అని సోషల్ మీడియాలో ఈ పోస్టు పెట్టారు. ఈ ఫొటోలో ఘాలిబాఫ్ పిల్లల ఫొటోలను, వారి వస్తువులను చూస్తూ కనిపిస్తున్నారు.
ఇరాన్ యుద్ధానికి ముగింపు పలకాలని ఆశిస్తూ, అమెరికాతో శాంతి చర్చలు, సంప్రదింపుల కోసం ఆ దేశ ప్రతినిధులు శుక్రవారం రాత్రి ఇస్లామాబాద్‌కు చేరుకున్నారు. యుద్ధం మొదటి రోజున అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన మినాబ్ పాఠశాల విద్యార్థుల పేర్ల మీద ‘మినాబ్ 168’ అని పేరు పెట్టారు. దక్షిణాఫ్రికాలోని ఇరాన్ రాయబార కార్యాలయం ఆ ఫొటోలను రీట్వీట్ చేస్తూ.. ‘మేము మినాబ్ పిల్లలను ఎన్నటికీ మరచిపోము’ అని రాసుకొచ్చింది.
ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు చేసిన మొదటి రోజున 160 మందికి పైగా పిల్లలు మరణించినట్లు ఆరోపణలు ఉన్నాయి. యుద్ధం ప్రారంభమైన మొదటి రోజు ఫిబ్రవరి 28న, దక్షిణ ఇరాన్‌లోని మినాబ్ పట్టణంలో ఉన్న బాలికల పాఠశాలపై దాడి జరిగినట్లు తెలుస్తోంది. కొన్ని రోజులకు ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చీ.. ‘అమాయక’ బాలికలను పూడ్చిపెట్టడానికి సామూహిక సమాధులు తవ్వుతున్నట్లు చూపిస్తున్న ఓ ఫొటోను పోస్టు చేశారు. అదే పోస్ట్‌లో, అరాగ్చీ ట్రంప్‌పై విమర్శలు గుప్పిస్తూ, దీనిని క్రూరమైన హత్య అని అభివర్ణించారు.
ఈ దాడిని ఖండిస్తూ, అరాగ్చీ విమర్శలు చేశారు. బాలికల పాఠశాల ఇజ్రాయెల్, అమెరికా బాంబు దాడి చేసిందని ఆరోపించారు. ఈ దాడిలో డజన్ల కొద్దీ అమాయక పిల్లలు మరణించారన్నారు. ఇరాన్ ప్రజలపై జరిగిన దాడులకు అమెరికా, ఇజ్రాయెల్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మినాబ్‌లోని పాఠశాలపై తాము దాడి చేశామన్న వాదనను అమెరికా ఖండించింది. ఇరాన్ ఈ దాడిని చేసిందని ట్రంప్ ఆరోపించారు. వారి ఆయుధాలే పిల్లల ప్రాణాలు తీశాయని ట్రంప్ విలేకరులతో అన్నారు.
అమెరికా సైన్యం చేసిన పొరపాటు కారణంగా ప్రాథమిక పాఠశాలపై టోమాహాక్ క్షిపణి దాడి జరిగింది. ఈ యుద్ధంలో టోమాహాక్ క్షిపణులను ఉపయోగించిన ఏకైక దేశం అమెరికా మాత్రమే. అని అమెరికా మీడియా సైతం విమర్శలు చేశారు.
టెహ్రాన్ 10 సూత్రాల కాల్పుల విరమణ ప్రతిపాదనపై చర్చించేందుకు అమెరికా, ఇరాన్ ప్రతినిధి బృందాలు శనివారం ఇస్లామాబాద్‌లో సమావేశం అవుతున్నాయి. ఇరాన్ తరఫున, స్పీకర్ గాలిబాఫ్, అరాగ్చీ, మరో 12 మంది ఇస్లామాబాద్ చేరుకున్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ బృందం ఇస్లామాబాద్ చేరుకుంది. వాన్స్ నేతృత్వంలోని ఈ బృందంలో పశ్చిమాసియా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, అధ్యక్షుడు ట్రంప్ అల్లుడు జేర్డ్ కుష్నర్ ఉన్నారు. యూఎస్ ఎయిర్‌ఫోర్స్ సి-32ఏ విమానంలో వాన్స్ బృందం పాక్ చేరుకున్నారు.
Also Read: ఇరాన్ యుద్దానికి ట్రంప్ ఎండ్ కార్డు.. రెండు లేదా మూడు వారాలు మాత్రమే