E-Paper
Advertisement

మీ కంటే మా ఫామ్‌హౌజ్ పాల‌నే బెట‌ర్‌..!

మీ కంటే మా ఫామ్‌హౌజ్ పాల‌నే బెట‌ర్‌..!
Advertisement

జీవ‌న్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడి బీఆరెస్‌లో చేరాడో లేదో.. కాంగ్రెస్ జీవ‌న్‌రెడ్డిని, బీఆరెస్‌ను టార్గెట్ చేసింది. తాజాగా ఫామ్‌హౌజ్ రాజ‌కీయాన్నితెర‌పైకి తెచ్చింది కాంగ్రెస్‌. పీసీసీ చీఫ్ మ‌హేశ్‌కుమార్ గౌడ్.. జీవ‌న్‌రెడ్డిని బుజ్జ‌గించేందుకు, పార్టీని వీడొద్ద‌ని విజ్జ‌ప్తి చేసేందుకు నేరుగా ఆయ‌న ఇంటికే వెళ్లి మాట్లాడార‌ని కాంగ్రెస్ నాయ‌కులు ఓ వీడియోను విడుద‌ల చేసింది. కాంగ్రెస్ సీనియ‌ర్ల‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని కొంద‌రు చేస్తున్న ఆరోప‌ణ‌ల్లో నిజం లేద‌ని వాదిస్తూ.. ఆ వీడియోను సాక్షంగా చూపుతున్నారు.

అంద‌రికీ పార్టీ స‌ముచిత స్థానం క‌ల్పిస్తుంద‌ని, కొంత స‌మ‌యం, సంయ‌మ‌నం అవ‌స‌ర‌మ‌ని చెబుతూనే.. జీవ‌న్‌రెడ్డి మాత్రం కేసీఆర్‌ను క‌లిసేందుకు ఫామ్ హౌజ్‌కు వెళ్లాల్సిన రావడం బానిస‌త్వ‌మేనంటున్నారు. ఇంత‌టి మ‌ర్యాద‌, మ‌న్న‌న‌లు పొందిన కాంగ్రెస్‌ను వీడి.. కేసీఆర్‌తో క‌లిసేందుకు ఆయ‌న సేద తీరుతున్న ఫామ్‌హౌజ్‌కు వెళ్లాల్సి వ‌చ్చింద‌ని విమ‌ర్శిస్తున్నారు. మేము ఇంటికి వ‌చ్చి బ‌తిమాలినా విన‌ని జీవ‌న్‌రెడ్డి… ఫామ్‌హౌజ్‌కు వెళ్లి మ‌రీ కేసీఆర్‌ను క‌లిసి క‌న్నీరు కార్చ‌డ‌మెందుకు? అప్పుడే అంత‌లా దిగ‌జారిపోయాడా? పార్టీలో ఇంకా చేర‌క‌ముందే ఆ పార్టీ లైన్ బానిస‌త్వాన్ని అందిపుచ్చుకున్నాడా? అంటు సెటైర్లు వేస్తున్నారు.

Advertisement

అయితే, దీనికి బీఆరెస్ కూడా కౌంట‌ర్లు వేస్తుంది. మా బాస్ కేసీఆర్ అధికారంలో ఉన్న‌ప్పుడు కూడ అధికారంలో సేద తీరేవాడ‌ని, అయినా సంక్షేమ ప‌థకాల‌ను విజ‌య‌వంతంగా అమ‌లు చేసి ప్ర‌జ‌ల‌కు క‌ష్టం క‌ల‌గ‌కుండా చూశాడ‌ని గుర్తు చేస్తున్నారు. మీరు అధికారంలోకి వ‌చ్చి రెండేండ్లు దాటినా.. బీఆరెస్ పాల‌న‌లో అమ‌లైన ప‌థ‌కాల‌ను వంద‌కు వంద‌శాతం అమలు చేసి చూప‌లేక‌పోయార‌ని విమ‌ర్శిస్తున్నారు. మీ పాల‌న‌కంటే మా మా ఫామ్‌హౌజ్ పాల‌నే బెట‌రంటూ త‌మ‌కు తాము స‌ర్టిఫికెట్ ఇచ్చుకుంటున్నారు. కేసీఆర్ వైఖ‌రిని, ఆయ‌న ఫామ్‌హౌజ్ రాజ‌కీయాల‌ను స‌మ‌ర్థించుకుంటున్నారు. ఇలా ఎవ‌రికి వారే సోష‌ల్ మీడియా వేదిక మాట‌ల ఫైట్లు చేస్తున్నారు. విమ‌ర్శ‌ల అస్త్రాలు సంధించుకుంటున్నారు.

ఈ సంద‌ర్బంగా కేసీఆర్ చేసిన అప్పుల‌ను, ప్ర‌జ‌ల‌ను వంచించార‌నే కామెంట్ల‌ను చేస్తున్న‌ది. మా స‌ర్కార్ ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చే క్ర‌మంలో మెల్ల‌గా స‌క్సెస‌వుతున్న‌ద‌ని, దీని ఆల‌స్యానికి కూడా మీ ఫామ్‌హౌజ్ పాల‌నే అని తిరిగి స‌మాధాన‌మిస్తున్నారు. ఆరు గ్యారెంటీల‌ను అమ‌లు చేసి ప్ర‌జల మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టుకున్నామ‌ని, మొన్న‌టి స్థానిక సంస్థ‌ల‌, మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస పార్టీ సాధించిన ఘ‌న విజ‌య‌మే దీనికి నిద‌ర్శ‌మ‌ని చెబుతున్నారు. అప్పుడు ఫామ్‌హౌజ్ పాల‌న న‌చ్చ‌కే దానికి కేసీఆర్ ప‌ర‌మితిమ‌య్యేలా ప్ర‌జ‌లు తీర్పిచ్చార‌ని, ఇంకా మార‌ని కేసీఆర్‌, కేటీఆర్ వైఖ‌రితో విసిగెత్తి పోయార‌ని, అందుకే మొన్న‌టి ఎన్నిక‌ల్లో క‌ర్రు కాల్చి వాత పెట్టార‌ని విమ‌ర్శిస్తున్నారు. కాంగ్రెస్ సోష‌ల్ మీడియా వారియ‌ర్స్‌.

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×