E-Paper
Advertisement

Iran Earthquake: యుద్ధంలో మునిగిన ఇరాన్‌పై.. ప్రకృతి కన్నెర్ర.. మరోసారి భూకంపం

Iran Earthquake: యుద్ధంలో మునిగిన ఇరాన్‌పై.. ప్రకృతి కన్నెర్ర.. మరోసారి భూకంపం
Advertisement

Iran Earthquake: యుద్ధంలో మునిగి తేలుతున్న ఇరాన్ లో మరోమారు భూకంపం సంభవించింది. దక్షిణ ఇరాన్‌లోని బందర్ అబ్బాస్ సమీపంలో శనివారం భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేలుపై 4.1 తీవ్రతతో కదలికలు వచ్చినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది. అయితే ఈ భూకంపంలో పెద్ద ఎత్తున, ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లుగా ఎలాంటి నివేదికలు బయటకు రాలేదు.

హర్మోజ్ గాన్ ప్రావిన్స్ లోని బందర్ అబ్బాస్ కు పశ్చిమాన 75 కి.మీ దూరంలో 10 కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అరేబియా, యురేషియన్ ప్లేట్‌ల కదిలికల వల్ల ఈ ప్రాంతంలో భూకంపాలు సర్వసాధారణంగా మారిపోయాయని USGS స్పష్టం చేసింది. భూమిలో లోపల నిత్యం కదిలికలు జరుగుతుంటాయని.. అయితే తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలోనే అవి భూకంపం రూపంలో బయటకు తెలుస్తాయని USGS నిపుణులు పేర్కొన్నారు.

Advertisement

అయితే చమురు సరఫరాకు కీలకంగా ఉన్న హర్మూజ్ జలసంధికి ముఖ్యమైన ఓడరేవుగా బందర్ అబ్బాస్ ఉండటం గమనార్హం. కాగా ఈ భూకంప ప్రభావం.. ఓడరేవులోని షిప్పింగ్ కార్యక్రమాలపై పడలేదని ఇరాన్ స్థానిక మీడియా పేర్కొంది. మరోవైపు స్థానికులు సైతం చాలా స్వల్పంగా ఈ భూ ప్రకంపనలను ఫేస్ చేసినట్లు నివేదించింది. గిన్నెలు కిందపడటం, ఇంట్లోని ఫ్యాన్లు, భవనాలు ఊగడం మాత్రమే జరిగిందని పేర్కొంది.

Advertisement

మరోవైపు మంగళవారం కూడా ఇదే తరహాలో ఇరాన్ లో భూకంపం సంభవించింది. ఫార్స్ ప్రావిన్స్ లోని గెరాష్ ప్రాంతంలో భూకంపం నమోదైంది. రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రత చూపించినట్లు అధికారులు పేర్కొన్నారు. భూకంపం కేంద్రం భూమికి 10 కి.మీ లోతులో ఉన్నట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం అమెరికా – ఇజ్రాయెల్ పై ఇరాన్ పోరాడుతున్న క్రమంలో.. ఇలా వరుస భూకంపాలు ఆ దేశాన్ని ఇబ్బందులకు గురిచేస్తోంది.

Also Read: Iran-Israel War Report: ఎనిమిదో రోజుకు యుద్ధం.. వారంలో మాటల్లో చెప్పలేనంత విధ్వంసం!

ఇప్పటికే ఇజ్రాయెల్ జరుపుతున్న వరుస దాడులతో ఇరాన్ ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని జీవిస్తున్నారు. ఇప్పుడు భూకంపాలు సైతం వారిని తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ఇరాన్ కు చెందిన ఫౌండేషన్ ఆఫ్ ఆర్టిర్స్ అండ్ వెటరన్స్ అఫైర్స్ ప్రకారం.. ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 1,230 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడుల్లో ఇరాన్ లోని ఆస్పత్రులు, ఫార్మసీలు, పాఠశాలలు, పోలీసు స్టేషన్లు, జిమ్ లు, క్షిపణి లాంచర్లు, టెహ్రాన్ లోని ప్రభుత్వ భవనాలు దెబ్బతిన్నాయని ఇరాన్ మీడియా పేర్కొంది. దేశంలోని 174 నగరాలను ఈ దాడులు తాకాయని స్పష్టం చేసింది.

Also Read: Iran Airport Blast: ఇజ్రాయెల్ దాడి.. ఇరాన్ విమానాశ్రయంలో భారీ పేలుళ్లు.. వీడియోలు వైరల్

Related News

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

నేపాల్ ఖాకీలకు విచిత్ర సవాల్.. వరదల్లో కొట్టుకెళ్లిన మనుషులతో పాటు.. బ్యాంక్ లాకర్ల కోసం వేట!

బాంబులు, డ్రోన్ల మోత మధ్య జరిగిన పెళ్లి.. యుద్ధ సమయంలో పెరుగుతున్న వివాహాల సంఖ్య

Big Stories

Advertisement
×