E-Paper
Advertisement

క్లైమాక్స్‌లో ఇరాన్ యుద్ధం.. ట్రంప్ మాటలు ఒకలా, మొజ్తాబా ఖమేని మాటలు మరొకలా

క్లైమాక్స్‌లో ఇరాన్ యుద్ధం.. ట్రంప్ మాటలు ఒకలా, మొజ్తాబా ఖమేని మాటలు మరొకలా
Advertisement

Mojtaba Khamenei: పశ్చిమాసియాలో యుద్ధంలో ఏం జరుగుతోంది? ఇరాన్ వెనుకడుగు వేసిందా? ట్రంప్ అన్నమాటలు నిజమయ్యాయా? ఎందుకు మొజ్తాబా పిలుపు వెనుక అసలేం జరిగింది? ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ డే సందర్భంగా ప్రజలకు ఆయన సందేశం ఏంటి? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.

క్లైమాక్స్‌లో ఇరాన్ యుద్ధం

ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ డే సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి సుప్రీం మొజ్తాబా ఖమేనీ సందేశం విడుదల చేసింది ఇరాన్ ప్రభుత్వం. అమెరికా- ఇజ్రాయెల్‌ తమపై చేస్తున్న దాడులపై ఆయన మండపడ్డారు. దాడుల నేపథ్యంలో డ్యామేజ్ అయిన మౌలిక సదుపాయాలను తిరిగి పునరుద్ధరించడానికి అందరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు.

Advertisement

తమ దేశంపై జరుగుతున్న దురాక్రమణ దాడులను ఖండించారు. మౌలిక సదుపాయాలతో పాటు పర్యావరణం దెబ్బతిందన్నారు. దేశ అంతర్గత అభివృద్ధిపై దృష్టి సారించాలని అందులో ప్రస్తావించారు. ఇరాన్‌ ఉజ్వల భవిష్యత్తుకు ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఆసన్నమైందన్నారు. ఇరాన్‌లోని మినాబ్‌ పాఠశాలపై జరిగిన దాడిని ఈ సందర్భంగా ప్రస్తావించారు.

ఇరాన్ పునర్నిర్మాణానికి కలిసి రావాలని ఇరాన్ సుప్రీం మొజ్తాబా ఖమేని పిలుపు

ఈ ఘటనలో దాదాపు 186 మంది ప్రాణాలు కోల్పోయారని, వారికి నివాళిగా మొక్కలు నాటే కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ఆదేశం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నిర్వహిస్తోంది. కొనసాగుతున్న ప్రాంతీయ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ఇరాన్ జాతి అద్బుతమైన సంకల్పంతో ముడిపడి ఉందన్నారు.

Advertisement

దీనికి ముందు రోజు ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ అమెరికా ప్రజలను ఉద్దేశిస్తూ బహిరంగ లేఖ రాశారు.అమెరికన్లపై తమకు ఎలాంటి శత్రుత్వం లేదన్నారు. ఒత్తిళ్లు,ఆంక్షలు ఎదురైనప్పటికీ తాము ఎన్నడూ యుద్ధానికి దిగిన సందర్భం లేదన్నారు. తమపై చేస్తోన్న దాడులను తిప్పికొడతామన్నారు.

ALSO READ: చందమామ చెంతకు మళ్ళీ మనిషి.. నింగిలోకి దూసుకెళ్లిన నాసా ‘ఆర్టెమిస్-II’ మిషన్!

అమెరికా ఫస్ట్‌ అనేది ప్రస్తుత పరిపాలనలో ఉందా అని ప్రశ్నించిన విషయం తెల్సిందే. ఈ లేక సారాంశాన్ని దేశ ప్రజలను ఉద్దేశించిన ప్రసంగంలో ట్రంప్ గుర్తు చేశారు. అందుకే ఇరాన్ యుద్ధంలో తాము గెలిచామని ముందుగానే ఆయన ప్రకటించారు.

ఒప్పందం కుదుర్చుకోవడానికి ఇరాన్ నాయకత్వం సిద్ధంగా ఉందని ట్రంప్ చెబుతున్నా, ఇరాన్ నాయకత్వం విరుద్ధంగా సంకేతాలు ఇస్తున్నారని మాజీ సీఐఏ విశ్లేషకుడు లారీ జాన్సన్ చెబుతున్నారు. అమెరికా-దాని మిత్రదేశాలను ప్రతిఘటిస్తూనే ఉంటామని శపథం చేస్తున్నారని అన్నారు. మొత్తానికి ఇరాన్ యుద్ధం దాదాపు ముగింపు దశకు వచ్చిందని అంటున్నారు.

Related News

షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. ఆకట్టుకున్న ప్రత్యేక ప్రదర్శనలు!

ట్రంప్ మామ గిమ్మిక్కులు.. గెలుపు కోసం చమక్కులు, ఈ తీట పనులు అందుకేనా?

19 ఏళ్లు చనిపోయినట్లు నమ్మించిన కేటుగాడు.. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎంట్రీతో అడ్డం తిరిగిన కథ!

భారత్‌కు బిగ్ రిలీఫ్.. 100% టారిఫ్‌ల చట్టాన్ని నిలిపివేసిన డొనాల్డ్ ట్రంప్!

రష్యా సైన్యంలో ఉక్రెయిన్‌ ఏజెంట్.. 300 మంది సైనికుల్ని లేపేసి.. దేశం దాటేసిన యువ అధికారి!

రష్యాను కుదిపేసిన భారీ భూకంపం.. రిక్టర్ స్కేలు 7.0 గా నమోదు, నష్టంపై ఇంకా..

బలవంతంగా డ్రగ్స్‌ ఎక్కించి.. ఎఫ్ఐటీ విద్యార్థినిపై అత్యాచారం, అమెరికాలో షాకింగ్ ఘటన

పాఠశాలలో ఓ టీనేజర్ దారుణం.. గన్‌తో కాల్పుల మోత, టీచర్ సహా నలుగురు మృతి, అమెరికాలో ఘటన

Big Stories

Advertisement
×