E-Paper
Advertisement

Iran Target: ఇరాన్ కొత్త టార్గెట్.. టెక్ కంపెనీలు, బ్యాంకింగ్ సంస్థలు తదుపరి లక్ష్యం

Iran Target: ఇరాన్ కొత్త టార్గెట్.. టెక్ కంపెనీలు, బ్యాంకింగ్ సంస్థలు తదుపరి లక్ష్యం
Advertisement

Iran Target: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం కొత్త మలుపు తిరిగింది. తాము ఆ దేశాన్ని పూర్తిగా నాశనం చేశామని, ఎప్పుడంటే అప్పుడు యుద్ధం ఆపగలమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇరాన్‌లో ఆగ్రహాన్ని రెట్టింపు చేసింది. ఫలితంగా గల్ఫ్‌లో ఉండే టెక్ కంపెనీలపై ఫోకస్ చేసింది ఇరాన్. ఈ విషయం బయటకు రాగానే పలు కంపెనీలు మూసి వేసినట్టు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఇరాన్ కొత్త టార్గెట్.. టెక్ కంపెనీలు, బ్యాంకింగ్ సంస్థలు 

Advertisement

ఇరాన్ దూకుడు పెంచింది. అమెరికా-ఇజ్రాయెల్ లపై తొలి విడత కాస్త కూల్‌గా వ్యవహరించిన ఇరాన్, కొత్త అస్త్రాలకు పదును పెడుతోంది. ఈ నేపథ్యంలో హర్మూజ్ జలసంధిని తన కంట్రోల్‌లోకి తీసుకుంది. ఆయిల్ షిప్ ఏ ఒక్కటి ముందుకు అడుగు వేసినా పేల్చేస్తామని హెచ్చరికలు జారీ చేసింది. దీంతో వందలాది నౌకలు అక్కడే ఆగిపోయాయి.

బుధవారం సాయంత్రం ఆయిల్ షిప్ ఓ అడుగు ముందుకు వేయడంతో దాన్ని పేల్చేశారు ఇరాన్ సైనికులు. దీంతో తదుపరి ఇరాన్ కొత్త లక్ష్యాలను ఎంపిక చేసుకున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇరాన్ దాడులకు భయపడ గల్ఫ్ దేశాలు తమతమ దేశాల్లో ఆయిల్ ఉత్పత్తిని నిలిపి వేశాయి. ఇటు నౌకలు సైతం ఆగిపోయాయి.

Advertisement

భవనాలను ఖాళీ చేసే పనిలో టెక్ దిగ్గజాలు

తాజాగా గల్ప్ లోని అమెరికా-ఇజ్రాయెల్‌లకు సంబంధమున్న టెక్ కంపెనీలు,  బ్యాంకులపై ఇరాన్ ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. ఆయా కంపెనీల మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయాలని ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్‌ కోర్పు ఓ నిర్ణయం తీసుకుంది. సైనిక చర్యల కోసం ఆయా సంస్థల టెక్నాలజీని ఆ రెండు దేశాలు ఉపయోగించడంతో వాటిని లక్ష్యంగా చేసుకున్నట్లు అనుబంధ వార్తా సంస్థ వెల్లడించింది.

అందులో గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, ఐబీఎం, ఎన్‌విడియా, ఒరాకిల్‌, పాలంటిర్‌ వంటి టెక్‌ సంస్థలు ఉన్నాయని పేర్కొంది. ఇజ్రాయెల్‌‌కు గల్ఫ్‌ దేశాల్లో పలు టెక్ కంపెనీలు క్లౌడ్‌ ఆధారిత సేవలు అందిస్తున్నాయి. వాటి కార్యాలయాలు ఈ జాబితాలో ఉన్నట్లు ప్రస్తావించింది. ఆ తర్వాత బ్యాంకులు, ఆర్థిక సంస్థలను లక్ష్యంగా చేసుకుంటామని తేల్చి చెప్పింది. ఇప్పటికే గల్ఫ్‌లోని వివిధ దేశాల్లో డేటా సెంటర్లపై దాడి చేసింది ఇరాన్.

ALSO READ: బాంబు షెల్టర్లలో ఉండేవారి కోసం.. ఇజ్రాయెల్ డేటింగ్ యాప్.. ఈ టైమ్‌లో రొమాన్స్ ఏంటో!

యూఏఈ, బహ్రెయిన్‌ల్లో అమెజాన్ వెబ్ సర్వీసెస్‌లను దెబ్బతీసింది. ఆయా ప్రాంతాల్లో బ్యాంకింగ్ చెల్లింపులు, వినియోగదారు సేవలకు అంతరాయం కలిగించింది కూడా. బుధవారం టెహ్రాన్ బ్యాంకు శాఖపై ఇజ్రాయెల్ దాడి నేపథ్యంలో ఆర్థిక సంస్థలను ఆయా దేశాలు టార్గెట్ చేసుకున్నట్లు భావించింది ఇరాన్.  అదే రీతిలో బదులు ఇవ్వాలని ఇరాన్ భావిస్తున్నట్లు సమాచారం.

Related News

షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. ఆకట్టుకున్న ప్రత్యేక ప్రదర్శనలు!

ట్రంప్ మామ గిమ్మిక్కులు.. గెలుపు కోసం చమక్కులు, ఈ తీట పనులు అందుకేనా?

19 ఏళ్లు చనిపోయినట్లు నమ్మించిన కేటుగాడు.. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎంట్రీతో అడ్డం తిరిగిన కథ!

భారత్‌కు బిగ్ రిలీఫ్.. 100% టారిఫ్‌ల చట్టాన్ని నిలిపివేసిన డొనాల్డ్ ట్రంప్!

రష్యా సైన్యంలో ఉక్రెయిన్‌ ఏజెంట్.. 300 మంది సైనికుల్ని లేపేసి.. దేశం దాటేసిన యువ అధికారి!

రష్యాను కుదిపేసిన భారీ భూకంపం.. రిక్టర్ స్కేలు 7.0 గా నమోదు, నష్టంపై ఇంకా..

బలవంతంగా డ్రగ్స్‌ ఎక్కించి.. ఎఫ్ఐటీ విద్యార్థినిపై అత్యాచారం, అమెరికాలో షాకింగ్ ఘటన

పాఠశాలలో ఓ టీనేజర్ దారుణం.. గన్‌తో కాల్పుల మోత, టీచర్ సహా నలుగురు మృతి, అమెరికాలో ఘటన

Big Stories

Advertisement
×