E-Paper
Advertisement

Belt Shops: గద్వాల జిల్లాలో జోరుగా బెల్ట్ షాపుల దందా.. పట్టించుకోని ఎక్సైంజ్ అధికారులు

Belt Shops: గద్వాల జిల్లాలో జోరుగా బెల్ట్ షాపుల దందా.. పట్టించుకోని ఎక్సైంజ్ అధికారులు
Advertisement

Belt Shops: స్వేచ్ఛ బ్యూరో: జిల్లాలో బెల్ట్ షాపుల దందా జోరుగా సాగుతోంది. పల్లెలు, పట్టణాలనే తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ అనధికారికంగా అనుమతి లేని దుకాణాలు నిర్వహిస్తున్నారు. ధరలు పెంచి బహిరంగంగా విక్రయాలు చేపడుతున్నారు. అయినా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంపై సర్వత్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. బెల్ట్ షాపులు నిర్వహిస్తే చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరిస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం భిన్న పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామాల్లో యథేచ్చగా ఎక్కడపడితే అక్కడ బెల్ట్ షాపులు వెలుస్తుండగా కిరాణా దుకాణాల్లోనూ మద్యం విక్రయాలు జరుగుతున్నాయి.అధికారులు చూసి చూడనట్టు వ్యవహరించడం తదితర కారణాలతో జోగులాంబ గద్వాల జిల్లాలో బెల్ట్ వ్యాపారం మూడు పూలు ఆరు కాయలు అన్న చందంగా సాగుతోంది.

జిల్లాలో ఇలా

జోగులాంబ గద్వాల జిల్లాలో 34 అధికారిక మద్యం దుకాణాలు కొనసాగుతున్నాయి.వీటి కన్నా అనధికార బెల్ట్ షాపులే అధికంగా కొనసాగుతున్నాయి. దీంతో మారుమూల గ్రామాలు మత్తులో జోగుతున్నాయి.గ్రామాలు, తండాలలలో పుట్టగొడుగుల్లా బెల్టు దుకాణాలు వెలుస్తున్నాయి నిబంధనలకు విరుద్ధంగా షాపులు ఏర్పాటు చేసి అధిక ధరలకు విక్రయిస్తూ వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు .అనేకమంది బెడ్ షాపుల్లో మద్యం కొనుగోలు చేసేందుకు అప్పులు చేసి తాగడంతో కాపురాలు వీధిపాలవుతున్నాయి. దీంతో కుటుంబంలో ఆర్థిక సమస్యలతో పాటు మనస్పర్ధలు నెలకొంటున్నాయి. ఫలితంగా చిన్న పిల్లలపై వీటి ప్రభావం అధికంగా చూపే అవకాశం ఉంది. దీంతో వారి భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం పడటంతో పాటు వారిలో క్రమశిక్షణ లోపించి చెడు వ్యాపకాలకు అలవాటు పడే పరిస్థితులు దాపరిస్తున్నాయి.

పట్టించుకోని అధికారులు

Advertisement

బెల్ట్ షాపుల ద్వారా ప్రభుత్వానికి ఆర్థిక వనరులు సమకూరుతున్నాయి. మరింత ఆదాయం పెంచుకోవాలని ఉద్దేశంతో సంబంధిత అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయంలో మహిళల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్న ఎవరు పట్టించుకోవడం లేదు. అటు ఎక్సైజ్ శాఖ అధికారులు గానీ ఇటు పోలీసులు గాని బెల్టు తీయకపోవడంతో విమర్శలు వెల్లుబుక్కుతున్నాయి.

Also Read: Jobs in AIIMS: ఎయిమ్స్‌లో 2551 ఉద్యోగాలు.. మంచి వేతనం, దరఖాస్తుకు ఇంకా 5 రోజులే..!

అధికారులు కనుసన్నల్లోనే

Advertisement

జిల్లాలు మద్యం అమ్మకాలు కోట్ల రూపాయల్లో జరుగుతున్నాయి. అధికారిక వైన్ షాపులు, బార్లు నడుస్తున్న వాటి ద్వారా ప్రతినెల కోట్ల రూపాయల్లో మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. వైన్స్ యజమానులు, ఎక్సైజ్ అధికారుల అండదండలతో జిల్లాల్లో జోరుగా బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. వ్యాపారులు సిండికేట్ గా మారడంతో ఎక్కువ ధరలకు బెల్ట్ షాపులు పెట్టి అన ధికారికంగా మద్యం అమ్మకాలు చేస్తున్నట్లు ప్రజల ఆరోపిస్తున్నారు

నెలవారి మామూలు

నిబంధనల ప్రకారం మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీ ధరలకు విక్రయిస్తున్నారు.కానీ గొలుసు దుకాణాలలో మరో క్వార్టర్ పై 20 రూపాయలు అదనంగా పెంచి అమ్ముతున్నారు. ఆయా మద్యం దుకాణాలకు సంబంధించిన పరిధిని నిర్ణయించి బెల్టు షాపులకు మద్యం విక్రయిస్తున్నడంతో పాటు ముందస్తు సమాచారంతో ఎక్సైజ్ శాఖ అధికారులు బెల్ట్ షాపుల వైపు కన్నెత్తి చూడడం లేదనే విమర్శలు ఉన్నాయి.

Also Read: Sanju Samson: సూర్య‌కు బిగ్ షాక్‌..టీమిండియా కొత్త కెప్టెన్ గా సంజు !

Related News

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

కుషాయిగూడ పీహెచ్‌సీలో ఊహించని పరిణామం.. డాక్టర్‌గా మారిన డీఎంహెచ్‌ఓ!

Big Stories

Advertisement
×