E-Paper
Advertisement

Iran Vs America War: యుద్ధం తీవ్రతరం.. ట్రంప్ సూచనలకు ఇరాన్ నో, ఇక తాడోపేడో తేల్చుకునేందుకు

Iran Vs America War: యుద్ధం తీవ్రతరం.. ట్రంప్ సూచనలకు ఇరాన్ నో, ఇక తాడోపేడో తేల్చుకునేందుకు
Advertisement

Iran Vs America War: పశ్చిమాసియాలో పరిస్థితులు ఇంకా ఉద్రిక్తంగా ఉన్నాయా? ఇరాన్‌-అమెరికా మధ్య చర్చలు ఎంత వరకు వచ్చాయి? ట్రంప్ ప్రతిపాదనను ఇరాన్ ఎందుకు నో చెప్పింది? ఇరాన్ ప్రతిపాదన ఏంటి? అందుకు అమెరికా అంగీకరిస్తుందా? ఈ నేపథ్యంలో యుద్ధం తీవ్రమయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సూచనలకు ఇరాన్ నో

Advertisement

పశ్చిమాసియాలో పరిస్థితులు రోజు రోజుకూ జఠిలమవుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు మొదలుపెట్టి దాదాపు నాలుగు వారాలు అవుతోంది. ఇరాన్-అమెరికా మధ్య చర్చలు ఏ మాత్రం కొలిక్కిరావడం లేదు. దీంతో యుద్ధం కొనసాగే అవకాశాలు మొండుగా కనిపిస్తున్నాయి. యుద్ధాన్ని నిలిపివేసేందుకు ఇరాన్‌తో చర్చలకు ముందుకొచ్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.

ప్రధానంగా 15 పాయింట్ల ప్రణాళికను ఇరాన్ ముందు పెట్టారు. వాటిలో అణ్వస్త్ర తయారీ ప్లాన్‌ని ఇరాన్ ఉపసంహరణ, ఇంధన రవాణాకు కీలకమైన హర్మూజ్‌ జలసంధిని తెరిచి ఉంచడం లాంటి అంశాలు ఉన్నాయి. ఇప్పటికి శుద్ధిచేసిన సుమారు 450 కిలోల యురేనియం అంటే దాదాపు 60 శాతం అంతర్జాతీయ అణుశక్తి సంస్థ-ఐఏఈఏకు అప్పగించాలని కోరింది.

Advertisement

ఇరాన్ కొత్త డిమాండ్లు ఇవీ.. లేకుంటే యుద్ధం తీవ్రమయ్యే అవకాశం

నతాంజ్, ఇస్ఫహాన్, ఫోర్డో ప్రాంతాల్లోని అణు కేంద్రాలను తొలగించాలని కోరింది. అంతేకాదు తనిఖీల కోసం ఐఏఈఏకు పూర్తి స్థాయి ప్రవేశం డిమాండ్ చేసింది. ఇరాన్ మద్దతుదారులైన హెజ్‌బొల్లా, హమాస్, ఇరాకీ మిలిషియాలకు నిధులు, ఆయుధాల సరఫరాను నిలిపి వేయాలని కోరింది. బాలిస్టిక్‌ క్షిపణుల సంఖ్య, వాటి పరిధిపై పరిమితులు విధించాలి.

భవిష్యత్తులో క్షిపణులను స్వీయరక్షణ కోసం మాత్రమే వినియోగించాలి. పై ప్రతిపాదనలకు అంగీకరిస్తే ఇరాన్‌పై అంతర్జాతీయ ఆంక్షలను పూర్తిగా ఎత్తి వేస్తామని అమెరికా చెప్పింది. అంతేకాదు విద్యుదుత్పత్తి వంటి పౌర అణు కార్యక్రమాల్లో టెహ్రాన్‌కు అమెరికా అండగా నిలుస్తుందని పేర్కొంది. ట్రంప్ ప్రకటించిన 15 అంశాలను ఇరాన్‌ తిరస్కరించింది. ఇరాన్ తన ప్రభుత్వ టెలివిజన్‌లో తన సొంత ప్రతిపాదనను అజెండాను వెల్లడించింది.

ALSO READ: హర్మూజ్ వద్ద పాకిస్తాన్ నౌకను ఆపేసిన ఇరాన్.. ఇక దాయాదికి చుక్కలే!

అధికారులను లక్ష్యంగా దాడులను ఆపాలని కోరింది. భవిష్యత్ దాడులు జరగకుండా హామీలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. యుద్ధం నష్టానికి సంబంధించి పరిహారం, గల్ఫ్ దేశాల్లో అమెరికా సైన్యం ఉపసంహరణ, హోర్ముజ్ జలసంధిపై తమ సార్వభౌమాధికారాన్ని గుర్తించాలని డిమాండ్ చేసింది.

బాలిస్టిక్‌ క్షిపణులపై పరిమితి విధించడం వంటి పలు అంశాలు తమకు ఎప్పటికీ ఆమోదం కాదని తేల్చి చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. దాడులకు మళ్లీ దిగమని స్పష్టమైన హామీ, ఇరాన్‌పై అన్ని ఆంక్షలను ఎత్తివేయాలని కోరింది. తమ డిమాండ్లను అంగీకరిస్తే యుద్ధానికి ఫుల్ స్టాప్ పెడతామని అగ్రరాజ్యానికి ఊహించని షాక్ ఇచ్చింది ఇరాన్.

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×