E-Paper
Advertisement

Kavitha Party: శ్రీరామ నవమి రోజే ఆ బిగ్ అనౌన్స్‌మెంట్.. నిజామాబాద్‌లో కవిత మాస్టర్ ప్లాన్!

Kavitha Party: శ్రీరామ నవమి రోజే ఆ బిగ్ అనౌన్స్‌మెంట్.. నిజామాబాద్‌లో కవిత మాస్టర్ ప్లాన్!
Advertisement

Kavitha Party: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. కొత్త పార్టీ ఏర్పాటు విషయంలో కవిత చాలా వేగంగా అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. కవిత తనకు రాజకీయంగా పేరు తెచ్చిన జిల్లా అయినా నిజామాబాద్ వేదికగా కొత్త పార్టీ స్థాపనకు మొదటి అడుగు పడనుందట. వచ్చే శ్రీరామ నవమిన రోజు నిజామాబాద్ జిల్లా నుంచి పార్టీ పేరు అనౌన్స్ చేయబోయే తేదీని ప్రకటించనున్నారంట. ఆమె ఏర్పాటు చేయనున్న పార్టీకి సంబంధించి తాజాగా ఇది కీలక అప్‌డేట్ అని చెప్పుకోవచ్చు. కల్వకుంట్ల కవిత స్థాపించనున్న కొత్త రాజకీయ పార్టీ పేరు ఖరారైంది. ‘తెలంగాణ ప్రజా జాగృతి’ పేరుతో పొలిటికల్ పార్టీని ఆమె ఏర్పాటు చేయనున్నారు. పార్టీ అనౌన్స్ మెంట్ డేట్ దగ్గర పడుతుండటంతో తెలంగాణ జాగృతి భారీ ఏర్పాట్లు చేస్తునట్లు తెలుస్తోంది.

నిజామాబాద్‌లో కవిత కీలక నిర్ణయం

తెలంగాణ జాగృతి స్థాపించిన తర్వాత తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అలవర్చుకొని ఒక బలమైన నేతగా నిజామాబాద్‌ జిల్లాలో నిలదొక్కుకున్నారు కల్వకుంట్ల కవిత. ఎంపీగా, ఎమ్మెల్సీ గా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచే ఎన్నికయ్యారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ.. అని దాశరథి జైలు గోడలపై రాసిన స్థలం శ్రీ రఘునాథ ఆలయం. జిల్లాలోని ఆ రామమందిర్ లో ఈ నెల 27 న సీతారాముల కళ్యాణంలో కవిత ఆమె భర్త అనిల్ ఇద్దరు పాల్గొంటున్నారు. సీతారాముల కళ్యాణం అనంతరం పండితుల ఆశీర్వాదంతో అక్కడే కవిత పెట్టబోయే కొత్త పార్టీ ప్రకటన చేయనున్నారట.

ఇందూరు గడ్డపై కవితమ్మ రాజకీయం 2.0

Advertisement

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కవిత అనుచర వర్గం, జాగృతి నాయకులు కార్యకర్తలు ఆమె స్థాపించబోయే పార్టీ కోసం పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్నారు. తండ్రి స్థాపించిన బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి, ఎమ్మెల్సీ పదవికి సైతం రాజీనామా చేసిన కవిత గత డిసెంబరులోనే కొత్త పార్టీ స్థాపించబోతున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది జనవరి 23న ఈ పార్టీ పేరిట రిజిస్ట్రేషన్ కోసం కవిత కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేశారు. ఆదిశగా పార్టీ కి సంబంధించిన పనులు ముందుకు సాగుతున్నాయి. తెలంగాణ ప్రజా జాగృతి పేరుతో పార్టీని, పార్టీ గుర్తుగా ధర్మగంటను నిర్ణయించి కవిత ఈసీ రిజిస్ట్రేషన్ కోసం ధరఖాస్తు చేసుకున్నారు.

శ్రీరామ నవమి సాక్షిగా ముహూర్తం ఫిక్స్

ఆ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొలిక్కి వస్తుండటంతో శ్రీరామ నవమి రోజు పార్టీ ఎప్పుడు ప్రకటించేది డేట్ అనౌన్స్ చేయనున్నారు. ఎక్కడి నుంచి పార్టీ అనౌన్స్ మెంట్ డేట్ కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ జాగృతి నేతలు దానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె సొంత జిల్లా అయిన నిజామాబాద్‌లో బీఆర్ఎస్ నుంచి పెద్దఎత్తున నేతలు, కార్యకర్తలు కొత్త పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పలువురు మాజీ ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు సర్పంచులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు .. ఆమె వల్ల రాజకీయంగా లబ్ధి పొందిన వారు పార్టీ అనౌన్స్ మెంట్ ఎప్పుడా అని వెయిట్ చేస్తున్నారంట

ఆ ‘నాలుగు దయ్యాల’ గుండెల్లో వణుకు

Advertisement

కవిత నిజామాబాద్ జిల్లాపై స్పెషల్ ఫోకస్ పెట్టడానికి చాలా కారణాలు ఉన్నాయంటున్నారు నిజామాబాద్ ఎంపీగా కవిత రెండో సారి పోటీ చేసినప్పుడు ఓటమి పాలయ్యారు. ఆ పరాజయానికి సొంత పార్టీ వారే కారణమని ఆమె పలుమార్లు ప్రస్తావించారు. తనను పార్టీ నుంచి దూరం చేసేందుకు ఆ నాలుగు దయ్యాలకు జిల్లా నేతల సహకరించారని చాలా సార్లు కవిత ఆరోపించారు. ఆ క్రమంలో పార్టీ అనౌన్స్ మెంట్ తరువాత ఫస్ట్ జిల్లాలో కవితకు వ్యతిరేకంగా పనిచేసిన వారే టార్గెట్ అవుతారన్న టాక్ వినిపిస్తోంది. మొత్తానికి కవిత మాత్రం సీతారాముల కళ్యాణం రోజు పార్టీ అనౌన్స్ చేసే డేటు ప్రకటించనుండటంతో ఆమె పార్టీలో చేరడానికి ఉత్సహాంగా ఉన్న జిల్లా నేతల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోందంటున్నారు.

Also Read: వైఎస్ కుటుంబం ముక్కలవుతోందా? వైసీపీ నేతల తీరుపై షర్మిల తీవ్ర ఆగ్రహం!

Story by: Apparao, Big Tv

Related News

ఫోక్స్‌వ్యాగన్‌లో భారీ లేఆఫ్స్.. లక్ష మంది ఉద్యోగులకు షాక్!

సురేఖకు సవాళ్ల మీద సవాళ్లు.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా?

సెప్టెంబర్ 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమరం.. మాటల తూటాలకు రెడీ!

కులాన్ని మార్చేసి మరీ ఏపీ DSC లో ఉద్యోగాలు.. బిగ్ టీవీ ఆపరేషన్‌లో బయటపడ్డ సంచలనాలు

సొంత పార్టీపై సెటైర్లు వేస్తే సీన్ రివర్స్.. కాంగ్రెస్‌లో కొత్త రూల్!

ముఖం బాగ‌లేక అద్దం ప‌గ‌ల గొట్టిన‌ట్టు…! అద్దంలా ఉన్న‌దున్న‌ట్టు చూపితే అంత ఉలుకెందుకు? బిగ్ టీవీ ఇన్‌స్టాగ్రామ్‌ను నిషేధిస్తే నిజాలు ఆగుతాయా?

ఏపీలో DSC స్కాం ఎఫెక్ట్.. బిగ్ టీవీ సోషల్ మీడియా అకౌంట్ బ్లాక్!

అసెంబ్లీని బ‌హిష్క‌రించిన మాజీ సీఎంలు.. ప్ర‌తిన‌ బూని మ‌ళ్లీ సీఎంగానే అడుగుపెట్టి.. ! జ‌య‌లలిత ఎపిసోడ్ టోట‌ల్ డిఫ‌రెంట్‌..

Big Stories

Advertisement
×