BigTV English

Iran vs Isreal War: మూడో ప్రపంచ యుద్ధం మొదలైంది.. ఇరాన్‌‌పై అమెరికా దాడి, రంగంలోకి బీ2 బాంబర్లు

Iran vs Isreal War:  మూడో ప్రపంచ యుద్ధం మొదలైంది..  ఇరాన్‌‌పై అమెరికా దాడి, రంగంలోకి బీ2 బాంబర్లు

Iran vs Isreal War:  ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య వార్ తీవ్రమైందా? రంగంలోకి అమెరికా దిగేసిందా? ఇరాన్ న్యూక్లియర్ స్థావరాలపై బీ 2 బాంబర్లను ప్రయోగించిందా? అమెరికా ప్రవేశంతో ఇరాన్ పగతో రగిలిపోతోందా? ఇరాన్‌కు మద్దతుగా చైనా, రష్యాలు కూడా దిగబోతున్నాయా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.


ఇరాన్‌లో న్యూక్లియర్ స్థావరాలు ధ్వంసం చేయాలంటే కేవలం అమెరికా బాంబుల వల్లే మాత్రం సాధ్యమైందని, మా దాడుల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని ఇజ్రాయెల్ చెప్పింది. అన్నట్లుగానే ఇరాన్‌పై అమెరికా దాడికి దిగింది. ఇరాన్ లోని మూడు న్యూక్లియర్ స్థావరాలను ధ్వంసం చేసింది. ఇందుకోసం ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన బీ-2 బాంబర్లను రంగంలోకి దించింది.

ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా వెల్లడించాడు.  ఇరాన్‌లోని ఫోర్డో, నతాంజ్‌, ఇస్ఫాహన్ అణుకేంద్రాలపై భారీ దాడులకు పాల్పడింది అమెరికా. ఈ విషయాన్ని అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా వెల్లడించారు. ఇరాన్‌ గగనతలం బయట నుంచే ఈ దాడులు చేశామని, విమానాలు సురక్షితంగా వెనక్కి వచ్చాయని తెలిపారు.


అమెరికా సైనికులకు అభినందనలు చెబుతూనే ప్రపంచంలో మరే మిలిటరీకి ఇది సాధ్యం కాదని తేల్చేశారాయన. ఇప్పుడు శాంతికి సమయం ఆసన్నమైందంటూ ఓ పోస్టు చేశారు. మరో పోస్టులో ఫోర్డో అణుస్థావరం నాశనమైందని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ సైన్యంతో కలిసి దాడి చేసినట్లు అమెరికా అధ్యక్షుడి మాట.

ALSO READ: ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ కు ఏమైంది? ఇరాన్ మిస్సైళ్లను ఎందుకు అడ్డుకోలేకపోతోంది?

శుక్రవారం రాత్రి మిస్సోరీలోని వైట్‌మాన్ ఎయిర్ బేస్ నుంచి బీ-2 బాంబర్లు పశ్చిమం వైపు వెళ్లినట్లు అగ్రరాజ్య మీడియా వెల్లడించింది. శనివారం నాటికి ఆయా విమానాలు పసిఫిక్ మహా సముద్రం మీదుగా పయనించాయి. ఇంతకీ బీ-2 బాంబర్ల ప్రత్యేకత ఏంటి? స్పిరిట్ బాంబర్లు. 30 వేల పౌండ్ల బంకర్ బస్టర్ బాంబును మోసుకెళ్లే శక్తి సామర్థ్యాలు వీటి సొంతమని సీఎన్ఎన్ తెలిపింది.

ఇరాన్‌లోని పటిష్టమైన ఫోర్డో అణు స్థావరాన్ని ఛేదించగల బాంబర్లు ఇదేనని అమెరికా,ఇజ్రాయెల్ బలంగా నమ్ముతున్నాయి. బీ-2 బాంబర్లను సాధారణ రాడార్లు పసిగట్టే ఛాన్స్ లేదు. వీటికి ఫ్లయింగ్-వింగ్ డిజైన్, రాడార్-శోషక పదార్థాలు, ఇన్‌ఫ్రారెడ్ సిగ్నేచర్ కారణంగా గుర్తు పట్టడం కష్టమని అంటున్నారు. సింపుల్ గా చెప్పాలంటే పక్షిబాంబర్లు అని అంటారు.

పరిస్థితి గమనించిన ఇరాన్, తన అమ్ముల పొదలోని అస్త్రాలను బయటకు తీయాలని నిర్ణయించింది. ఇజ్రాయెల్ ప్రధాన నగరాలపై వాటిని వేయాలని డిసైడ్ అయినట్టు ఆదేశ స్థానిక మీడియా చెబుతోంది.  తమను తామను కాపాడుకోవడానికి ఇదొక్కటే మార్గమని అంటోందని రాసుకొచ్చాయి.

గడిచిన 10 రోజులుగా ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. కీలక నగరాల్లోని డ్యామేజ్ అవుతున్నాయి. వేలల్లో క్షిపణులు రెండు దేశాలు ప్రయోగించాయి. ఇరాన్ వైపు దాదాపు 1000 మంది మరణించినట్టు వార్తలు వస్తున్నాయి. ఇజ్రాయెల్ వైపు 200 మంది చనిపోయినట్టు వార్తలు వస్తున్నాయి.

ఈ దాడుల్లో ఇరాన్‌కు చెందిన అగ్రశ్రేణి సైనిక కమాండర్లు, అణు శాస్త్రవేత్తలు మృత్యువాతపడ్డారు. ఇరాన్ అణు స్థావరాలపై తాము ఎంత దాడులు చేసినా ప్రయోజనం ఉండదని పదేపదే చెబుతోంది. అమెరికా వద్దనున్న బాంబులకు మాత్రమే ఆయా స్థావరాలు ధ్వంసం అవుతాయని చెప్పుకొచ్చింది. అన్నట్లుగానే అమెరికా రంగంలోకి దిగడ, మూడు సైట్లను డ్యామేజ్ చేయడం జరిగిపోయింది.

 

 

Related News

California Murder: అమెరికాలో లైంగిక నేరస్థుడిని హత్య చేసిన భారతీయుడు.. వెబ్ సైట్ లో వెతికి, మారువేషంలో గాలించి మరీ

Netflix: H1-B వీసా ఫీజు పెంపుని సమర్థించిన నెట్ ఫ్లిక్స్ అధినేత..

Larry Ellison: నా ఆస్తుల్లో 95 శాతం పంచేస్తా.. ప్రపంచంలోనే సెకండ్ రిచెస్ట్ పర్సన్ ల్యారీ ఎల్లిసన్ కీలక ప్రకటన

Donald Trump: ఏడు నెలల్లో ఏడు యుద్ధాలు ఆపాను.. అందులో భారత్- పాక్ ఒకటి.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Hanuman Statue: హనుమంతుడి విగ్రహంపై ట్రంప్ పార్టీ నేత అనుచిత వ్యాఖ్యలు.. అమెరికా క్రైస్తవ దేశమా?

Afghan Boy: షిద్ధత్ సినిమా సీన్ రిపీట్.. విమానం ల్యాండింగ్ గేర్‌లో దాక్కుని ఢిల్లీకి చేరిన అఫ్ఘాన్ బాలుడు

Ragasa Coming: భయంతో వణికిపోతున్న చైనా.. బుల్లెట్ ట్రైన్ కంటే వేగంగా ముంచుకొస్తున్న ముప్పు

Britain – China: అమెరికా వెళ్లాలంటే లక్ష డాలర్లు.. బ్రిటన్, చైనా కి మాత్రం ఫ్రీ ఫ్రీ ఫ్రీ

Big Stories

×