OTT Movie : ఓటీటీలో ఒక కన్నడ మూవీ టాప్ రేటింగ్ తో దూసుకుపోతోంది. కోర్ట్‌రూమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకి IMDbలో 8.9/10 రేటింగ్ ఉంది. ఈ వాదనలు ఒక యుద్ధాన్ని తలపిస్తున్నాయి. థియేటర్లలోకి వచ్చిన రెండు నెలల వ్యవధిలోనే ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో
ఈ కన్నడ కోర్ట్‌రూమ్ డ్రామా మూవీ పేరు ‘యుద్ధకాండ చాప్టర్ 2’ (Yuddhakaanda Chapter 2). 2025లో విడుదలైన ఈ సినిమాకు పవన్ భట్ దర్శకత్వం వహించారు. ఇందులో కృష్ణ అజయ్ రావు (భరత్ హనుమంత్), అర్చనా జోయిస్ (నివేదిత), ప్రకాష్ బెళవాడి (రాబర్ట్ డి’సౌజా), టి.ఎస్. నాగభరణ ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమాని శ్రీ కృష్ణ ఆర్ట్స్ అండ్ క్రియేషన్స్, అజయ్ రావు ప్రొడక్షన్స్ బ్యానర్‌ల కింద అజయ్ రావు నిర్మించారు. కె.బి. ప్రవీణ్ సంగీతం, ఎస్.కె. కార్తిక్ శర్మ సినిమాటోగ్రఫీ, మరియు హేమంత్ జోయిస్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. ఈ సినిమా 2025 ఏప్రిల్ 18న థియేటర్లలో విడుదలైంది. జూన్ 20 నుంచి కన్నడ (ఒరిజినల్), తమిళ, తెలుగు, మలయాళం, హిందీ భాషలలొ, అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ అవుతోంది. 2 గంటల 24 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ సినిమాకి, IMDbలో 8.9/10 రేటింగ్ ఉంది.
స్టోరీలోకి వెళితే
ఈ స్టోరీ ఒక ఉద్వేగభరిత సన్నివేశంతో ప్రారంభమవుతుంది. ఇక్కడ నివేదిత (అర్చనా జోయిస్) కోర్టు ప్రాంగణంలో ఒక వ్యక్తిపై మూడు బుల్లెట్లు, అందులో ఒకటి తలపై కాల్చి చంపుతుంది. ఈ హత్య జాకీ అనే వ్యక్తిపై జరుగుతుంది. అతను ఒక రాజకీయ నాయకుడైన జనార్ధన్ సోదరుడు. ఇప్పుడు నివేదితపై ఐపిసి 302 కింద హత్య ఆరోపణలు మోపబడతాయి. ఈ సంఘటన జాతీయ వార్తలలో సంచలనం సృష్టిస్తుంది. భరత్ (కృష్ణ అజయ్ రావు) అనే న్యాయవాది ఈ కేసును తీసుకుంటాడు. అతను ఒక చిన్న లా ఫర్మ్‌లో తన కెరీర్‌ను ప్రారంభిస్తూ, నివేదిత కేసును వాదిస్తాడు. అతనికి వ్యతిరేకంగా అతని మాజీ గురువు, రాబర్ట్ డి’సౌజా (ప్రకాష్ బెళవాడి), 200కు పైగా కేసులలో విజయం సాధించిన అనుభవజ్ఞుడైన న్యాయవాది వాదించడానికి వస్తాడు. ఈ గురువు-శిష్యుడి మధ్య జరిగే వాదనలు కోర్ట్‌రూమ్ లో ఒక యుద్ధ వాతావరణం క్రియేట్ అవుతుంది.
భరత్ కేసు వివరాలను లోతుగా పరిశీలిస్తాడు. నివేదిత ఏడేళ్ల బిడ్డను జాకీ కిడ్నాప్ చేసి, ఆమెపై దాడి చేసి, లైం*గిక వేధింపులకు పాల్పడినట్లు తెలుస్తుంది. నివేదిత ఒక తల్లిగా, ఈ దారుణ ఘటన కారణంగా న్యాయం కోసం ఎదురుచూస్తూ, న్యాయవ్యవస్థ ఆమెకు న్యాయం చేయలేదని భావించి ఈ హత్యకు పాల్పడుతుంది. భరత్ ఈ హత్యను ‘హత్య కాదు’ అని నిరూపించడానికి పోరాడుతాడు. బాధితులకి న్యాయం ఆలస్యం కావడం వల్ల, బాధితుల మనస్తత్వంపై పడే ప్రభావాన్ని కోర్టులో వివరిస్తాడు. భరత్, రాబర్ట్ మధ్య చట్టపరమైన వాదనలు ఒక యుద్ధంలా సాగుతాయి. రాబర్ట్ తన అనుభవంతో, కేసును గెలవడానికి వ్యూహాత్మకంగా ప్రయత్నిస్తాడు. భరత్ తన నమ్మకం, నిజాయితీతో న్యాయం కోసం పోరాడుతాడు. చివరికి ఈ కోర్ట్ రూమ్ లో పై చేయి ఎవరిదవుతుంది. ఈ కేసును భరత్ గెఉస్తాడా ? నివేదిత విషయంలో న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇస్తుంది ? అనే ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : సోషల్ మీడియాలో అమ్మాయి ప్రపోజల్… ఫ్యూజులు అవుట్ అయ్యే ట్విస్ట్ మావా