Tata EV Lifetime Warranty Battery| టాటా మోటార్స్ కొత్తగా లాంచ్ చేసిన టాటా హారియర్ ఈవీ ఎలక్ట్రిక్ SUV మార్కెట్‌లో సరికొత్త ఒరవడిని సృష్టిస్తోంది. ఈ వాహనంలోని బ్యాటరీపై కంపెనీ జీవితకాల వారంటీని ప్రకటించింది.ఎలక్ట్రిక్ వాహనాల విశ్వసనీయతలో ఒక కొత్త ప్రమాణాన్ని నెలకొల్పుతోంది. ఈ వారంటీ బ్యాటరీని అపరిమిత కిలోమీటర్ల వరకు కవర్ చేస్తుంది. దీంతో బ్యాటరీ దీర్ఘకాల వినియోగంపై కస్టమర్లకు ఉండే ఆందోళనలన్నీ తొలగిపోతాయి. టాటా హారియర్ ఈవీ.. కొత్త ఆక్టి.ఈవీ+ ఆర్కిటెక్చర్ పై నిర్మితమైంది. స్థిరమైన రవాణా, అడ్వాన్స్ టెక్నాలజీ వైపు ఈవీ రంగంలో ఒక పెద్ద అడుగు.
పనితీరు, బ్యాటరీ వ్యవస్థ
టాటా హారియర్ ఈవీ రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఒకటి 65 kWh బ్యాటరీతో సింగిల్ మోటార్‌తో వస్తుంది. ఇది 156 బీహెచ్‌పీ శక్తిని ఇస్తుంది. మరొకటి 75 kWh బ్యాటరీతో డ్యూయల్ మోటార్ సెటప్‌లో 309 బీహెచ్‌పీ పవర్, 504 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తుంది. ఈ డ్యూయల్ మోటార్ వేరియంట్ బూస్ట్ మోడ్‌లో 0-100 కి.మీ/గం వేగాన్ని కేవలం 6.3 సెకన్లలో చేరుకుంటుంది.
రెండు వేరియంట్లు 7.2 kW ఏసీ ఛార్జర్, 120 kW డీసీ ఫాస్ట్ ఛార్జర్ సౌకర్యాలను కలిగి ఉన్నాయి. డీసీ ఫాస్ట్ ఛార్జర్‌తో కేవలం 15 నిమిషాల్లో 250 కి.మీ రేంజ్‌ను పొందవచ్చు. ఈ లక్షణాలు హారియర్ ఈవీని ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లో బలమైన పోటీదారుగా నిలబెడతాయి.
అధునాతన ఫీచర్లు, ఇన్-క్యాబిన్ టెక్నాలజీ
హారియర్ ఈవీలో అడ్వాన్స్ టెక్నాలజీ, సౌకర్యవంతమైన ఇంటీరియర్ ఉన్నాయి. 14.53-అంగుళాల డిజిటల్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే సామ్‌సంగ్ నియో క్యూఎల్‌ఈడీ సాంకేతికతతో వస్తుంది. 10-స్పీకర్ జేబీఎల్ సౌండ్ సిస్టమ్ డాల్బీ ఆట్మోస్‌తో అద్భుతమైన ఆడియో అనుభవాన్ని అందిస్తుంది.
ఇంటీరియర్‌లో డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ సీట్లు, ఆంబియంట్ లైటింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
వీటితో పాటు అదనంగా:
భద్రత, వారంటీ
హారియర్ ఈవీలో మల్టీ ఎయిర్ బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి. ఈ సౌకర్యవంతమైన ఫీచర్లు.. నగర రోడ్ల నుంచి ఆఫ్-రోడ్ ప్రయాణాల వరకు భద్రతను అందిస్తాయి.
జీవితకాల బ్యాటరీ వారంటీ ఈ వాహనం యొక్క ప్రధాన ఆకర్షణ. ఈ వారంటీతో ఈ అదనపు ప్రయోజనాలు కలుగుతాయి.
టాటా హారియర్ ఈవీతో పాటు త్వరలోనే టాటా కర్వ్ ఈవీ, టాటా నిక్సాన్ ఈవీ వాహనాల బ్యాటరీలపై లైఫ్ టైమ్ వారంటీ ప్రకటించబోతోందని సమాచారం.
Also Read: అలెక్సా అన్నీ వింటోంది.. ఇంట్లో స్మార్ట్ డివైజ్‌లుంటే ఈ జాగ్రత్తలు పాటించండి
టాటా ఈ లైఫ్ టైమ్ వారంటీ ప్రకటించడంతో సోషల్ మీడియా అంతా ఇదే చర్చ జరుగుతోంది. అసలు ఇది నిజమేనా అని చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.